సింగపూర్ అంటే.. మళ్లీ వ్యవసాయం గల్లంతే
సీమాంధ్రను సింగపూర్ చేయడం అంటే.. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినట్లే అవుతుందని, సింగపూర్లో వ్యవసాయం గానీ, పరిశ్రమలు గానీ లేవన్న సంగతి చంద్రబాబుకు తెలియదా అని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు మండిపడ్డారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. చంద్రబాబు వస్తే మళ్లీ సీమాంధ్రలో ఆయన పాలన నాటి పరిస్థితే వస్తుందని చెప్పారు.
జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే సర్వేలపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం సర్వేలు వద్దని సిఫార్సు చేస్తే అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి చంద్రబాబు అని అన్నారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు అదేంటో చెప్పలేదని సుజయకృష్ణ రంగారావు గుర్తుచేశారు.