Determine Value
-
కీమోథెరపీ అవసరాన్ని తేల్చేస్తుంది!
కేన్సర్ చికిత్సలో ఒకటైన కీమోథెరపీ అవసరమా? వద్దా? తేల్చేసేందుకు ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. సాధారణంగా కేన్సర్ కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తరువాత శరీరంలో మిగిలి ఉన్న కొద్దిపాటి కేన్సర్ కణాలను కూడా నాశనం చేసేందుకు కీమోథెరపీ వాడుతూంటారు. అయితే నూటికి 90 శాతం కేసుల్లో ఈ కీమోథెరపీ పనిచేయదు సరికదా.. అనవసరమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కీమోథెరపీ అవసరాన్ని కచ్చితంగా గుర్తించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కణితి నుంచి వేరుపడి రక్తంలోకి చేరిన డీఎన్ఏ పోగులను గుర్తించడం ద్వారా కీమోథెరపీ అవసరాన్ని కచ్చితంగా గుర్తించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లోని దాదాపు 40 ఆసుపత్రుల్లో ఇప్పటికే కొంత మంది కేన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షించడం ద్వారా కణితి డీఎన్ఏ పోగుల మోతాదుకు, వ్యాధి తీవ్రతకు మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇలా పోగులను గుర్తించడం ద్వారా కొన్ని రకాల కేన్సర్లను గుర్తించవచ్చునని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో అవసరమైన కీమోథెరపీలను నివారించగలిగితే రోగులకు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తగ్గించవచ్చునని అంచనా. -
కరెన్సీ విలువ తగ్గింపు లేదు
రూపాయి కరెన్సీ విలువ తగ్గింపుపై వచ్చినవార్తలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. అలాంటి ప్రణాళికలేవీ లేవనిస్పష్టం చేసింది. తాను అలాంటి ప్రకటన ఏదీ తాను చేయలేదని , ఎవరితోనూ చర్చించలేదని పూర్తిగా నిరాధారమైన వార్త అని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. మరోవైపు రూపాయి విలువ మార్కెట్ ద్వారా నిర్ణయించబడుతుంది , అలాంటి విధానం మార్చేందుకు ఎలాంటి ప్రణాళిక లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మీడియాకు స్పష్టం చేశారు. రూపాయి మారకపు విలువను తగ్గించాలంటూ ఆర్థిక శాఖను కోరినట్లు వార్తలొచ్చాయి. గత 20 నెలలుగా ఎగుమతులు క్షీణిస్తున్న నేపథ్యంలో రూపాయి మారకపు విలువను తగ్గిస్తే, ఎగుమతులకు జోష్ వచ్చే అవకాశంముందనే ఉద్దేశంతో వాణిజ్య శాఖ ఆర్థికమంత్రిత్వ శాఖను సంప్రదించినట్టు, ఈ మేరకు రూపాయి విలువను తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఇలా ఉంటే డాలరుతో పోలిస్తే ఉదయం పాజిటివ్ నోట్ ప్రారంభమైన రూపాయి రూపాయి విలువ బలహీనపడింది. 19 పైసల నష్టంతో67.07 దగ్గర ఉంది.