కరెన్సీ విలువ తగ్గింపు లేదు
రూపాయి కరెన్సీ విలువ తగ్గింపుపై వచ్చినవార్తలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. అలాంటి ప్రణాళికలేవీ లేవనిస్పష్టం చేసింది. తాను అలాంటి ప్రకటన ఏదీ తాను చేయలేదని , ఎవరితోనూ చర్చించలేదని పూర్తిగా నిరాధారమైన వార్త అని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. మరోవైపు రూపాయి విలువ మార్కెట్ ద్వారా నిర్ణయించబడుతుంది , అలాంటి విధానం మార్చేందుకు ఎలాంటి ప్రణాళిక లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మీడియాకు స్పష్టం చేశారు.
రూపాయి మారకపు విలువను తగ్గించాలంటూ ఆర్థిక శాఖను కోరినట్లు వార్తలొచ్చాయి. గత 20 నెలలుగా ఎగుమతులు క్షీణిస్తున్న నేపథ్యంలో రూపాయి మారకపు విలువను తగ్గిస్తే, ఎగుమతులకు జోష్ వచ్చే అవకాశంముందనే ఉద్దేశంతో వాణిజ్య శాఖ ఆర్థికమంత్రిత్వ శాఖను సంప్రదించినట్టు, ఈ మేరకు రూపాయి విలువను తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.
ఇది ఇలా ఉంటే డాలరుతో పోలిస్తే ఉదయం పాజిటివ్ నోట్ ప్రారంభమైన రూపాయి రూపాయి విలువ బలహీనపడింది. 19 పైసల నష్టంతో67.07 దగ్గర ఉంది.