
మాజీ సీఎం రోశయ్య కుమారుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమన్నారు.
సాక్షి, అమరావతి: మాజీ సీఎం రోశయ్య కుమారుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమన్నారు. రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 4 నుంచి 6 వరకు సంతాప దినాలను ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) శనివారం ఉత్తర్వులిచ్చింది.
చదవండి: రోశయ్యకు నివాళులర్పించిన ఏపీ మంత్రులు
‘‘పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’’ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.