ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖకు బడ్జెట్ పెంచాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శనివారం ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్, ఓయూ పీజీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ‘జ్యూడిషియల్ రిఫామ్స్’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. పర్వీన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేపటా్టలని, సత్వర న్యాయం అందేందుకు కృషి చేయాలన్నారు. న్యాయమూరు్తల నియామకాల్లో రాజకీయ జోక్యం తగదన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో లోపాలను సవరించి దళిత, బహుజనులను న్యాయమూర్తులుగా నియమించాలన్నారు. కార్యక్రమంలో జయ వింధ్యాల, అశోక్‌యాదవ్, న్యాయకళాశాల అధ్యాపకులు,
విద్యార్థులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తే సహించం
ఉస్మానియా యూనివర్సిటీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేసే యత్నాలను మానుకోవాలని ఓయూ విద్యారు్థలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏ కులాన్ని దూషించినా మూడేళ్లు జైలు శిక్ష అనే కొత్త చట్టంతో ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసును పూర్తిగా రద్దు చేయాలని చూస్తే సహించేదిలేదని అంసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ హెచ్చరించారు.