'హైదరాబాద్ యూటీ అంటే ఊటీలో షూటింగ్ కాదు'
రాష్ట్ర విభజన నేపథ్యంలో అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రాంతాల మధ్య సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చిచ్చుపెట్టి అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి శనివారం నిజామాబాద్లో ఆరోపించారు. సీఎం కిరణ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రవిభజనపై కేంద్రంలో,రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి విధి విధానాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి హైదరాబాద్ను యూటీ చేయడమంటే ఊటీకి వెళ్లికి షూటింగ్ చేసినట్లు కాదని నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. షరతులు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి ఇటీవల కాంగ్రెస్ అధిష్టాన్నాన్ని, కేంద్ర మంత్రుల బృందాన్ని కలసి హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నాగం పైవిధంగా స్పందించారు.