విభజన హామీలు ఎందుకు నెరవేర్చరని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ముఖ్యమైన 10 హామీలను ఇప్పటివరకు నెరవేర్చేదని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. హోదాపై ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా చేశారని, వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు అనుమతించాలని కోరారు.