'గుర్రాలతో తొక్కించిన చంద్రబాబును ఎవరూ మరిచిపోరు'
తాళ్లరేవు: తెలుగుదేశం పార్టీ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో నిర్వహించిన రోడ్డుషోలో విజయమ్మ మాట్టాడుతూ.. రాష్ట్రానికి పట్టిన పీడకల చంద్రబాబు పాలన అని వ్యాఖ్యానించారు.
వేతనాలు పెంచాలని ఆందోళన చేపట్టిన వారిని గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు చరిత్రను అక్కాచెల్లెళ్లు మరిచిపోరని విజయమ్మ అన్నారు. రైతులను కాల్పించి పోలీసులను అభినందించిన చరిత్ర చంద్రబాబుదని తాళ్లరేవు సభలో వైఎస్ విజయమ్మ అన్నారు. చంద్రబాబు పాలన అంతా స్కామ్‌లతోనే సాగిందని, సమైక్యాంధ్ర పేరు చెప్పే అర్హత కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదని ఆమె అన్నారు. అభిమానులను తాకట్టుపెట్టిన చరిత్ర చిరంజీవిదన్నారు. చంద్రబాబు, కిరణ్, చిరంజీవి మాటలను ఎవరూ నమ్మేస్థితిలో ప్రజలు ఇప్పుడు లేరని వైఎస్ విజయమ్మ తెలిపారు.
అడ్డగోలుగా విభజించిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే సామర్థ్యం వైఎస్ జగన్‌కే ఉందన్నారు. వైఎస్ఆర్ సీపీ విజయంతో చరిత్ర సృష్టిద్దామని, మన అభివృద్ధి మనమే చేసుకుందామన్నారు. ఓటేసే ముందు ఒక్కసారి వైఎస్‌ఆర్‌ను గుర్తుచేసుకోండని ప్రజలకు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.