న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ ఎజెండాపై చర్చించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన కార్యదర్శి రీటా వశిష్ట తదితరులు కోవింద్‌ను కలిశారు. జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం చేయాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
చట్టపరమైన విషయాలపై చర్చించుకున్నారు. ఉన్నత స్థాయి కమిటీకి నితిన్ చంద్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం 8 మంది సభ్యులతో హైలెవెల్ కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలనికేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment