ఉద్యమ కేసులు ఎత్తివేస్తాం
ఇప్పటికే 1,500 వరకు ఎత్తివేత: హోంమంత్రి నాయిని
సాక్షి, వికారాబాద్: తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో నిర్మించిన పోలీస్‌స్టేషన్, హైవే పెట్రోలింగ్ ఔట్‌పోస్టు, కొడంగల్‌లో నిర్మించిన హైవే పెట్రోలింగ్ ఔట్‌పోస్టు నూతన భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఇప్పటికే 1,500 వరకు ఎత్తివేశామని తెలిపారు. కేసుల ఎత్తివేత విషయంలో రాష్ట్ర కేబినేట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే ఫైళ్లను సచివాలయానికి పంపించాలని, న్యాయశాఖకు నివేదించి నిర్ణ యం తీసుకుంటామని నారుుని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.350 కోట్లు కేటారుుంచారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయంతో రోడ్ సెక్టార్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుందన్నారు. హైదరాబాద్-బీజాపూర్ హైవే నంబర్.4ను డెమో కారిడార్‌గా గుర్తించినట్లు చెప్పారు. పోలీసు అకాడమీ జంక్షన్ నుంచి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వరకు ఈ హైవే 126 కిలోమీటర్లు ఉంటుందని వివరించారు. ఒకప్పుడు ప్రజలు పోలీసుల వద్దకు వచ్చేవారని, ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులే ప్రజల వద్దకు వెళ్తున్నారని హోంమంత్రి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌లో సెంట్రల్ కమాండెంట్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది అందుబాటు లోకి వస్తే రాష్ట్రం మొత్తం శాంతిభద్రతలను అనుక్షణం పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమం లో మంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.