
రేపు జిల్లాకు జననేత
ఒక రోజు ఆలస్యంగా రానున్న జగన్
కోదాడ, హుజూర్‌నగర్‌లలో సభలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల పక్షాన ప్రచారం చేయడానికి జగన్‌మోహన్‌రెడ్డి 25న కోదాడ, హుజూర్‌నగర్‌లో జరిగే బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు.
అయితే, వైఎస్సార్ సీపీలో కీలకనేత, అసెంబ్లీ డిప్యూటీ లీడర్ అయిన శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు వెళుతున్నారు.
దీంతో జిల్లాలో పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం 25వ తేదీన కాకుండా 26వ తేదీన ఆయన కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొనను న్నారు.
26వ తేదీన కోదాడ, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో జరిగే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.