అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్(57) బుధవారం అకస్మాత్తుగా చనిపోయారు. రాయగడ కర్జాన్ లోని తన స్టూడియోలో విగతజీవిగా కనిపించారు. ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్దారించిన పోలీసులు.. దర్యాప్తు చేశారు. అయితే ఎన్నో అద్భుతమైన సినిమాలకు పనిచేసిన నితిన్ దేశాయ్ ఇలా చనిపోవడానికి కారణమేంటి? ఫైనల్‌గా పోలీసులు ఏం తేల్చారు.
బుధవారం తెల్లవారుజామున నితిన్ దేశాయ్ చనిపోయారు. ఉదయం ఈ విషయం బయటపడింది ఈయనకు సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ వెబ్‌సైట్స్‌లో వచ్చిన కథనాల ప్రకారం కొన్ని కంపెనీల నుంచి లోన్ తీసుకున్నాడు.
(ఇదీ చదవండి: సీనియర్ నటుడు మృతి.. రోడ్డు పక్కన శవమై కనిపించి!)
అలా నితిన్ తీసుకున్న రూ. 180 కోట్ల లోన్ కాస్త వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీంత సదరు సంస్థ నితిన్ ఎన్‌డీ స్టూడియోని సీజ్ చేసేందుకు రెడీ అయిపోయింది. దీంతో ఈ మొత‍్తాన్ని కట్టలేక సతమతమయ్యాడు. చివరకు తనువు చాలించాడు. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈయనది ఆత్మహత్యగా తేల్చారు. ఉరివేసుకుని ప్రాణం వదిలేశాడని ఎస్పీ చెప్పుకొచ్చారు.
అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్ సినిమాలతో నాలుగుసార్లు జాతీయ అవార్డ్స్ సాధించిన నితిన్ ఇలా సడన్‌గా చనిపోవడంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్ రూపొందించిన ఘనత ఈయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ నితిన్ పనిచేసిన బాలీవుడ్ సినిమాలు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)
Comments
Please login to add a commentAdd a comment