భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో సభ్యుడు టి.జి.వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ ఈమేరకు సమాధానమిచ్చారు. ’ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? వస్తే సంబంధిత వివరాలు వెల్లడించండి.