శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరు దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరు దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. శాసనసభ వాయిదా అనంతరం ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కిరణ్, చంద్రబాబు బీఏసీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బిల్లు లోపభూయిష్టమని సీఎంకు ఇప్పుడు తెలిసిందా...ఇన్ని రోజులు సీఎం కళ్లు మూసుకొని ఉన్నారా అని మండిపడ్డారు.
కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండటం తెలుగు ప్రజల దురదృష్టమని శోభా నాగిరెడ్డి అన్నారు. ప్రజలను కిరణ్, చంద్రబాబు నిట్టనిలువునా ముంచారని ఆమె ధ్వజమెత్తారు. సభలో తెలంగాణ బిల్లుపై కిరణ్ ప్రసంగం నీరసంగా, నిర్వేదంగా సాగిందన్నారు. విభజన నిర్ణయం బాధపెట్టిందన్న కిరణ్ మరి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.