నమ్మలేకపోతున్నాం: ఏపీ మంత్రులు | AP Ministers Expresses Grief Over Death Minister Goutham Reddy | Sakshi
Sakshi News home page

నమ్మలేకపోతున్నాం: ఏపీ మంత్రులు

Published Mon, Feb 21 2022 12:15 PM | Last Updated on Mon, Feb 21 2022 12:36 PM

AP Ministers Expresses Grief Over Death Minister Goutham Reddy - Sakshi

సాక్షి, అమరావతి: మంత్రి గౌతమ్‌రెడ్డి మన మధ్యలేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తోటి సహచరుడు ఎప్పుడూ సంతోషంగా ఉండే మనిషి. రాష్ట్ర అభివృద్ధి కోసం దుబాయ్ కూడా వెళ్లి పెట్టుబడుల మీటింగ్‌లో పాల్గొన్నారు. రేపు.. సీఎంతో గౌతమ్ రెడ్డి మీటింగ్ ఉంది. ఈలోపే ఇలా జరగటం బాధాకరం. ఆయన మాట్లాడే తీరు చూస్తే.. ముఖ్యమంత్రి కరెక్టు పర్సన్‌కే ఐటీ మంత్రి ఇచ్చారని అనుకునేవారమని కన్నబాబు అన్నారు.

ఇలా దూరం అవుతారనుకోలేదు..
మంత్రి గౌతమ్‌రెడ్డి మరణ వార్త వినగానే షాక్‌ తిన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పల్స్ డౌన్ అవటం వల్ల ఆస్పత్రికి తీసుకుని వెళ్లారనుకున్నాం. కానీ ఇలా దూరం అవుతారనుకోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌కి వెన్నంటి ఉన్న ఫ్యామిలీ మేకపాటి వారిది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పలు రకాలుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆయన లేని లోటు పార్టీకి తీర్చలేనిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

జీర్ణించుకోలేకపోతున్నాం..
ఏదైనా పని ఉందంటే వెంటనే స్పందించే గుణం గౌతమ్‌రెడ్డిదని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఏదైనా పని ఉందంటే వెంటనే స్పందించే గుణం గౌతమ్‌రెడ్డిది. అలాంటి వ్యక్తి ఇప్పుడు దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నామని మేరుగ నాగార్జున అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement