Actress Neetu Chandra Entry Into Hollywood Movie Debut With Never Back Down: Revolt Movie - Sakshi
Sakshi News home page

Actress Neetu Chandra: నా కల ఇప్పటికి నెరవేరింది: హీరోయిన్‌

Published Mon, Oct 31 2022 8:59 AM | Last Updated on Mon, Oct 31 2022 10:38 AM

Actress Neetu Chandra Entry into Hollywood Movies - Sakshi

నటి నీతూ చంద్ర గుర్తుందా? తమిళంలో యావరుం నలం, తీరాలి విళైయాట్టు పిళ్లై, ఆది భగవాన్, వైగై ఎక్స్‌ప్రెస్‌ వంటి చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఈమె బాలీవుడ్‌ నటి అన్నది గమనార్హం. యుద్ధం చెయ్‌ చిత్రంలో నీతూ చంద్ర చేసిన ఐటెం సాంగ్‌ కురక్రారును ఉర్రూతలూగించింది. హిందీ, భోజ్‌పురి తదితర భాషా చిత్రాల్లో నటించిన ఈమె నిర్మాతగాను కొన్ని చిత్రాలను నిర్మించింది. తాజాగా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని గురించి నీతూచంద్ర తెలుపుతూ హాలీవుడ్‌ చిత్రాల్లో నటించాలన్నది తన చిరకాల కోరిక అని పేర్కొంది.

అది ఇప్పటికి  నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొంది. హాలీవుడ్‌ రంగ్‌ ప్రవేశం గురించి ఈమె తెలుపుతూ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లడానికి అవకాశాలను మనమే కల్పించుకోవాలని  భావించే వ్యక్తిని తానని చెప్పుకొచ్చింది. ఆ మధ్య విల్‌ స్మిత్‌ నటించిన బ్యాడ్‌ బాయ్స్‌ చిత్రం  ప్రివ్యూను అమెరికాలోని సోనీ పిక్చర్స్‌ స్టూడియోలో ఏర్పాటు చేశారన్నారు. అందులో పాల్గొనడానికి తనకు ఆహ్వానం వచ్చిందని చెప్పింది. అక్కడే నెవర్‌ బ్యాక్‌ డౌన్‌ చిత్రం నిర్మాత డేవిన్‌ జలోన్‌ను కలిసే అవకాశం కలిగిందని తెలిపింది. ఆయన తన ఆత్మరక్షణ విద్యలను చూశారన్నారు. నీతూతో ఆయన నిర్మిస్తున్న యాక్షన్‌ కథా చిత్రం నెవర్‌ బ్యాక్‌ డౌన్‌ రివోల్ట్‌ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించాలని చెప్పింది.

మీరు హాలీవుడ్‌ చిత్రాలు నటిస్తారా? అని పలువురు అడుగుతున్నారని, ప్రస్తుతం అక్కడ మరో రెండు హాలీవుడ్‌ చిత్రాలు నటించడానికి అంగీకరించానని  వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని చెప్పింది. అయితే తమిళ చిత్రాల్లో నటించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. కోలీవుడ్లో తనకు చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పింది. తనను అంతగా ఆదరించిన తమిళ చిత్రాల్లో నటించడానికి ఎప్పుడు సిద్ధమేనని చెప్పుకొచ్చింది. తమిళంలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానంది. హాలీవుడ్‌ స్థాయికి వెళ్లినా తమిళ చిత్రాల్లో నటించే అవకాశాన్ని మాత్రం వదులుకోనని నీతూ చంద్ర పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement