విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం | Vishakha Petro Varsity bill passed by the Lok Sabha | Sakshi
Sakshi News home page

విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Published Sat, Aug 5 2017 1:49 AM | Last Updated on Sat, Aug 18 2018 9:00 PM

విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం - Sakshi

విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ) బిల్లు– 2017ను లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఇప్పటికే విశాఖలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమైన ఐఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిస్తూ వర్సిటీని ఇన్‌కార్పొరేట్‌ చేసేందుకు గానూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్‌ శుక్రవారం సభలో బిల్లు ప్రవేశపెట్టారు.

రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీ కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల స్థలమిచ్చిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement