AP CM YS Jagan Condolences To Konijeti Rosaiah Death - Sakshi
Sakshi News home page

రోశయ్య మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

Published Sat, Dec 4 2021 9:40 AM | Last Updated on Sat, Dec 4 2021 7:38 PM

AP CM YS Jagan Expressed Grief Over Death Konijeti Rosaiah - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’’  సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. అటు తర్వాత రోశయ్య కుమారుడిని ఫోన్‌లో సీఎం జగన్‌ పరామర్శించారు. 

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం (88) కన్నుమూశారు. బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
చదవండి: Konijeti Rosaiah: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement