సాక్షి, హైదరాబాద్: బిహార్‌లో జరిగిన ఆల్ ఇండియా న్యాయశాఖ ఉద్యోగ సంఘాల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 రాష్ట్రాల సంఘాలు ఆ సమావేశానికి హాజరుకాగా, దేశంలోని 78 శాతం సంఘాలు లక్ష్మారెడ్డికి మద్దతు తెలిపాయి. రంగారెడ్డి జిల్లాలోని కుమ్మేర గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 నుంచి జాతీయ న్యాయశాఖ ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment