
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది, పది సంస్థల విభజనలో ఆలస్యంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంస్థల విభజన ఆలస్యంతో ఏపీ నష్టపోతుందని పిటిషన్‌లో పేర్కొంది.
షెడ్యూల్ తొమ్మిది, పదిలో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు. ఈ సంస్థలు దాదాపు 91శాతం తెలంగాణలోనే ఉన్నాయి. విభజన అంశంపై తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది.
Comments
Please login to add a commentAdd a comment