శోభా నాగిరెడ్డి సంతాప సభలోఆమె భర్త భూమా నాగిరెడ్డి శనివారం కన్నీటిపర్యంతమయ్యారు.
కర్నూలు : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన శోభా నాగిరెడ్డి సంతాప సభలో భూమా నాగిరెడ్డి శనివారం కన్నీటిపర్యంతమయ్యారు. నంద్యాలలో జరిగిన సంతాప సభలో ఆయన పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని భూమా నాగిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.