No plans
-
బిస్లెరీని విక్రయించం: రమేష్ చౌహాన్
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని వెనుకటితరం పారిశ్రామికవేత్త రమేష్ చౌహాన్ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు ఎవరితోనూ చర్చలు నిర్వహించడంలేదని తెలియజేశారు. బిస్లెరీ విక్రయానికి నాలుగు నెలలుగా టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో కంపెనీ చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే బిస్లెరీ కొనుగోలుకి ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని, చర్చలు విరమించుకున్నామని ఇటీవలే టాటా కన్జూమర్ ప్రకటించింది. వెరసి టాటాతో డీల్ చర్చలకు తెరపడిన మూడు రోజుల తదుపరి చౌహాన్ తాజాగా ఇచ్చిన వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. గతేడాది నవంబర్‌లో టాటా కన్జూమర్సహా పలు సంస్థలతో బిస్లెరీ విక్రయానికి చర్చలు జరుపుతున్నట్లు చౌహాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కుమార్తెకు ఆసక్తి లేదు: బిస్లెరీ బిజినెస్‌ను ఇకపై ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేయవలసి ఉన్నట్లు చౌహాన్ వ్యాఖ్యానించారు. అయితే తన కుమార్తె జయంతికి బిస్లేరీ బిజినెస్పట్ల ఆసక్తి లేదని తెలియజేశారు. బాటిల్డ్ వాటర్ విభాగంలో బిస్లేరీ ఇంటర్నేషనల్ ప్రధానంగా బిస్లేరీ బ్రాండుతో బిజినెస్ నిర్వహిస్తోంది. వేదికా బ్రాండుతో స్ప్రింగ్ వాటర్‌ను సైతం అందిస్తోంది. అంతేకాకుండా స్పైసీ, లిమొనాటా, ఫోంజో, పినాకోలాడ బ్రాండ్లతో ఫిజ్జీ డ్రింకులను సైతం ఆఫర్ చేస్తోంది. సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లు థమ్సప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కాలను మూడు దశాబ్దాల క్రితం(1993) యూఎస్ దిగ్గజం కోకకోలాకు చౌహాన్ కుటుంబం విక్రయించిన సంగతి తెలిసిందే. హిమాలయన్ బ్రాండుతో ఇప్పటికే టాటా కన్జూమర్ బాటిల్డ్ వాటర్ విభాగంలో బిజినెస్‌ను కలిగి ఉంది. గ్రూప్ కంపెనీలు టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ కలయికతో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆవిర్భవించింది. హైడ్రేషన్ విభాగంలోని టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో బ్రాండ్లు సైతం ఈ కంపెనీవే. -
ఉమ్మడి పౌర స్మృతిపై కమిటీ వేయలేదు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)అమలుపై ప్రత్యేకంగా కమిటీని వేయాలన్న ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం తెలిపింది. అయితే, ఈ అంశానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని న్యాయశాఖను కోరినట్లు వెల్లడించింది. న్యాయ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకువచ్చే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్–44 ద్వారా కేంద్రానికి ఉందన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. -
చల్లటి మాట చెప్పిన టీసీఎస్
ముంబై: ఐటి కంపెనీల భారీ ఉద్యోగాలకోతతో ఆందోళనలో ఉన్న టెకీలకు ప్రపంచ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) శుభవార్త అందించింది. ఒకవైపు దిగ్గజ టెక్ కంపెనీలు వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంటే టీసీఎస్ సమీప భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా మరింతమంది ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామంటూ తీపికబురు అందించింది. ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కొత్త బీపీవో కేంద్రాన్ని గురువారం లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల కోతపై ప్రశ్నించినపుడు ఖచ్చితంగా అలాంటి ప్రణాలికలేవీ లేవని టీసీఎస్ సీఈవో, ఎండీ, రాజేష్ గోపీనాథన్ వెల్లడించారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా మరింత మందిని టెక్ నిపుణులు నియమించుకోనున్నట్టు తెలిపారు. టిసిఎస్ అధికార ప్రతినిధి ప్రదీప్ బాజీ మాట్లాడుతూ డిటిటల్ ఇండియా ఇనీషియేషన్ తో భవిష్యత్తులో దేశీయ ఐటి రంగంలో మరింత ప్రకాశవంతంగా ఉండనుందన్నారు. ఈనేపథ్యంలో ఎక్కువ మంది వ్యక్తులతో కనెక్ట్ కావడానికి తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. దేశీయ ఐటీ కంపెనీలు కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ఉద్యోగులను తగ్గించుకుంటోంటే టీసీఎస్ ప్రకటన ఆహ్వానించతగినదని మార్కెట్నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా టిసిఎస్ 45 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, ప్రపంచంలోని ఉత్తమ శిక్షణ పొందిన కన్సల్టెంట్లు 387,000 మంది ఉన్నారు. మార్చి 31, 2017 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 17.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమీకరించింది. -
కరెన్సీ విలువ తగ్గింపు లేదు
రూపాయి కరెన్సీ విలువ తగ్గింపుపై వచ్చినవార్తలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. అలాంటి ప్రణాళికలేవీ లేవనిస్పష్టం చేసింది. తాను అలాంటి ప్రకటన ఏదీ తాను చేయలేదని , ఎవరితోనూ చర్చించలేదని పూర్తిగా నిరాధారమైన వార్త అని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. మరోవైపు రూపాయి విలువ మార్కెట్ ద్వారా నిర్ణయించబడుతుంది , అలాంటి విధానం మార్చేందుకు ఎలాంటి ప్రణాళిక లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మీడియాకు స్పష్టం చేశారు. రూపాయి మారకపు విలువను తగ్గించాలంటూ ఆర్థిక శాఖను కోరినట్లు వార్తలొచ్చాయి. గత 20 నెలలుగా ఎగుమతులు క్షీణిస్తున్న నేపథ్యంలో రూపాయి మారకపు విలువను తగ్గిస్తే, ఎగుమతులకు జోష్ వచ్చే అవకాశంముందనే ఉద్దేశంతో వాణిజ్య శాఖ ఆర్థికమంత్రిత్వ శాఖను సంప్రదించినట్టు, ఈ మేరకు రూపాయి విలువను తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఇలా ఉంటే డాలరుతో పోలిస్తే ఉదయం పాజిటివ్ నోట్ ప్రారంభమైన రూపాయి రూపాయి విలువ బలహీనపడింది. 19 పైసల నష్టంతో67.07 దగ్గర ఉంది.