Justice Department
-
రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయ శాఖ ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ ఎజెండాపై చర్చించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన కార్యదర్శి రీటా వశిష్ట తదితరులు కోవింద్‌ను కలిశారు. జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం చేయాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. చట్టపరమైన విషయాలపై చర్చించుకున్నారు. ఉన్నత స్థాయి కమిటీకి నితిన్ చంద్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం 8 మంది సభ్యులతో హైలెవెల్ కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలనికేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
ఉమ్మడి పౌర స్మృతిపై కమిటీ వేయలేదు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)అమలుపై ప్రత్యేకంగా కమిటీని వేయాలన్న ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం తెలిపింది. అయితే, ఈ అంశానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని న్యాయశాఖను కోరినట్లు వెల్లడించింది. న్యాయ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకువచ్చే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్–44 ద్వారా కేంద్రానికి ఉందన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. -
జైభీమ్ సినిమాలో కోర్టు సీను డైలాగులు నేనే రాశా
(ఎ. అమరయ్య, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి): ‘సత్వర న్యాయం కోసం పోరు కొనసాగాలి. దేశంలో కోర్టుల ద్వారా ప్రతి పౌరునికీ సత్వర న్యాయం అందాలి. జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే. వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులపై ఉంది’ అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జై భీమ్ సినిమా స్ఫూర్తిప్రదాత జస్టిస్ కె.చంద్రు అభిప్రాయపడ్డారు. పీడిత వర్గాలకు న్యాయం అందించాలన్న దిశగా వచ్చిందే జైభీమ్ సినిమా అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగులకు సత్వర న్యాయం అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. చట్టాలను ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు చట్టాలను బాగా చదివి, అర్థం చేసుకుని అన్వయ, ఆచరణలకు పూనుకోవాలి. అప్పుడే గాలి, నీరు లభించినంత సహజంగా న్యాయాన్నీ అందుకోగలం. హక్కుల కోసం పోరాడినప్పుడు, అసమానతలను నిలదీసినప్పుడు చట్టం తనని తాను లోతుగా శోధించుకునేలా చేయాలి. ఇది కేసులు వేసిన వారికి మాత్రమే దక్కే విజయం కాదు. ప్రజలు చైతన్యం కావడానికి ఉపయోగపడుతుంది. ప్రజాభిప్రాయం చట్టాలను, కోర్టులను ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం విజయం సాధించిన తీరు ఇదే చెబుతోంది. అణగారిన వర్గాలకు సత్వర న్యాయం కోసం అయినా పోరు కొనసాగాలి. అప్పుడే న్యాయమూర్తుల మైండ్‌సెట్ కూడా మారుతుంది. న్యాయవాదులు ఎంత తెలివిగా ప్రశ్నిస్తే తీర్పులు అంత ప్రభావవంతంగా వస్తాయి. 1999లో కోర్టు ధిక్కార చట్టానికి సవరణ జరిగింది. దాని ప్రకారం.. చేసిన వ్యాఖ్య నిజమైతే అది కోర్టు ధిక్కారం కిందకు రాదు. నేను జడ్జిగా ఉన్న ఆరేళ్లలో ఒక్క కోర్టు ధిక్కార కేసులో శిక్ష వేయలేదు. కులానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. కుల వివక్ష, క్రూరత్వాలను అరికట్టడానికి కోర్టులు చట్టాలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. జైభీమ్ సినిమా చెప్పిందదే ఇదో 28 ఏళ్ల నాటి ఘటన. నేను బాధితుల తరఫు లాయర్ని. తీర్పు ఇచ్చింది జస్టిస్ పీఎస్ మిశ్రా. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తెగువ చూపిన మనుషుల కథ అది. వాళ్లు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడమే కాదు.. సమాజంలో అందరి జీవితాలు మెరుగుపడటానికి తోడ్పడ్డారు. ఇలాంటి కేసుల్లో వాదోపవాదాలకు లాయర్లకు దొరికే అవకాశం తక్కువ. పాయింట్ సూటిగా, జడ్జిని తాకేలా క్లుప్తంగా ఉండాలి. అటువంటి అవకాశం నాకొచ్చింది. ఆ సినిమాలో హీరో కోర్టులో చెప్పే డైలాగులు తక్కువ. వేరే వాళ్లు రాస్తే పెడర్ధాలు వచ్చే అవకాశం ఉంటుందని నన్నే రాయమన్నారు. మానవ హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి జస్టిస్ కృష్ణయ్యర్ బొమ్మ కోర్టు సీన్లో పెట్టించింది కూడా నేనే. జై భీమ్ ఈవేళ ఓ నినాదమైంది. కార్మికవర్గాన్నీ, మేధావి వర్గాన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చింది. ఈ సినిమా చూసిన వారందరి నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. ఒకటి.. ప్రస్తుత సమాజంలోనూ ఇంత దుర్భరంగా జీవించే జాతులున్నాయా? ఇందుకు సిగ్గుపడాలి. రెండు.. పోలీసులు ఇంత క్రూరంగా ఉంటారా? అని. గిరిజన జీవితాలపై తీసిన సినిమాను ఓటీటీ ప్లాట్‌పారాల మీద విడుదల చేస్తారా? పేదలు చూసే అవకాశం లేదా? అని అడుగుతున్నారు. అందుకే మార్చిలో థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సినిమాలో నటించకపోయినా చాలా మంది నన్నే హీరో అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. రెండేళ్ల కిందట విజయవాడలో ఓ సెమినార్‌కి వస్తే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈవేళ పరిస్థితి భిన్నంగా ఉంది. సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లేందుకు విమానం ఎక్కితే.. జై భీమ్ స్ఫూర్తిప్రదాత జస్టిస్ చంద్రు మన మధ్య ఉన్నారని ఎయిర్‌హోస్టెస్‌లు మైకుల్లో చెబుతున్నారు. ప్రస్తుతం నేనో సెలబ్రిటీని అయ్యా (నవ్వు). ఉత్తమ తీర్పులతోనే కోర్టుల ఔన్నత్యం ఉత్తమ తీర్పులతో కోర్టుల ఔన్నత్యం పెరుగుతుంది. కోర్టులేమన్నా శిలాశాసనాలా, రాజ్యంగమేమన్నా అంతిమ గ్రంథమా, అదో కాగితపు పులి, బంగాళాఖాతంలో విసిరి వేయండని 1975 దాకా చాలా మంది వాదించారు. జస్టిస్ చిన్నపరెడ్డి మీసా చట్టంపై ఇచ్చిన తీర్పు ఈ అభిప్రాయాన్ని తల్లకిందులు చేసింది. ఇప్పుడు మళ్లీ 1975 నాటికన్నా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు నిదర్శనం అయోధ్య తీర్పు. రాజ్యాంగం పరిష్కారం కాదన్న వారే ఈవేళ తొలినాటి రాజ్యాంగ రాతప్రతుల్ని (సెక్యులరిజం, సోషలిజం పదాలు లేని ప్రతి. 42వ సవరణ ద్వారా అవి రాజ్యాంగంలో చేరాయి) పంచిపెడుతున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను అంబేడ్కర్ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారని ఆరోపించిన వాళ్లే ఈవేళ ఆయన్ను కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఆ పదాలను బుద్ధిజం నుంచి తీసుకున్నట్టు అంబేడ్కర్ 1954లో ఆకాశవాణి ప్రసంగంలో చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతోంది గిరిజనులే... పర్యావరణాన్ని నిజంగా కాపాడుతోంది గిరిజనులే. అటువంటి వారిపై అటవీ చట్టాల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజానికి ఎస్టీలలో సామాజిక మండళ్లు ఉంటాయి. సొంత ప్రవర్తనా నియమావళి ఉంది. దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ ఇప్పటికీ డీనోటిఫైడ్ జాతుల పేరిట గిరిజనుల బతుకుల్ని బుగ్గి పాల్జేస్తున్నారు. అపరిష్కృత కేసుల్లో తిరిగి వాళ్లనే అరెస్ట్ చేస్తున్నారు. -
రాష్ట్రంలో 42 విలేజ్ కోర్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 2, చిత్తూరులో 1, తూర్పు గోదావరిలో 1, గుంటూరు జిల్లాలో 12, కృష్ణాలో 2, కర్నూలు జిల్లాలో 3.. ప్రకాశం జిల్లాలో 8, నెల్లూరు జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరిలో 2, వైఎస్సార్ కడప జిల్లాలో 2 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేసింది. ఒక్కో గ్రామ న్యాయాలయానికి జూనియర్ సివిల్ జడ్జి లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్ క్యాడర్) అధికారి గ్రామ న్యాయాధికారిగా ఉంటారు. ప్రతి గ్రామ న్యాయాలయానికి ఒక సూపరింటెండెంట్, ఒక స్టెనోగ్రాఫర్,కొక జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఒక ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు. జీతాలు ఇతర ఖర్చుల కింద ఒక్కో గ్రామ న్యాయాలయానికి రూ.27.60 లక్షలు చెల్లిస్తారు. ఫర్నిచర్ కొనుగోలు, లైబ్రరీ ఏర్పాటు కోసం రూ.2.10 కోట్లు ఇస్తారు. గ్రామ న్యాయాలయాల చట్టం–2008 కింద వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. -
‘న్యాయశాఖ’ జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బిహార్‌లో జరిగిన ఆల్ ఇండియా న్యాయశాఖ ఉద్యోగ సంఘాల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 రాష్ట్రాల సంఘాలు ఆ సమావేశానికి హాజరుకాగా, దేశంలోని 78 శాతం సంఘాలు లక్ష్మారెడ్డికి మద్దతు తెలిపాయి. రంగారెడ్డి జిల్లాలోని కుమ్మేర గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 నుంచి జాతీయ న్యాయశాఖ ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు -
నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 27 నుంచే ఈ నియామకం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటి వరకు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలకు నిష్పాక్షికమైన, అర్థవంతమైన న్యాయం అందించే లక్ష్యంగా సమీకృత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 1987లో నల్సాను స్థాపించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా(ఎస్సీఎల్ఎస్సీ) కూడా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో ఎస్సీఎల్ఎస్సీలో పెండింగ్ కేసులు తగ్గాయి. జనవరి 2018 లో 3,800 కేసులు ఉండగా.. ఆగస్టు 2019 నాటికి 1811కు తగ్గాయి. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం జామ్‌నగర్ హౌజ్‌లోని నల్సా కార్యాలయం సందర్శించారు. నల్సా డైరెక్టర్ సునీల్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించారు. న్యాయ సేవలు అందించడంలో సమర్థతను, న్యాయ సేవలు పొందగలిగే అవకాశాలను పెంపొందించడంపై చర్చించారు. నల్సా భవిష్యత్తు కార్యక్రమాలకు మార్గదర్శకంగా జస్టిస్ ఎన్.వి.రమణ ఒక విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించారు. లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ సమర్థవంతంగా పనిచేసేలా చూడడం, డిజిటైజేషన్ చేయడం, న్యాయ సేవలు పొందడంలో ప్రొటోకాల్ రూపొందించడం వంటి కార్యక్రమాలపై నల్సా దృష్టిపెట్టనుంది. -
తదుపరి సీజేఐగా బాబ్డే పేరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కేంద్రానికి లేఖ రాశారని అధికారులు తెలిపారు. సీనియారిటీ పరంగా ఎస్ఏ బాబ్డేను తదుపరి సీజేఐగా నియమించాలంటూ కేంద్ర చట్టం, న్యాయ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 3న 46వ సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ రంజన్‌గొగోయ్ బాబ్డే పేరును ప్రతిపాదిస్తూ లేఖ రాశారు. ఒకవేళ జస్టిస్ బాబ్డే పేరు ఖరారైతే ఆయన 2021 ఏప్రిల్ 3 వరకు అంటే 17 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. అనంతరం సీనియారిటీ పరంగా జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు వరుస క్రమంలో ఉన్నారు. ప్రస్తుతం జస్టిస్ గొగోయ్ పంపిన లేఖను న్యాయ శాఖ నిపుణులు పరిశీలించి ప్రధాన మంత్రికి అందజేస్తారు. అనంతరం ప్రధాన మంత్రి ఈ పదవి గురించి రాష్ట్రపతికి సలహాలు ఇస్తారు. అధికారిక నియామక పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న జడ్జీలలో, సీనియర్ జడ్జీని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. -
ధైర్యం, నైతిక విలువలతో మంచి విజయాలు
హైదరాబాద్: నమ్మకం, ధైర్యం, నైతిక విలువలు పాటించడం ద్వారా న్యాయవాదులుగా మంచి విజయాలను సాధించవచ్చని హైకోర్టు (ఏసీజే) ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ పేర్కొన్నారు. శామీర్‌పేట్ గ్రామ పరిధిలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన ఐదు రోజుల న్యాయవాదుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులు చిరునవ్వుతోనే జయాపజయాలు సాధించవచ్చన్నారు. న్యాయవాదులు తన రోజువారీ వృత్తిలో భాగంగా కేసు పూర్వాపరాలకు సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోనే విధంగా వ్యాజ్యాన్ని నివేదించేందుకు ప్రాథమికంగా పాటించాల్సిన విషయాలను వివరించారు. ప్రతీ న్యాయవాది సమాజానికి ఒక బోధకుడిగా ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం కేటాయించిన కార్పస్ ఫండ్‌పై వచ్చిన వడ్డీతో న్యాయవాదులకు ఆరోగ్యబీమా, ఆర్థిక సహా యం వంటి పలు సహకారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న న్యాయవాదులకు ప్రతి ఒక్కరికి రూ.10వేలు ఆర్థిక సహాయంతోపాటు పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ట్రస్టు చైర్మన్, అడ్వొకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్, యువన్యాయవాదులనుద్దేశించి పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో ట్రస్టు సలహాసభ్యులు మోహన్‌రావు, నల్సార్ రిజిస్ట్రార్ బాలక్రిష్ణారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు మహమ్మద్ అలీ, బాబా తెల్కర్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తదుపరి సీఈసీ సునీల్ అరోరా!
న్యూఢిల్లీ: తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సునీల్ అరోరా నియమితులు కానున్నారు. ఆయన నియామకాన్ని కేంద్రం నిర్ధారించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని న్యాయశాఖలోని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపాయి. ప్రస్తుత సీఈసీ ఓపీ రావత్ స్థానంలో డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణను సీఈసీగా ఆయనే పర్యవేక్షిస్తారన్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హరియా ణా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగు తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు, లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 1980 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా ఎన్నికల కమిషనర్‌గా 2017, ఆగస్ట్ 31న నియమితులయ్యారు. అంతకుముందు సమాచార, నైపుణ్యాభివృద్ధి శాఖల్లో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ప్లానింగ్ కమిషన్‌లో, ఆర్థిక, టెక్స్టైల్ శాఖల్లో, ఇండియన్ ఎయిర్ లైన్స్ సీఎండీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. -
జూన్ 2 నుంచి లాయర్లకు హెల్త్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమనిధి కోసం గతంలో కేసీఆర్ సర్కార్ కేటాయించిన రూ.వంద కోట్లపై వచ్చిన రూ.23 కోట్ల వడ్డీని న్యాయవాదుల సంక్షేమానికి వెచ్చి ంచాలని తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ నిర్ణయించింది. శనివారం సచివాలయం లో న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లాంఛనంగా న్యాయవాదులకు హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్నారు. అదేరోజు మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. న్యాయవాదికి రూ.2 లక్షల మేరకు ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రమాదంలో మరణిస్తే ప్రమాద బీమా పథకం కింద కుటుంబసభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సా యం చేయాలని సమావేశం నిర్ణయించిందని చెప్పారు. -
ఏకకాలంలో ఓకేనా?
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం యోచనలో స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దేశమంతటా ఏకకాలంలో నిర్వహించే విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రం కోరనుంది. ఇందుకోసం లా కమిషన్ న్యాయ శాఖకు నివేదిక అందించనుంది. లా కమిషన్‌తోపాటు నీతి ఆయోగ్ దేశమంతా ఏకకాలంలో 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే మేలని భావిస్తోంది. ఈ నివేదికలను కేంద్రం ఈసీకి పంపి, అభిప్రాయం తెలపాల్సిందిగా కోరనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఒకటే జాతి, ఒకటే ఎన్నిక’ అన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లా కమిషన్ ముసాయిదా పత్రంలో దేశమంతా ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీలకు మొదటి దశ 2019లో, రెండో దశ 2024లో ఎన్నికలు జరపాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించటంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అసెంబ్లీల కాలపరిమితిని కుదించటం లేదా పొడిగించటం చేయాలని సూచించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ఇటీవల మాట్లాడుతూ..‘ఏకకాలంలో ఎన్నికల విధానాన్ని ఆచరణలోకి తేవటానికి చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. ఇందుకు సమయం పడుతుంది. అన్నీ పూర్తయితే, ఎన్నికల సంఘం అమలు చేస్తుంది. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్ చేస్తుంది’ అని అన్నారు. -
‘పంచాయతీ’ ప్రత్యక్షమే
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్షం.. పరోక్షం.. పెద్ద వాటికి పరోక్షం, చిన్న వాటికి ప్రత్యక్షం.. ఇలా రకరకాల ఆలోచనల తర్వాత పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఓ స్పష్టతకొచ్చింది. ఎప్పట్లాగే గ్రామ పంచాయతీల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. బుధవారం కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త పంచాయతీరాజ్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ తర్వా త గురువారం బిల్లుకు ఆమోదముద్ర పడనుంది. పరోక్ష విధానంలో ఎన్నికలు జరిపేలా చట్టానికి సవరణ చేసే కసరత్తు జరుగుతోందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. బిల్లుపై గత రెండుమూడ్రోజులుగా న్యాయశాఖ, పంచాయతీరాజ్ శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. చివరకు మంగళవారం సీఎం ఆదేశంతో ప్రత్యక్ష విధానానికే మొగ్గు చూపుతూ బిల్లు రూపొందించారు. షార్ట్ సర్క్యులేషన్ విధానంలో మంత్రివర్గం ఆమోదం పొందటంతో బుధవారం నేరుగా సభలో ప్రవేశపెట్టనున్నారు. చివరిరోజున కాగ్ నివేదికను కూడా ప్రభుత్వం సభ ముందుంచనుంది. రాష్ట్రంలో కొత్తగా 4,380 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలో పంచాయతీల సంఖ్య 12,740కు చేరనుంది. -
తండాలన్నీ ఎస్టీలకు కాదు!
సాక్షి, హైదరాబాద్ : .. ఈ పరిస్థితి రెండు గ్రామ పంచాయతీలకే పరిమితం కావడం లేదు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటవుతున్న వందలాది తండాల్లో ఈ సమస్య తలెత్తనుంది. ఇతర వర్గాల ఓటర్లు కనీసం పది మంది కూడా లేనిచోట రిజర్వేషన్ల రొటేషన్లతో ఆయా వర్గాలకు సర్పంచ్ పదవి కేటాయించే పరిస్థితి ఉంటుంది. దీనితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు పాలనా అవకాశం కల్పించాలన్న లక్ష్యం నీరుగారిపోనుంది. ఈ పరిస్థితిని ఊహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏం చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు చేర్చే విషయంపై న్యాయశాఖతో కలసి అధ్యయనం చేస్తున్నారు. 4,122 కొత్త పంచాయతీలు రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మైదాన ప్రాంతాల్లో 500 మంది జనాభా ప్రాతిపదికన.. కొండలు, గుట్టల ప్రాంతాల్లో, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో 300 జనాభా ప్రాతిపదికన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి. చివరిగా మరోసారి జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నారు. కొత్త పంచాయతీలతో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొత్తంగా 12,806కు చేరనున్నాయి. 957 కొత్త పంచాయతీల్లో సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ మారుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని పదవులను పూర్తిగా ఎస్టీ వర్గం వారికే కేటాయిస్తారు. కానీ మైదాన ప్రాంతాల్లోని తండాల్లో రిజర్వేషన్ల రొటేషన్ సమస్య తలెత్తనుంది. రాష్ట్రంలో కొత్తగా 2,243 తండాలు గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానుండగా.. ఇందులో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,286 మాత్రమే. మిగతా 957 తండాల్లో ఇతర వర్గాలకు చెందినవారు కొద్ది సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో సర్పంచ్‌తోపాటు కొన్ని వార్డు సభ్యుల పదవులు ఇతర వర్గాలకు రిజర్వు అయ్యే పరిస్థితి ఉండనుంది. ప్రత్యేక నిబంధనపై కసరత్తు! గ్రామ పంచాయతీలుగా మారే తండాల్లోని ఓటర్లలో ఏ వర్గం వారు ఎంత మంది ఉన్నారన్న విషయంపై పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న తండాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు పూర్తిగా ఎస్టీ వర్గం వారికే రిజర్వు అయ్యేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనను చేర్చాలన్న అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఇక కేవలం నలుగురైదుగురు ఇతర వర్గాల వారున్న పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్ అంశంపైనా చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. డీసీ తండా.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఒక గ్రామ పంచాయతీ. నాలుగు తండాలు కలిపి గ్రామ పంచాయతీగా ఉంది. సమీపంలోని ఓ గ్రామం నుంచి నలుగురు బీసీ వర్గం వారు డీసీ తండాలో స్థిరపడ్డారు. 2013 పంచాయతీ ఎన్నికల సమయంలో డీసీ తండా సర్పంచ్ పదవి రొటేషన్‌లో బీసీలకు వచ్చింది. నలుగురే ఓటర్లున్న వర్గానికి రిజర్వేషన్ రావడంతో గిరిజనులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాంతో ఎవరూ నామినేషన్ వేయక, సర్పంచ్ ఎన్నిక జరగలేదు. వార్డు సభ్యులలో ఒకరు ఉప సర్పంచ్ అయ్యారు. ఆయనే ఇన్చార్జి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాంధన్ తండా.. వర్ధన్నపేట మండలంలోని మరో గ్రామ పంచాయతీ. ఒక్క కుటుంబం మినహా అంతా లంబాడీ తెగవారే. కానీ 2013 ఎన్నికలప్పుడు రిజర్వేషన్ రొటేషన్‌లో సర్పంచ్ పదవి బీసీలకు కేటాయించారు. ఉన్న ఒక్క కుటుంబంలోని వారే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. -
ఆ జీవో నిజం కాకపోతే ఈ వేధింపులేంటి?
-
ఆ జీవో నిజం కాకపోతే ఈ వేధింపులేంటి?
ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 50 ఏళ్లకు తగ్గించే ఆలోచనే లేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి ముసాయిదా జీవో పత్రం రూపొందించ లేదని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇదివరకు స్పష్టీకరించారు. ఇదే నిజమైతే ఈ ముసాయిదా జీవో పత్రాన్ని లీకు చేశారని, దొంగిలించారని ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు ఎలా వేశారు? అంటే ముసాయిదా జీవోను రూపొందించినట్లు ప్రభుత్వం అంగీకరించినట్లే కదా? సీఎం, మంత్రి అబద్ధాలు చెప్పారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. – ఉద్యోగ వర్గాల డిమాండ్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ పెద్దల అసహనం పెరిగిపోతోంది. తమకు నచ్చని పని చేసే వారిని టార్గెట్ చేస్తూ వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపే ముసాయిదా జీవోను లీకు చేశారని ఆరోపిస్తూ సచివాలయంలో వారం క్రితం ఓ ఉద్యోగిపై, తాజాగా మరో ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తమకు సరిపడని అధికారులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడున్నరేళ్లలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. సీఎంకు బంధువైన ఎంవీఎస్ మూర్తికి చెందిన గీతం మెడికల్ కాలేజీకి డీమ్డ్ హోదా ఇవ్వడానికి నిరాకరించారనే నెపంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను యువజన సర్వీసు శాఖకు ప్రభుత్వం మార్చేసింది. పురపాలక శాఖలో పనిచేస్తున్న ఎ.గిరిధర్ కూడా ప్రభుత్వ ఒత్తిళ్లను భరించలేక కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆర్థిక శాఖలో పని చేస్తున్న సీనియర్ అధికారి పి.వి.రమేష్‌ను ఉద్దేశ పూర్వకంగా అటవీ శాఖకు పంపడంతో ఆయన కూడా ఢిల్లీ బాట పట్టారు. విశాఖ భూ కుంభకోణాలకు అనుకూలంగా వ్యవహరిం చలేక, ముఖ్య నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అప్పటి కలెక్టర్ యువరాజ్, లవ్ అగర్వాల్, ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు రాష్ట్రాన్ని వీడి కేంద్ర సర్వీసులకు వెళ్లిన వారే. కొన్ని నెలల కిందట సుమితాదావ్రా కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆమె పట్ల మంత్రి అనుచితంగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆమె రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయారు. ఇక్కడి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేకే ఆంధ్రప్రదేశ్‌ను వీడుతున్నట్లు వీరు ఆయా సందర్భాలలో వెల్లడించిన విషయం విదితమే. సివిల్ సర్వీసులకు చెందిన అధికారులే కాకుండా తహశీల్దారు స్థాయి అధికారులను కూడా ప్రభుత్వ ముఖ్యులు, అధికార టీడీపీకి చెందిన నేతలు వదలడంలేదు. తహశీల్దారు ద్రోణవల్లి వనజాక్షి అంశమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణా శాఖ కార్యదర్శి ఎన్.బాలసుబ్రమణ్యంపై విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులు దాదాపు దాడి చేసినంత పని చేశారు. దుర్భాషలాడారు. ఈ పరంపరలో రిటైర్ అవుతున్న అధికారులనూ వదలడం లేదనేందుకు భన్వర్‌లాల్ ఘటనే నిదర్శనం. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని తగ్గించడానికి జరుగుతున్న లోగుట్టు ప్రయత్నాలు బట్టబయలు కావడాన్ని సాకుగా చూపుతూ ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై వేటు వేయడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రతిపాదనే లేకపోతే దానిని ఎలా దొంగిలిస్తా ‘ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపించే ముసాయిదా జీవో ప్రతిపాదనే లేదని ప్రభుత్వం చెప్పింది. అలాంటపుడు ఆ జీవో ప్రతులను దొంగిలించానని నాపై ఆరోపణలు మోపుతూ నన్ను సస్పెండ్ చేయడం ఎంత వరకు న్యాయం? ఒక ఉన్నతాధికారి అహాన్ని సంతృప్తి పరిచేందుకు మాపై సస్పెన్షన్ వేటు వేశారు. నిజాలు విచారణలో తేలుతాయి. ఈ సస్పెన్షన్ల వ్యవహారాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ దృష్టికి తీసుకెళ్లాము. ఇప్పటికైతే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. రెండు రోజుల్లో వారి స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపడతాం’ అని వెంకట్రామిరెడ్డి మీడియాకు వివరించారు. ముసాయిదా జీవోను పత్రికలకు చేరవేశారట ఉద్యోగులను 50 సంవత్సరాలకే ఇంటికి పంపే ముసాయిదా జీవోను లీకు చేశారని ఆరోపిస్తూ వారం క్రితం న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను న్యాయశాఖ కార్యదర్శి సస్పెన్షన్ చేయడం మరవక ముందే బుధవారం జలవనరుల శాఖ సెక్షన్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డిని ఆదే కారణంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సస్పెండ్ చేస్తూ ఆఫీస్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ముసాయిదా జీవో (విజిలెన్స్ ఫైల్) సమాచారాన్ని దొంగిలించి పత్రికలకు చేరవేశారని వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొన్నారు. దీనిపై సచివాలయ ఉద్యోగులందరూ వెంకట్రామిరెడ్డికి బాసటగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం ఒక పక్క రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుండగా, మరో పక్క సచివాలయం మూడో బ్లాకు వద్ద ఉద్యోగులందరూ సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఉద్యోగులు మండిపడ్డారు. -
ఎట్లా జేసినా లొల్లే!
కొత్త జిల్లాల ప్రకారమా.. పాత జిల్లాల ప్రకారమా? - టీచర్ పోస్టుల భర్తీపై విద్యాశాఖ తర్జన భర్జన - కొత్త జిల్లాల ప్రకారమే చేయాలన్న న్యాయ శాఖ, జీఏడీ - ఆ ప్రకారం కొన్ని జిల్లాల్లో ఒక్క పోస్టు కూడా ఉండని వైనం - నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆందోళన - పాత జిల్లాల ప్రకారం భర్తీ చేస్తే సాంకేతిక సమస్యలు! సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిబంధనలపై ఇటు విద్యాశాఖ అటు ప్రభుత్వాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెలువడిన వారం రోజుల్లో 8,972 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతంలో ప్రకటించారు. ఆ సమయం దగ్గరపడటంతో ఇపుడు కొత్త సమస్య తెరపైకి వచ్చిం ది. పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా? లేక పాత జిల్లాల ప్రకారమా అని అధికారులు అయోమయంలో ఉన్నారు. వరంగల్‌లో మంగళవారం నిరుద్యోగ అభ్యర్థులు ఆయన్ను కలసిన సందర్భంలో ఈ విషయమై ఆలోచిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పినట్లు సమాచారం. కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేస్తే కొన్ని జిల్లాల్లో ఒక్క స్కూల్ అసిస్టెం ట్ పోస్టు కూడా లేకపోవడం, పోస్టులు లేకుం డా నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పాత జిల్లా ల ప్రకారం చేపడితే న్యాయపర, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. అసలే లేకపోతే ఎలా? ఈ 8,972 పోస్టుల్లో తెలుగు మీడియంలో 4,779 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులుండగా.. 1,754 మాత్రమే స్కూల్ అసిస్టెం ట్ పోస్టులు ఉన్నాయి. మరో 374 పీఈటీ పోస్టులు, ఉర్దూ మీడియంలో 900 పోస్టులున్నాయి. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులే లేవని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేస్తే సమస్యలొస్తాయని జిల్లాల వారీ పోస్టుల వివరాలను విద్యాశాఖ బయటకు రానివ్వడం లేదు. పాత జిల్లాల ప్రకారం నియమితులైన టీచర్లు పాత జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల సమీప పాఠశాలల్లో పని చేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత వారికి స్థాని కత ఆధారంగా శాశ్వత కేటాయింపులు జరపలేదు. దీంతో కొత్త జిల్లాల స్థానికతగల టీచర్లు పాత జిల్లా కేంద్రాలు, వాటి సమీప పాఠశాలల్లో ఉన్నందున అక్కడ ఉపాధ్యాయ ఖాళీలు లేవని, కాబట్టి తాము నష్టపోవాల్సి వస్తుం దని నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి పోస్టులు లేని జిల్లాల్లో పరిశీలన జరిపి, గతం లో హేతుబద్ధీకరణతో పాఠశాలలను మూసివేసి, డీఈవోల పరిధిలోకి తెచ్చిన పోస్టులను భర్తీ చేస్తే సమస్య ఉండదన్న భావన అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎలా భర్తీ చేయాలి? కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక నిబంధనలపై విద్యాశాఖ సీనియర్ అధికారులతో ప్రభుత్వం గతంలోనే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ప్రకారం ఆయా జిల్లాల డీఈవోలే నియామక పత్రాలు అందజేయాలని కొంతమంది అధికారులు పేర్కొనగా, మరికొంత మంది పాత జిల్లా ల ప్రకారం చేపట్టాలన్నారు. టీచర్ల శాశ్వత కేటాయింపులు జరగనందున పాత జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టి, ఉద్యోగులను పంపించిన ఆర్డర్ టు సర్వ్ ప్రతిపాదన కొత్తగా నియమితులైన వారిని కేటాయించాలన్నారు. దీనిని న్యాయ శాఖ, జీఏడీ పరిశీలనకు పంపగా.. కొత్త జిల్లాలు ఏర్పడినందున, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినందున, ఆ ప్రకారమే భర్తీ చేయాలని, లేదంటే న్యాయపర వివాదాలు తలెత్తుతాయని సూచించినట్లు తెలిసింది. -
ఎస్సై అభ్యర్థుల్లో ‘ఆంగ్ల’ గుబులు!
ఎంపికలో ఇంగ్లిష్ మార్కుల వెయిటేజీపై ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గతే డాది నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) మెయిన్స్ పరీక్ష... అభ్యర్థుల్లో ‘ఆంగ్ల’ గుబులు రేపుతోంది. అభ్యర్థుల ఎంపికలో తెలుగు/ ఉర్దూతోపాటు ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు వెయి టేజీ ఉండటం తెలుగు మీడియం చదివిన 75% మంది అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నోటిఫికేషన్లో ఉన్న ఈ నిబంధనవల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ గతంలో నా లుగుసార్లు డీజీపీ కార్యాలయం ముట్టడి, సచివాలయం వద్ద ఆందోళన చేపట్టినా వెయి టేజీ వ్యవహారంలో వెనక్కి వెళ్లడం కుద రదని న్యాయశాఖ తాజాగా తేల్చిచెప్పడంతో వేలాది మంది అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం... ఎస్సై సివిల్, ఫైర్ విభాగాల్లోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో పేపర్–1, 2లతోపాటు పేపర్–3 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్–4 తెలుగు (డిస్క్రిప్టివ్)ల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా రు. వాస్తవానికి పేపర్–3, 4లలో సాధించిన మార్కులను వెయిటే జీగా తీసుకొని తుది ఎంపికలో పరిగణన లోకి తీసుకుంటామని నోటిఫికేషన్లో బోర్డు స్పష్టం చేసింది. దీనిపై నిరుద్యోగ సంఘాలు గతంలో ఆందోళనబాట పట్టా యి. సీఎం కేసీఆర్‌ను కలసి వినతిపత్రం సమర్పించాయి. అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన సీఎం కేసీఆర్...వెయిటేజీపై పునఃపరిశీలించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంగ్లిష్‌ను కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తామని అధికారులు సైతం మౌఖికంగా పేర్కొన్నారు. కానీ నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సివిల్, ఫైర్ విభాగాల్లోని పోస్టులకు పేపర్–1, 2, 3, 4లలో మొత్తం 600 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తున్నట్లు సమాచారం. వెయిటేజీపై కుదరదన్న న్యాయశాఖ... సీఎం ఆదేశంతో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వెయిటేజీ వ్యవహారంపై న్యాయశాఖ సలహా కోరగా నాలుగు రోజుల క్రితం బోర్డు ఉన్నతాధికారులకు సలహా అందింది. ఇంగ్లిష్ వెయిటేజీని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని, ఒకసారి నోటిఫికేషన్లో వెయిటేజీ గురించి స్పష్టంగా పేర్కొని నియామక ప్రక్రియ చేపట్టాక వెనక్కి వెళ్లడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆందోళనలో పడింది. కోర్టుకు చేరితే నోటిఫికేషన్ రద్దు! నోటిఫికేషన్లో పేర్కొన్న వెయిటేజీ అంశాన్ని ఒకవేళ పక్కన పెట్టి ఫలితాలు ప్రకటిస్తే వివాదం కోర్టుకు చేరుతుందని, నోటిఫికేషన్ కు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం వల్ల నోటిఫికేషనే రద్దయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళనలో ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు.. ఆగస్టు మొదటి వారంలో ఎస్సై పోస్టుల ఫలితాలు వెల్లడించి, సెప్టెంబర్ నుంచి తొమ్మిది నెలల శిక్షణ మొదలు పెట్టాలన్న ఆలోచనలో పోలీసు శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 510 పోస్టులకు బోర్డు చేపట్టిన నియామక ప్రక్రియలో 56 వేల మందికిపైగా తుది పరీక్ష రాసినట్లు అధికారులు గతంలో తెలిపారు. అందుకే ఆలస్యమా? 2016 ఫిబ్రవరి 2న ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన పోలీసుశాఖ... మూడు దశల్లో జరిగే నియామక ప్రక్రియలో మెయి న్స్ పరీక్షను 2016 నవంబర్ చివరి వారంలో నిర్వహించింది. తుది పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించకపో వడంతో అభ్యర్థులు మార్చిలో ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం నుంచి పలు జీవోలు రావాలని బోర్డు అధికారులు వెల్ల డిస్తూ వచ్చారు. కానీ అసలు కారణం ఇంగ్లి ష్ మార్కుల వెయిటేజీ వ్యవహారమేనని న్యాయశాఖ సలహాతో బయటపడింది. ఇప్పటికే కానిస్టేబుళ్ల ఎంపికలో రిజర్వేషన్లు, కటాఫ్ మార్కులు.. తదితరాల్లో బోర్డుకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంపికలో జరిగిన అవకతవకల వల్ల 48 మంది ఓపెన్ చాలెంజ్ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఎస్సై పరీక్షల్లోనూ కోర్టు ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించి వెయిటేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
అడ్వొకేట్ జనరల్‌గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి
- గవర్నర్ ఆమోదముద్ర.. సర్కారు ఉత్తర్వులు - ప్రకాశ్‌రెడ్డి స్వగ్రామం వనపర్తి జిల్లా అమరచింత - 1977లో న్యాయవాద వృత్తి ప్రారంభం - 1998లో ఉమ్మడి ఏపీలో అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియామకం సాక్షి, హైదరాబాద్/ అమరచింత/ ఆత్మకూరు (కొత్తకోట): రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఆ మేర న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విశ్వాసం ఉన్నంత వరకు ఆయన ఏజీగా కొనసాగుతారు. రాష్ట్రానికి ఆయన రెండో అడ్వొకేట్ జనరల్‌గా ఆయన కొనసాగనున్నారు. మొన్నటి వరకు ఏజీగా ఉన్న రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రకాశ్‌రెడ్డిని ప్రభుత్వం ఏజీగా నియమించింది. ప్రకాశ్‌రెడ్డి వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో 1955 డిసెంబర్ 31న మురళీధర్‌రెడ్డి, అనుసూ యాదేవి దంపతులకు జన్మించారు. 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. అదే ఏడాది డిసెంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి వద్ద జూనియర్‌గా న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1986 నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన ప్రకాశ్‌రెడ్డి 1990లో తన ప్రాక్టీస్‌ను సుప్రీం కోర్టుకు మార్చారు. 1998 వరకు సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేసి తర్వాత తిరిగి హైకోర్టుకు వచ్చారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా నియమితులయ్యారు. 2004 మే వరకు ఆ పోస్టులో కొనసాగారు. 2000 సంవత్సరంలో హైకోర్టు ఆయ నకు సీనియర్ హోదా ఇచ్చింది. అలాగే హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. తన తండి మరణాంతరం ప్రకాశ్‌రెడ్డి స్వగ్రామంలో సొంత ఖర్చుతో అనేక సేవా కార్య క్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రకాశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఇదీ కుటుంబ నేపథ్యం.. అమరచింతకు చెందిన దేశాయ్ మురళీధర్‌రెడ్డి, అనసూయమ్మకు ప్రకాశ్‌రెడ్డి మొదటి కుమారుడు. ఈయనకు తమ్ముడు కరుణాకర్‌రెడ్డి, అక్క సౌజన్యారెడ్డి, చెల్లెళ్లు నలిని, స్వర్ణ ఉన్నారు. మురళీధర్‌రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా రాజకీయాల జోలికి వెళ్లకుండా న్యాయవృత్తిని ఎంచుకుని అంచలం చెలుగా ఎదిగారు. ఆయనకు భార్య గీతారెడ్డి, ఇద్దరు కుమారులు సుధాంశ్రెడ్డి, అభినాష్‌రెడ్డి ఉన్నారు. సుధాంష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, అభినాశ్రెడ్డి న్యాయవాదిగా కొనసాగుతు న్నారు. కాగా, అడ్వొకేట్ జనరల్‌గా తమ గ్రామానికి చెందిన ప్రకాశ్‌రెడ్డి నియమితులు కావడంతో అమరచింత గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నియామకం ప్రకటన వెలువడగానే గ్రామస్తులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. -
సరి‘హద్దు’ల సంగతేంటి?
- నూతన ఠాణాలకు దిక్సూచీలు ఎక్కడ? - ఐదు నెలలు గడిచినా వెలువడని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన పోలీస్స్టేషన్ల సరిహద్దులను ఇప్పటివరకు గుర్తించలేదు. పాత పోలీస్స్టేషన్ల పరిధి నుంచి కొన్ని గ్రామాలు, ప్రాంతాలను విడదీసి నూతన పోలీస్‌స్టేషన్ కిందకు తీసుకు వచ్చారు. అయితే వీటిని గుర్తిస్తూ సంబంధిత నూతన పోలీస్‌స్టేషన్‌కు సరిహద్దు కేంద్రాలను ఉత్తర్వులుగా జారీ చేయాలి. ఆ పోలీస్‌స్టేషన్ కిందకు వచ్చే గ్రామాలు, వాటి వివరాలు పొందుపరుస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. 5 నెలలు గడిచినా ఇప్పటివరకు ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో పాత పోలీస్స్టేషన్ల పేరు మీదే నూతన ఠాణాల అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో కేసుల విచారణలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని పోలీస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు విభాగాల మధ్య.. 92 నూతన పోలీస్స్టేషన్లను కొత్త జిల్లాల్లో భాగంగా ఏర్పాటు చేశారు. దసరా నుంచి కార్యక్రమాలు ప్రారంభించిన ఈ పోలీస్ స్టేషన్లకు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అథారిటీ కూడా కల్పించలేదు. సరిహద్దు రేఖలు, కేసు నమోదు అధికారం లేకపోవడంతో పేరుకే పోలీస్ ఠాణాగా ఉందని ఎస్పీలు ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ సమస్యపై హోంశాఖ–న్యాయశాఖ సమన్వయంతో ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హోంశాఖ నుంచి సంబంధిత సరిహద్దు–ఎఫ్ఐఆర్ అధికార ఉత్తర్వుల ఫైలును న్యాయశాఖకు పంపారని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే న్యాయశాఖలోనే నోటిఫికేషన్ కోసం ఫైలు పెండింగ్‌లో ఉందని స్పష్టం చేశారు. రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం వల్లే అధికారిక ఉత్తర్వులు రావడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉత్తర్వులు వెలువడేలా కృషి చేయాలని ఎస్పీలు, కమిషనర్లు కోరుతున్నారు. -
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం
ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖకు బడ్జెట్ పెంచాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శనివారం ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్, ఓయూ పీజీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ‘జ్యూడిషియల్ రిఫామ్స్’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. పర్వీన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేపటా్టలని, సత్వర న్యాయం అందేందుకు కృషి చేయాలన్నారు. న్యాయమూరు్తల నియామకాల్లో రాజకీయ జోక్యం తగదన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో లోపాలను సవరించి దళిత, బహుజనులను న్యాయమూర్తులుగా నియమించాలన్నారు. కార్యక్రమంలో జయ వింధ్యాల, అశోక్‌యాదవ్, న్యాయకళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తే సహించం ఉస్మానియా యూనివర్సిటీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేసే యత్నాలను మానుకోవాలని ఓయూ విద్యారు్థలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏ కులాన్ని దూషించినా మూడేళ్లు జైలు శిక్ష అనే కొత్త చట్టంతో ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసును పూర్తిగా రద్దు చేయాలని చూస్తే సహించేదిలేదని అంసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ హెచ్చరించారు. -
ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు
ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే యోచన అధికారులతో సీఎం సంప్రదింపులు.. న్యాయశాఖ సలహాకు ఫైలు సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులను అసెంబ్లీ, కౌన్సిల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్ష జరిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశాలను పరిశీలించడంతో పాటు బిల్లులకు సంబంధించిన అంశాల పరిశీలనకు న్యాయ శాఖతోనూ సంప్రదిం పులు జరుపుతున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈలోగా బిల్లుల రూపకల్పనతో పాటు సర్క్యూలేషన్ పద్ధతిలో మంత్రివర్గ ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2007లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 14 ముస్లిం వర్గాలను బీసీ–ఇ కేటగిరీలో చేర్చింది. వీరికి 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీ లు, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా నియమించిన విచారణ కమిషన్ న్యాయపరమైన సలహాలతో పాటు చట్టసభల ఆమోదం పొందేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని నివేదికలో ప్రస్తావించింది. న్యాయ నిపుణుల సలహాతో తమిళనాడులో అమలులో ఉన్న చట్టానికి అనుగుణంగా ముస్లిం రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని సూచించింది. మరోవైపు సుధీర్ కమిషన్ నివేదికలోని అంశాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీఎస్ రాములు బీసీ కమిషన్ పరిశీలనకు అప్పగించారు. ముస్లింలతో పాటు ప్రస్తుతం ఎస్టీలకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్‌ను 12 శాతంకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎస్టీల స్థితిగతులపై ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ చెల్లప్ప ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు చేస్తోంది. -
జీఎస్టీపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: మంగళవారం ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ ఎనిమిదో భేటీలో పలు అంశాలపై ప్రతిష్టంభన నెలకొంది. తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకూ సముద్రం మధ్యలో అమ్మకాలపై పన్ను హక్కు తమకే చెందాలంటూ పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రాలకు చెల్లించే పరిహార నిధిని రూ. 90 వేల కోట్లకు పెంచాలన్న డిమాండ్ నేపథ్యంలో కీలక అంశాలపై చర్చ ముందుకు సాగలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన రెండ్రోజులు జరిగే భేటీలో మంగళవారం ఐజీఎస్టీ(ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ)లోని పలు నిబంధనలపై అంగీకారం కుదిరింది. ముఖ్యమైన ఉమ్మడి నియంత్రణ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. ఐజీఎస్టీ చట్టంలో రాష్ట్రాలకు సంబంధించిన నిబంధనలో తీరం నుంచి 12 నాటికల్ మైళ్లుగా పేర్కొనాలంటూ పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. ఇది చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న దానిపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని తీసుకుంటామని జైట్లీ హామీనివ్వడంతో చర్చ ముందుకు సాగింది. అలాగే పరిహార నిధి కోసం సెస్సు విధించే వస్తువుల సంఖ్య పెంచాలని పలు రాష్ట్రాలు కోరాయి. -
‘అగ్రిగోల్డ్’ జోలికి రావొద్దు!
రూ. వెయ్యి కోట్ల ఆస్తిని కారుచౌకగా కొట్టేసే ఎత్తులు సాక్షి, అమరావతి: వెయ్యి కోట్లు విలువచేసే సదావర్తి భూములను కారుచౌకగా తన అనుయాయు లకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు.. మరో భారీ భూ దోపిడీకి పావులు కదుపుతోంది. తాజాగా ‘ముఖ్య’నేత కన్ను అగ్రిగోల్డ్ భూములపై పడింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేకూర్చే ఉద్దేశంతో సీఆర్డీఏ పరిధిలోని కీసరలో ఆ సంస్థకు చెందిన 350 ఎకరాలను వేలం వేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఎంత లేదన్నా ఇక్కడ భూమి ఎకరా మూడు కోట్లు పలుకుతుంది. తద్వారా దాదాపు రూ. 1000 కోట్లు వసూలయ్యే అవకాశం ఉంది. అయితే ఇంతటి విలువైన భూమిని అతి తక్కువ ధరకు కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ‘ఈ భూమి మనకు తప్ప వేరెవరకీ దక్కకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు’ అంటూ ముఖ్య నేత ఆదేశించడంతో పెద్దలు రెచ్చిపో తున్నారు. వేలం పాటలో ధనవంతులు, శక్తివంతులైన వారు పాల్గొనకుండా ఇప్పటి నుంచే కట్టడి చేస్తున్నారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల వేలం పాటలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు వ్యక్తులను బెదిరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఈ భూముల వెనుక చాలా మంది పెద్దలున్నారు.. ఈ వేలం పాటలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఇలా ఎవరినీ రాకుండా చేసి తన బినామీల ద్వారా కీసరలోని విలువైన భూమిని కాజేసేందుకు ముఖ్యనేత ప్రణాళికలు అమలుచేస్తున్నారు. డిపాజిటర్లకు ప్రభుత్వ దెబ్బ సుమారు 30 లక్షల మంది నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ. 6,830 కోట్ల రూపాయల మేర డిపాజిట్ల రూపంలో సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వడ్డీతో కలిపి డిపాజిట్ దారులకు రూ. 11,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో బాధితులకు న్యాయం చేకూర్చే ఉద్దేశంతో కీసరలో ఆ సంస్థకు చెందిన 350 ఎకరాలను బహిరంగ వేయాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఎంత ఎక్కువ మంది వేలం పాటలో పాల్గొంటే అంత ఎక్కువ మేర ఈ భూములకు ధర వస్తుంది. అయితే వేలం పాట సక్రమంగా జరగకుండా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడం పట్ల సీఐడీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పైగా బెదిరింపులు, హెచ్చరికలతో న్యాయ శాఖకు చెందిన వ్యక్తికి కూడా సంబంధం ఉండటం పట్ల అధికార యంత్రాంగం విస్మయం చెందుతోంది. తొలి నుంచీ కూడా అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన వేలాది ఎకరాలను కౌరు చౌకగా కాజేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు పన్నాగం పన్నిన విషయం తెలిసిందే. ఇదే సంస్థకు చెందిన హాయ్‌ల్యాండ్ భూములను కాజేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు తీవ్ర ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. కాగా, కీసరలోని భూముల వేలం పాటకు ఈ నెల 26వ తేదీ వరకు బిడ్లను స్వీకరించనున్నారు. -
అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదు
-
అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదు
- సీట్లు పెంచాలంటే ఆర్టికల్ 170ని సవరించాల్సిందే - 2026 జనాభా లెక్కల తరువాతే అవకాశం - రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో సభ్యుడు టి.జి.వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ ఈమేరకు సమాధానమిచ్చారు. ’ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? వస్తే సంబంధిత వివరాలు వెల్లడించండి. ఈ విషయంలో కేంద్రం స్పందన ఏంటి?’ అంటూ ఎంపీ టి.జి.వెంకటేశ్ రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి సమాధానమిస్తూ ’ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి విజ్ఞాపన వచ్చింది. ఈ అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. న్యాయ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తరువాత చేసే తొలి జన గణన ప్రచురించేంతవరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య సర్దుబాటు చేయడం కుదరదని అటార్నీ జనరల్ తన అభిప్రాయం తెలిపారు. అందువల్ల ఆర్టికల్ 170ని సవరించకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదు..’ అని స్పష్టం చేశారు. -
ఉద్యమ కేసులు ఎత్తివేస్తాం
ఇప్పటికే 1,500 వరకు ఎత్తివేత: హోంమంత్రి నాయిని సాక్షి, వికారాబాద్: తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో నిర్మించిన పోలీస్‌స్టేషన్, హైవే పెట్రోలింగ్ ఔట్‌పోస్టు, కొడంగల్‌లో నిర్మించిన హైవే పెట్రోలింగ్ ఔట్‌పోస్టు నూతన భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఇప్పటికే 1,500 వరకు ఎత్తివేశామని తెలిపారు. కేసుల ఎత్తివేత విషయంలో రాష్ట్ర కేబినేట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే ఫైళ్లను సచివాలయానికి పంపించాలని, న్యాయశాఖకు నివేదించి నిర్ణ యం తీసుకుంటామని నారుుని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.350 కోట్లు కేటారుుంచారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయంతో రోడ్ సెక్టార్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుందన్నారు. హైదరాబాద్-బీజాపూర్ హైవే నంబర్.4ను డెమో కారిడార్‌గా గుర్తించినట్లు చెప్పారు. పోలీసు అకాడమీ జంక్షన్ నుంచి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వరకు ఈ హైవే 126 కిలోమీటర్లు ఉంటుందని వివరించారు. ఒకప్పుడు ప్రజలు పోలీసుల వద్దకు వచ్చేవారని, ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులే ప్రజల వద్దకు వెళ్తున్నారని హోంమంత్రి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌లో సెంట్రల్ కమాండెంట్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది అందుబాటు లోకి వస్తే రాష్ట్రం మొత్తం శాంతిభద్రతలను అనుక్షణం పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమం లో మంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సర్దుబాటుకే ప్రాధాన్యం!
కొత్త జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం యోచన - ప్రమోషన్లు, నూతన నియామకాలు ప్రస్తుతం లేనట్లే - ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చి కొత్త జిల్లాల్లో కొలువులు - రాష్ట్రం యూనిట్‌గా ఉద్యోగుల కేటాయింపు - శాఖలవారీగా ఉద్యోగుల ప్రణాళికపై సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు వీలుగా ఒకే తరహా పనితీరున్న విభాగాలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఉద్యోగులను ప్రస్తుతమున్న జిల్లాల నుంచి అక్కడే కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు పంపిణీ చేయకుండా... రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా గుర్తించి 27 జిల్లాలకు సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. కొత్త పోస్టులు అవసరమైనా కూడా... నియామకాలు చేపడితే ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో ఉన్న ఉద్యోగులనే అన్ని జిల్లాలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే సీనియర్ ఉద్యోగులకు జిల్లాస్థాయి హోదా ఉన్న అధికారులుగా ప్రమోషన్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించినా.. ఒక్కసారిగా భారీగా ప్రమోషన్లతో ఆర్థిక భారం పడుతుందని భావిస్తోంది. దీంతో ప్రమోషన్లు ఇవ్వకుండా కొంతకాలం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మొత్తంగా ఉద్యోగుల కేటాయింపు తుది ప్రణాళికల తయారీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పది శాఖలతో సమీక్ష కొత్త జిల్లాలకు ఉద్యోగుల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం సచివాలయంలో దాదాపు పది శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్షించారు. ఆయా శాఖలు సమర్పించిన ఉద్యోగుల ప్రణాళికలను విభాగాల వారీగా చర్చించారు. పునర్విభజనతో ఏయే విభాగాలపై ఎలాంటి ప్రభావం ఉంది, సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు ఏయే చర్యలు చేపట్టాలి, ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశాలను ప్రధానంగా పరిశీలించారు. జిల్లా జైళ్లను యథాతథంగా కొనసాగించాలని, అవసరమైతే కొత్త జిల్లాల్లో ఉన్న జైళ్లను జిల్లా జైళ్లుగా మార్చేందుకు న్యాయ శాఖతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. జిల్లాల్లో ఇప్పుడున్న సైనిక సంక్షేమ అధికారిని రీజనల్ సైనిక సంక్షేమ అధికారి హోదా కల్పించి.. ఆ పరిధి లో ఉన్న కొత్త జిల్లాల్లో శాఖ బాధ్యతలు అప్పగిస్తారు. అగ్నిమాపక విభాగంలోనూ ఇదే పద్ధతిని అనుసరించనున్నారు. సమాచార, పౌర సంబంధాల విభాగంలో జిల్లా, డివిజనల్ కార్యాలయాల్లోని ఉద్యోగులందరినీ ఒకే యూనిట్‌గా భావించి మొత్తం 27 జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్‌ను ప్రొటోకాల్ అధికారిగా గుర్తించి, ప్రతి నెలా ప్రొటోకాల్ ఖర్చులకు రూ.లక్ష కేటాయిస్తారు. ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీ కార్యాలయాల్లో ఇప్పుడున్న ఎస్టీవోలు, డీటీవోలను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. ప్రతి జిల్లాకు కొత్తగా ఆడిట్ ఆఫీసర్లను నియమిస్తారు. బడ్జెట్ కేటాయింపులకు వీలుగా ప్రతి జిల్లాకు కొత్త కోడ్లతో పద్దులను రూపొందిస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి శాఖలను విలీనం చేసేందుకు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం జిల్లాల్లో డీఆర్డీఏ, డీడబ్ల్యూఎంఏ (డ్వామా) విడివిడిగా ఉన్నాయి. వేర్వేరు ప్రాజెక్టు డెరైక్టర్లున్నారు. ఈ రెండు విభాగాలను కలిపేసి గ్రామీణాభివృద్ధి విభాగం పేరిట కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఇప్పుడున్న ప్రాజెక్టు డెరైక్టర్లనే కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసే వీలుందని, ఏడు జిల్లాలకు మాత్రమే కొత్త పీడీలు అవసరమని అంచనా వేస్తున్నారు. -
స్తంభించిన న్యాయవ్యవస్థ
- రెండో రోజుకు చేరిన ఉద్యోగుల సమ్మె - ఎక్కడి కేసులు అక్కడే - డిమాండ్లు సాధించుకునే దాకా సమ్మె: ఉద్యోగ సంఘం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టుతోపాటు న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులు రద్దు చేయాలంటూ తెలంగాణవ్యాప్తంగా న్యాయశాఖ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండోరోజుకు చేరింది. ఉదయం 10 గంటలకు కోర్టులకు చేరుకుంటున్న ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. న్యాయాధికారులే స్వయం గా తాళాలు తీసుకొని చాంబర్లలో కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మెకు వెళ్తున్నం దున ఏడు రోజులకు సంబంధించిన రోజువా రీ కేసుల జాబితాను ఉద్యోగులు ఇప్పటికే న్యాయాధికారులకు అందజేశారు. కనీసం కేసు రికార్డులను కూడా న్యాయాధికారుల ముందుంచే పరిస్థితి లేదు. దీంతో ఒక్క కేసూ విచారించే పరిస్థితి లేకుండా పోయింది. న్యాయ శాఖ ఉద్యోగులకు మద్దతుగా సోమవారం నుంచి న్యాయవాదులు కూడా ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఫలితంగా సమ్మె మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. డిమాండ్లు సాధించుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేతలు లక్ష్మారెడ్డి, జగన్నాథం, రాజశేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. హైకోర్టుకు ముందే సమ్మె నోటీసు ఇచ్చినా కనీసం చర్చలకు కూడా పిలవలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. హైకోర్టు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసిందన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. 9 వరకు విధుల బహిష్కరణ న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు లు రద్దు చేయడంతోపాటు న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ విధుల బహిష్కరణ కొనసాగుతుందని న్యాయవాద సంఘాలు స్పష్టం చేశాయి. 4 నుంచి 9 వరకు అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి తెలిపారు. 4న అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన, 5న సర్వమత ప్రార్థనలు, 7న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, జైల్‌భరో, 8న ఉద్యమానికి మద్దతుగా ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడతామన్నారు. 9న సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. -
అసెంబ్లీ సీట్ల పెంపునకు చర్యలు
♦ త్వరలో ప్రక్రియను ప్రారంభించనున్న కేంద్రం ♦ కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే ప్రక్రియను కేంద్రహోంశాఖ త్వరలో చేపట్టనుంది. అసెంబ్లీ స్థానాల పెంపు విషయంపై కూలంకషంగా చర్చించడానికి ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారమిక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎం.వెంకయ్యనాయుడుతోపాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు, కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాల సంయుక్త కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశానంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. న్యాయమంత్రిత్వశాఖ నుంచి రాతపూర్వక అభిప్రాయాన్ని సేకరించి అసెంబ్లీ స్థానాలసంఖ్యను పెంచడానికి వీలుగా ఏపీ విభజన చట్టంలో మార్పులు తెచ్చేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. న్యాయశాఖ అభిప్రాయం కోరుతూ హోంశాఖ ఒకటి, రెండు రోజుల్లో లేఖ రాస్తుందన్నారు. దీనిపై న్యాయశాఖ.. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్నాక మద్దతు తెలుపుతూ హోంశాఖకు పంపిస్తుందని, అప్పుడు ఏపీ విభజన చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును హోంశాఖ రూపొందిస్తుందని వివరించారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. విభజన చట్టంలో ప్రత్యేకించి సెక్షన్ 26 ప్రకారం ఏపీ అసెంబ్లీలో స్థానాలసంఖ్యను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని పేర్కొన్నారని, కానీ అదేచట్టంలో రాజ్యాంగంలోని 175వ అధికరణం ప్రకారం.. అని ఒకమాట చెప్పడంతో దీనిపై రెండురకాల వాదనలు వినిపిస్తున్నాయని చెప్పారు. దీంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే కూలంకషంగా చర్చించి, ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అసెంబ్లీ స్థానాలసంఖ్య పెంపుపై రెండు రాష్ట్రాల్లోనూ భిన్నాభిప్రాయం లేదని, చట్టంలో పేర్కొన్న మేరకు సవరించాలని కేంద్రానికి లేఖలు రాశాయని చెప్పారు. హైకోర్టు విభజనపై న్యాయశాఖ పరిశీలన హైకోర్టు విభజనను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని తెలంగాణకు చెందినవారు ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడతారు, దేశంలో స్వేచ్ఛ ఉంది.. ఎమర్జెన్సీ లేదని ఆయన బదులిచ్చారు. ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వం స్థూలంగా అనుకూలంగా ఉందని న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. పాలనాపరంగా ఉన్న విషయాలను న్యాయశాఖ పరిశీలిస్తోందన్నారు. -
రాష్ర్టంలో సంక్షేమ పథకాల అమలు భేష్
కేంద్ర సామాజిక న్యాయ శాఖ, వివిధ రాష్ట్రాల కితాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా దళితులకు మూడెకరాల వ్యవసాయభూమి పంపిణీ, భూమి అభివృద్ధి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల్లో భాగంగా గరిష్టంగా రూ. 10 లక్షల వరకు (రూ.5 లక్షలు మించకుండా-60 శాతం సబ్సిడీ) రుణాలిచ్చేలా నూతన రాయితీ విధానాన్ని అమలు చేయడాన్ని స్వాగతించాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీల అభ్యున్నతికి వినూత్నంగా పథకాలు, కార్యక్రమాలను చేపడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు అభినందించాయి. బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ.. అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు, ఎస్సీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించింది. ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసుల విచారణ, పీఏవో, పీవోసీఆర్ చట్టాల అమలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార, దాడుల బాధితులకు నష్టపరిహార చెల్లింపుపై ఈ సమావేశంలో సమీక్ష చేశారు. కేంద్రమంత్రి తవార్చంద్ గెహ్లాట్ అధ్యక్షత వహించగా.. సహాయ మంత్రులు విజయ్‌సంప్లా, కిషన్‌పాల్ గుర్జార్, ఈ శాఖ కార్యదర్శి అనిత అగ్నిహోత్రి, అరుణ్‌కుమార్, అయేంద్రి అనురాగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డెరైక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి వైస్‌చైర్మన్, ఎండీ ఎం.వి.రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ఎస్సీశాఖను నిర్వహించే మంత్రి, ఈ శాఖ ఉన్నతాధికారులు హాజరై ఉంటే బావుండేదని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం. తెలంగాణలో అమలు చేస్తున్న ఆయా సంక్షేమ పథకాలు, భూపంపిణీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, కల్యాణలక్ష్మి, ప్రీ, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, నష్టపరిహారాల చెల్లింపు తదితరాల గురించి ఆయన సోదాహరణంగా వివరించారు. -
ముఖ్యమంత్రి చెప్పినా..
♦ ముందుకు పడని అడుగులు ♦ డీఎస్సీల్లో నష్టపోయిన వారి పరిస్థితేంటి? ♦ ముఖ్యమంత్రి వరంగల్‌లో హామీ ఇచ్చి ఏడాది ♦ ఆందోళనలో అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో అడుగు కూడా ముందుకు పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చి సరిగ్గా ఏడాది కావస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. సీఎం పదేపదే చెబుతున్నా.. విద్యాశాఖ, న్యాయ శాఖ.. వివిధ శాఖల పరిశీలన పేరుతోనే కాలయాపన కొనసాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఈ అంశంపై మాట్లాడారు. అయినా ఆచరణ దిశగా అడుగులు పడలేదు. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసినా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. దీంతో డీఎస్సీల్లో నష్టపోయిన నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ అప్పులపాలవుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. గత ఏడాది జనవరిలో కేసీఆర్ వరంగల్‌లో పర్యటించినప్పుడు 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ తరువాత ఒకసారి జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారితోపాటు 2012 వరకు నిర్వహించిన మిగతా 5 డీఎస్సీల్లోనూ నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారందరికి పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అది ఇంతవరకు ఆచరణ కు నోచుకోలేదు. అభ్యర్థులు అధికారులు, మంత్రులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందన లేదు. ఆరు నెలలుగా ఫైలు జీఏడీ, న్యాయ శాఖ పరిశీలనలో ఉందంటూ దాట వేస్తున్నారు.