మా చిత్తశుద్ధినా టీడీపీ ప్రశ్నించేది ? | YSR Congress party MLA Shobha Nagi Reddy takes on Telugu desam party | Sakshi
Sakshi News home page

మా చిత్తశుద్ధినా టీడీపీ ప్రశ్నించేది ?

Published Thu, Feb 13 2014 10:48 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న శోభా నాగిరెడ్డి - Sakshi

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న శోభా నాగిరెడ్డి

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి సమర్థవంతమైన నాయకుడు లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ స్పీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి వెల్లడించారు. ఆ మహానేత ఉండి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు.

 

గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర విభజనపై ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ నేతల డ్రామాలు చూసి జాతీయ నేతలు నవ్వుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్తో కుమ్మకైన మీరా మమ్మల్నీ ప్రశ్నించేది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై శోభానాగిరెడ్డి నిప్పులు చెరిగారు.

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేత సమైక్యమన్న మాట అనిపించ గలిగే దమ్ము, ధైర్యం ఆ పార్టీ సీమాంధ్ర టీడీపీ నేతలకు ఉందా అని శోభా నాగిరెడ్డి ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచే క్రమంలో తమ పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement