'బాబు లేఖ వెనక్కి తీసుకో.. ఒత్తిడి పెరుగుతుంది'
రాష్ట్ర విభజనపై ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత బహిరంగ లేఖ లేఖ రాశారు. సీమాంధ్రలో 40 రోజులుగా కోట్లాది మంది ఆక్రందనలు టీడీపీకి పట్టడం లేదని వారు లేఖలో పేర్కోన్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమిలేదని.. వెంటనే లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు, తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని లేఖలో తెలిపారు. చంద్రబాబు లేఖ వెనక్కి తీసుకుంటే కేంద్ర, రాష్ట్ర మంత్రులపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. బాబు లేఖ వెనక్కి తీసుకుంటే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో వేచి చూద్దాం అని లేఖలో వివరించారు. రాష్ట్ర విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పు నీళ్లు తప్ప.. మంచినీళ్లు దొరకవని చంద్రబాబుకు తెలిపారు. అంతేకాక మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించారు. విభజనతో సంక్షేమ పథకాలు అమలు జరగవు.. సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుందని లేఖలో తెలిపారు.