Nitin Chandra
-
రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయ శాఖ ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ ఎజెండాపై చర్చించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన కార్యదర్శి రీటా వశిష్ట తదితరులు కోవింద్‌ను కలిశారు. జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం చేయాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. చట్టపరమైన విషయాలపై చర్చించుకున్నారు. ఉన్నత స్థాయి కమిటీకి నితిన్ చంద్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం 8 మంది సభ్యులతో హైలెవెల్ కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలనికేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. పోలీసులు చెప్పింది ఇదే!
అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్(57) బుధవారం అకస్మాత్తుగా చనిపోయారు. రాయగడ కర్జాన్ లోని తన స్టూడియోలో విగతజీవిగా కనిపించారు. ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్దారించిన పోలీసులు.. దర్యాప్తు చేశారు. అయితే ఎన్నో అద్భుతమైన సినిమాలకు పనిచేసిన నితిన్ దేశాయ్ ఇలా చనిపోవడానికి కారణమేంటి? ఫైనల్‌గా పోలీసులు ఏం తేల్చారు. బుధవారం తెల్లవారుజామున నితిన్ దేశాయ్ చనిపోయారు. ఉదయం ఈ విషయం బయటపడింది ఈయనకు సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ వెబ్‌సైట్స్‌లో వచ్చిన కథనాల ప్రకారం కొన్ని కంపెనీల నుంచి లోన్ తీసుకున్నాడు. (ఇదీ చదవండి: సీనియర్ నటుడు మృతి.. రోడ్డు పక్కన శవమై కనిపించి!) అలా నితిన్ తీసుకున్న రూ. 180 కోట్ల లోన్ కాస్త వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీంత సదరు సంస్థ నితిన్ ఎన్డీ స్టూడియోని సీజ్ చేసేందుకు రెడీ అయిపోయింది. దీంతో ఈ మొత్తాన్ని కట్టలేక సతమతమయ్యాడు. చివరకు తనువు చాలించాడు. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈయనది ఆత్మహత్యగా తేల్చారు. ఉరివేసుకుని ప్రాణం వదిలేశాడని ఎస్పీ చెప్పుకొచ్చారు. అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్ సినిమాలతో నాలుగుసార్లు జాతీయ అవార్డ్స్ సాధించిన నితిన్ ఇలా సడన్‌గా చనిపోవడంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్ రూపొందించిన ఘనత ఈయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ నితిన్ పనిచేసిన బాలీవుడ్ సినిమాలు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
మూడోసారి నిర్మాతగా...!
‘గోదావరి’ చిత్రంలో హీరో సుమంత్‌కు మరదలిగా నటించిన నీతూ చంద్ర గుర్తున్నారా? ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా హిందీ చిత్రాలు చేస్తున్నారు. అది మాత్రమే కాదు. నాలుగేళ్ల క్రితం తన సోదరుడు నితిన్ చంద్రను దర్శకునిగా పరిచయం చేస్తూ, ‘దేశ్వా’ అనే చిత్రం నిర్మించారు. ఆ చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి. ఆ ఉత్సాహంతో నీతూ హిందీలో ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బిహార్’ అనే చిత్రం నిర్మించారు. మొదటి రెండు చిత్రాలూ నిర్మాతగా అభినందనలు తెచ్చిపెట్టడంతో మూడో చిత్రం నిర్మిస్తున్నారు. ‘మిథిలియా మక్కాన్’ పేరుతో తన సోదరుడి దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారామె. ఇప్పటివరకూ యూఎస్, కెనడా, నేపాల్‌లో షూటింగ్ జరుపుకుంది. తదుపరి ముంబైలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. అనురీటా ఝా, పంకజ్ ఝా ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది.