'చివరి వరకూ జగన్ అడుగు జాడల్లోనే నడుస్తాం' | We will walk in the footsteps of YS Jagan Mohan reddy : Bhuma Nagireddy | Sakshi
Sakshi News home page

'చివరి వరకూ జగన్ అడుగు జాడల్లోనే నడుస్తాం'

Published Tue, Nov 19 2013 1:13 PM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM

'చివరి వరకూ జగన్ అడుగు జాడల్లోనే నడుస్తాం' - Sakshi

'చివరి వరకూ జగన్ అడుగు జాడల్లోనే నడుస్తాం'

కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆపార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి దంపతులు ఖండించారు. తాము పార్టీని వీడుతున్నామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని వారు ఆరోపించారు. ఆ ఛానల్లో ప్రసారం అయిన కథనాలను భూమా దంపతులు మంగళవారమిక్కడ తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఏబీఎన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూమా నాగిరెడ్డి హెచ్చరించారు.

పార్టీలో చేరికలు, రచ్చబండ కార్యక్రమం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తాము హాజరు కాలేకపోయామని భూమా నాగిరెడ్డి తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము కృషి చేస్తామన్నారు. చివరి వరకూ జగన్ అడుగు జాడల్లోనే నడుస్తామని భూమా దంపతులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు చేతనైతే వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఆ రెండు పార్టీల నేతలే తమపై ఏబీఎన్ ఛానల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ కుటుంబంపై అభిమానంతో పార్టీలో కొనసాగుతున్నామని శోభా నాగిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement