2026 తరువాతే సాధ్యం
నియోజకవర్గాల పునర్విభజనపై టీఆర్‌ఎస్ ఎంపీకి కేంద్రం స్పష్టం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన శాసనసభ నియోజకవర్గాల పునర్‌విభజన సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో మార్చి 2, 2015న టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఈ అంశాన్ని ప్రస్తావించగా.. దా నికి హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ చౌధురి ఎంపీ వినోద్‌కు జవాబు పంపారు. ‘ఏపీలో ఎమ్మెల్యే సంఖ్యను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నియోజకవర్గాల పునర్‌విభజన చే పట్టాల్సి ఉంది. అయితే ఆర్టికల్ 170కి లోబడి ఉంటుందని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం చె బుతోంది. అందువల్ల ఆ ఆర్టికల్ ప్రకారం ఈ విభజన ప్రక్రియ 2026 తరువాత కానీ సాధ్యం కాదు..’ అని మంత్రి పేర్కొన్నారు.
ఏపీఆర్‌ఏ సవరించండి: వినోద్
కేంద్రమంత్రి రాసిన ఈ లేఖకు బదులుగా ఎంపీ వినోద్‌కుమార్ తిరిగి ఒక లేఖ రాశా రు. ‘మీ లేఖ ఈరోజు అందింది. మీరిచ్చిన జవాబు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఈ విషయంలో మీ వైపు కొంత గందరగోళం నెలకొంది. ఉమ్మడిరాష్ట్రంలో 9 కోట్ల జనాభా ఉంది. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26(1) ఉద్దేశం ఏంటంటే జనాభాకు అనుగుణంగా ప్రాతినిథ్యం పెంచాలి. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో వచ్చిన దోషాల వల్ల ఈ డైల మా. సెక్షన్ 26 (1)లో ఆర్టికల్ 170కి లోబడి అని ఉంది. దానిని ఆర్టికల్ 170కి సంబం ధం లేకుండా అని సవరిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆర్టికల్ 170 ద్వారా నియోజకవర్గాల పునర్‌విభజన జరిపితే.. సెక్షన్ 26(1) పెట్టాల్సిన అవసరం ఏముంది? అందువల్ల దీనిని తక్షణం పరిశీలించండి.’ అని కోరారు.