శోభానాగిరెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తిచేయాలని అభిమానులు పట్టుబట్టీ మరీ చేయించారు. ముందుగా సాధ్యం కాదని చెప్పిన అధికారులు ప్రజలు, అభిమానుల ఒత్తిడి నేపథ్యంలో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు.
నంద్యాల, న్యూస్‌లైన్: శోభానాగిరెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తిచేయాలని అభిమానులు పట్టుబట్టీ మరీ చేయించారు. ముందుగా సాధ్యం కాదని చెప్పిన అధికారులు ప్రజలు, అభిమానుల ఒత్తిడి నేపథ్యంలో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన శోభానాగిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం ఆళ్లగడ్డలో నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా అధికారులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజ లు, అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోతే ఇక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించబోమని తెగేసి చెప్పారు.
శోభానాగిరెడ్డి పార్థీవ దేహంతో ఉన్న వాహనాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘ఒకసారి కాదు నాలుగు సార్లు గెలుపొందిన శోభానాగిరెడ్డి అంత్యక్రియ లు లాంఛనాలతో నిర్వహించకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయంటూ’ భూమా నివాసం వద్ద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సాధ్యం కాదని చెప్ప డం, ఇక్కడ జనం ఆగ్రహించడంతో జిల్లా పోలీసు అధికారులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.అయితే సమస్య జఠిలమైతే శాంతి భధ్రతల సమస్యగా మారుతుందని భావించిన అధికారులు చివరకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాల్సి వచ్చింది.