విభజన బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
హైదరాబాద్ : శాసనసభలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. విభజన బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
కాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరిగి పంపించేందుకు అసెంబ్లీకి ఇచ్చిన గడువును పొడిగించే విషయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యాక చాలా రోజుల పాటు సభ సజావుగా నడవనందువల్ల సభ్యులందరూ చర్చలో పాల్గొనలేకపోయారని, అందువల్ల బిల్లును తిరిగి పంపించేందుకు మరో 4 వారాల గడువు కావాలని కోరుతూ రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం లేఖ పంపిన విషయం తెలిసిందే.