భారీ మెజారిటీతో శోభకు నివాళి: గట్టు | Homage to Shobha Nagi reddy with huge Majority, says Gattu Ramachandra Rao | Sakshi
Sakshi News home page

భారీ మెజారిటీతో శోభకు నివాళి: గట్టు

Published Tue, Apr 29 2014 1:12 AM | Last Updated on Thu, Apr 4 2019 3:02 PM

భారీ మెజారిటీతో శోభకు నివాళి: గట్టు - Sakshi

భారీ మెజారిటీతో శోభకు నివాళి: గట్టు

సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం అభ్యర్థిగా దివంగత భూమా శోభానాగిరెడ్డి పోటీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో... ఆమెకు భారీ మెజారిటీ తీసుకొచ్చి ప్రజలు నివాళి అర్పిస్తారని వైఎస్సార్‌సీపీ నేత గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు.  శోభమ్మ లేకపోయినప్పటికీ... ఈ ఎన్నికల్లో ఆమెకు ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఆళ్లగడ్డ ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘శోభానాగిరెడ్డి మరణం తర్వాత రకరకాల తప్పుడు ప్రచారాలు జరిగాయి. శోభ పేరును బ్యాలెట్ నుంచి తొలగిస్తారని, ఆమె పేరున్నప్పటికీ... పడిన ఓట్లన్నీ నోటా కింద లెక్కేస్తారని... రకరకాల తప్పుడు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చింది. ఎన్నికల్లో శోభ పేరుంటుందని, శోభకు ఎక్కువ ఓట్లు వస్తే ఆమె గెలుపును ప్రకటిస్తూ... ఆ తర్వాత ఉప ఎన్నిక జరుపుతామంటూ ఎన్నికల కమిషన్ పేర్కొంది’ అని గట్టు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement