మూడోసారి నిర్మాతగా...! | Neetu Chandra producer Third time | Sakshi
Sakshi News home page

మూడోసారి నిర్మాతగా...!

Published Wed, Dec 2 2015 11:08 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

మూడోసారి నిర్మాతగా...!

మూడోసారి నిర్మాతగా...!

‘గోదావరి’ చిత్రంలో హీరో సుమంత్‌కు మరదలిగా నటించిన నీతూ చంద్ర  గుర్తున్నారా? ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా హిందీ చిత్రాలు చేస్తున్నారు. అది మాత్రమే కాదు. నాలుగేళ్ల క్రితం తన సోదరుడు నితిన్ చంద్రను దర్శకునిగా పరిచయం చేస్తూ, ‘దేశ్వా’ అనే చిత్రం నిర్మించారు. ఆ చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి. ఆ ఉత్సాహంతో నీతూ హిందీలో ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బిహార్’ అనే చిత్రం నిర్మించారు.

 మొదటి రెండు చిత్రాలూ నిర్మాతగా అభినందనలు తెచ్చిపెట్టడంతో మూడో చిత్రం నిర్మిస్తున్నారు. ‘మిథిలియా మక్కాన్’ పేరుతో తన  సోదరుడి దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారామె. ఇప్పటివరకూ యూఎస్, కెనడా, నేపాల్‌లో షూటింగ్ జరుపుకుంది. తదుపరి ముంబైలో  కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. అనురీటా ఝా, పంకజ్ ఝా ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement