
న్యాయ మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)అమలుపై ప్రత్యేకంగా కమిటీని వేయాలన్న ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం తెలిపింది. అయితే, ఈ అంశానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని న్యాయశాఖను కోరినట్లు వెల్లడించింది. న్యాయ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతానికి యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకువచ్చే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్–44 ద్వారా కేంద్రానికి ఉందన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment