సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా రాష్ర్టంలో పరిపాలనే లేనపుడు కిరణ్‌కు ఉత్తమ సీఎం అవార్డు ఇవ్వడం వింతగా ఉందని బీజేపీ నేత, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గ్రామాల వారీగా సర్వే నిర్వహిస్తే ఆయన పనితీరు తెలిసేదని శనివారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాలు తప్ప తెలంగాణ మంత్రులకు, ఆ ప్రాంత సమస్యలు పట్టడం లేదని నాగం విమర్శించారు.
విడిపోతే రాజకీయూలకు కిరణ్ దూరం: లగడపాటి
సాక్షి, తిరుపతి: రాష్ట్రం సమైక్యంగా కొనసాగకుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయాలకు దూరమవుతారని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ నివాసంలో లగడపాటి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే తాను రాజకీయాల్లో ఉండనని చెప్పటాన్ని గుర్తు చేస్తూ అదే మార్గంలో కిరణ్‌కుమార్ కూడా నడుస్తారని ప్రకటించారు. ‘ఇది ముఖ్యమంత్రి నిర్ణయమా?’ అని ప్రశ్నించగా తన అంచనా ప్రకారం ముఖ్యమంత్రి రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పారు.