'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు' | Shobha Nagi Reddy takes on kiran kumar reddy, Chandra babu and Nadendla Manohar | Sakshi
Sakshi News home page

'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు'

Published Tue, Jan 7 2014 11:59 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు' - Sakshi

'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు'

విభజన బిల్లు అంకాన్ని త్వరగా పూర్తి చేసి సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరాటపడుతున్నారని శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి ఆరోపించారు.  సీమాంధ్ర నేతలైయుండి ఆ ముగ్గురి నేతలకు ఎందుకింత ఆత్రుత అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టే విషయంలో మాత్రం ఆ ముగ్గురు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

వారంతా సమైక్య ముసుగు తొడిగిన సమైక్యవాదని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఫ్లోర్ లీడర్లు మాత్రమే బీఏసీకి రావాలనేది తమ డిమాండ్ అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఏసీలో పార్టీ విధానం చెప్పాలి, కానీ.. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకుండా స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని శోభానాగిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement