విభజన హామీల అమలును కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళనల నడుమ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. వెల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల నిరసనల మధ్య ప్రధాని ప్రసంగం కొనసాగించారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎంపీలు నినదించారు.ప్రధాని ప్రసంగానికి ప్రతిపక్షాలు పదేపదే అడ్డుతగలగా..టీడీపీ సభ్యులు మాత్రం మోదీ ప్రసంగానికి అరగంట ముందే ఆందోళన విరమించారు.ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.