శోభానాగిరెడ్డి మృతికి సంతాపం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి మృతి పట్ల ఆ పార్టీ నాయకులు గురువారం సంతాపం ప్రకటించారు. ఆమె మృతి పార్టీకి తీరని
గరివిడి, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి మృతి పట్ల ఆ పార్టీ నాయకులు గురువారం సంతాపం ప్రకటించారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని చీపురుపల్లికి చెందిన వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బెల్లాన రవి(చినబాబు) అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుతూ గరివిడిలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో శోభా నాగిరెడ్డి ముందంజలో ఉండేవారన్నారు. కార్యక్రమంలోఆ పార్టీ నేతలు వాకాడ శ్రీను, సి.హెచ్.సత్యనారాయణరెడ్డి, పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఎస్.కోటలో జరిగిన కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి రొంగళి జగన్నాథం పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించి శోభా నాగిరెడ్డికి నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ సీపీ పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థి జమాన్న ప్రసన్నకుమార్ పార్టీ కార్యాల యంలో సంతాపం ప్రకటించారు. ప్రచారంలో ఉన్న వైఎస్‌ఆర్ సీపీ సాలూరు అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర కూడా శోభా నాగిరెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. శోభా నాగిరెడ్డి మృతి ఆమె కుటుంబానికి, పార్టీకి తీరని లోటని వైఎస్‌ఆర్ సీపీ ద్వారపురెడ్డి సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ వరుపుల సుధాకర్, వైఎస్‌ఆర్‌సీపీ నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి పెనుమత్స సురేష్‌బాబు, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.