VinodKumar
-
నవంబర్ 2న హాజరుకండి
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై మౌఖిక సాక్ష్యమిచ్చేందుకు నవంబర్ 2న తమ ముందుకు రావాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను ఎథిక్స్ కమిటీ కోరింది. వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున అక్టోబర్ 31కి బదులుగా నవంబర్ 5న హాజరయ్యేందుకు అవకాశమివ్వాలని శుక్రవారం ఎంపీ మొయిత్రా ఎథిక్స్ కమిటీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఎథిక్స్ కమిటీ చైర్ పర్సన్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకార్ స్పందించారు. పార్లమెంటు, ఎంపీల గౌరవానికి సంబంధించిన అంశమైనందున నవంబర్ 2వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీని కోరారు. ఆ తర్వాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. కాగా, ఎంపీ మొయిత్రాపై లంచం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ దుబే, మొయిత్రా ఒకప్పటి స్నేహితుడు, లాయర్ జై అనంత్ దేహద్రాయ్ గురువారం ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. హీరానందానీకి లాగిన్ ఐడీ ఇచ్చింది నిజమే లంచం ఆరోపణలపై ఎంపీ మొయిత్రా పీటీఐతో మాట్లాడారు. తనపై వారిద్దరూ తప్పుడు, పరువు నష్టం ఆరోపణలు చేసినందున కమిటీ ఎదుట హాజరై వాదన వినిపిస్తానన్నారు. అదానీ గ్రూప్‌తో పాటు మోదీని టార్గెట్ చేసేందుకు మొయిత్రాకు లంచం ఇచ్చారనే ఆరోపణలను అంగీకరిస్తూ హీరానందానీ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించిన విషయం ప్రస్తావించగా.. దీని వెనుక అదానీ గ్రూప్ హస్తం ఉందని మొయిత్రా అన్నారు. పార్లమెంటరీ పోర్టల్ ఐడీ వివరాలను వ్యాపారి హీరానందానికి ఇచ్చిన విషయం నిజమేనని ఆమె ఒప్పుకున్నారు. తనకు సౌకర్యంగా ఉండేందుకే ఆయనకిచ్చానే తప్ప, ఈ విషయంలో ఎటువంటి లాభాపేక్ష లేదని పేర్కొన్నారు. లాగిన్ ఐడీ వివరాలను ఇతరులకు వెల్లడించడం దేశ భద్రతకు ప్రమాదకరం అంటూ దుబే ఆరోపణలు చేశారు. -
Karimnagar: టీఆర్ఎస్లో బయటపడ్డ అంతర్గత విభేదాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ పార్టీలో అంతర్గతపోరుతో కరీంనగర్ జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందుతున్న క్రమంలో జిల్లాలో ఇంటిపోరు రచ్చకెక్కడం పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా రవీందర్‌సింగ్ అల్లుడు సోహన్‌సింగ్ మంత్రిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సోహన్ సింగ్ తీరును మంత్రి వర్గీయులతోపాటు జిల్లా పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ కామెంట్లపై వివరణ ఇవ్వాలంటూ కమల్జిత్కౌర్ దంపతులకు పార్టీ షోకాజ్ జారీ చేసింది. మూడురోజుల్లో సమాధానం చెప్పాలంటూ డెడ్‌లైన్ విధించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే..! వాస్తవానికి ఈ విభేదాలు రాత్రికి రాత్రి మొదలవలేదు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని అలకబూనిన రవీందర్ సింగ్ తిరుగుబాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా రెబల్‌గా నామినేషన్ వేశారు. ఆ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారిపై మంత్రివర్గీయులు కేసులు పెట్టిస్తూ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు. పోలింగ్ రోజు సైతం రవీందర్‌సింగ్, ఆయన అన్న కూతురు కార్పొరేటర్ కమల్జిత్ కౌర్‌లు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టపాసులు కాల్చారన్న అభియోగంపై రవీందర్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. తరువాత ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. వెంటనే పార్టీలోకి పునరాగమనం చేశారు. రీ ఎంట్రీ తరువాత కూడా రవీందర్‌సింగ్, మంత్రి వర్గాల మధ్య విభేదాలు ఏమాత్రం చల్లారలేదు. ఇటీవల కాలంలో కౌన్సిల్ సమావేశంలో నీటికొరతపై కమల్జిత్కౌర్ నిరసన తెలపడం, స్మార్ట్ సిటీ పనులపై రవీందర్‌సింగ్ ఆరోపణలతో మంత్రివర్గంతో అగాథం మరింత పెరిగింది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌పై కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ భర్త సోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యల ఆడియో లీకవడం పార్టీలో చిచ్చురేపింది. మంత్రికి, పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి నేతత్వంలో పలువురు కార్పొరేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. అయితే.. సీఎం కేసీఆర్ ఉత్తరభారతదేశ పర్యటనల నేపథ్యంలో తమకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో మంత్రి వర్గం తమపై రాజకీయ దాడి చేస్తోందని రవీందర్‌సింగ్ వర్గం ఎదురుదాడికి దిగుతోంది. మూడురోజులే గడువు..! పార్టీ ప్రతిష్ట మసకబారేలా, మంత్రి కమలాకర్‌కు పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ మూడు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, ఆమెభర్త సోహన్‌సింగ్‌లకు పార్టీ అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు బుధవారం జారీ చేసిన షోకాజుల్లో స్పష్టం చేశారు. దీంతో మూడురోజుల అనంతరం ఈ దంపతులు ఏమని వివరణ ఇస్తారు? ఆ సమాధానంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు సంతృప్తి చెందుతారా? అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. (క్లిక్ చేయండి: కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) -
2031 నాటికి జనాభా 3.92 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో రాష్ట్ర జనాభా మరో 15 లక్షల మేర పెరుగుతుందని.. మొత్తం జనాభా సంఖ్య 2026 నాటికి 3.86 కోట్లకు, 2031 నాటికి 3.92 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 1.97 కోట్ల మంది పురుషులు, 1.95 కోట్ల మంది మహిళలు ఉంటారని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 3.50 కోట్లుగా ఉన్న తెలంగాణ జనాభా.. 2021 నాటికి 3.77 కోట్లకు చేరిందని వివరించింది. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2021’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విశేషాలను వెల్లడించింది. శనివారం హైదరాబాద్‌లోని అర్థగణాంకశాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో గత కొన్నేళ్లకు సంబంధించిన పలు గణాంకాలను, ప్రస్తుతం వివిధ రంగాల్లో పురోగతి, భవిష్యత్ అంచనాలను వివరించారు. ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్’ నివేదికలో 2020–21 గణాంకాలివే.. ∙ రాష్ట్ర సగటు వార్షిక వర్షపాతం 905.4 మిల్లీమీటర్లుకాగా.. 2020–21లో 1,322.5 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణంతో పోలిస్తే ఇది 46 శాతం ఎక్కువ. ∙ 2014–15లో 66,276 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగ్గా.. 2020–21 నాటికి 1.45 లక్షల కోట్లు దాటింది. అంతకుముందటి ఏడాదితో పోలిస్తే ఈసారి 7.99 శాతం ఐటీ ఎగుమతులు పెరిగాయి. ఈ రంగంలో ప్రస్తుతం 6,28,615 మంది ఉపాధి పొందుతున్నారు. ∙ 2020–21లో 1,04,23,177 ఎకరాల్లో వరి సాగయింది. వానాకాలంలో 52,51,261 ఎకరాల్లో, యాసంగిలో 51,71,916 ఎకరాల్లో వరి వేశారు. ఆ తర్వాత అత్యధికంగా మొక్కజొన్న 6.39 లక్షల ఎకరాల్లో, జొన్నలు 2.24లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ∙ మొత్తంగా 2,18,51,471 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇందులో వానాకాలంలో 96,31,057 టన్నులు, యాసంగిలో 1,22,20,414 టన్నులు వచ్చింది. ఇందులో 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ∙ రాష్ట్రంలో మొత్తం రూ.11,886.70 కోట్ల విలువైన 485.17 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీశారు. రూ.806 కోట్ల విలువైన 239 లక్షల టన్నుల సున్నపురాయి ఉత్పత్తి చేశారు. అన్నిరకాల ఖనిజ వనరులు కలిపి 29,962 కోట్ల విలువైన ఉత్పత్తులు వచ్చాయి. ∙ ఉపాధి విషయానికి వస్తే.. 2020–21లో మొత్తం 12.7 లక్షల మందికి పలు వ్యాపార/వాణిజ్య సంస్థల ద్వారా ఉపాధి లభించింది. ఇందులో దుకాణాల్లో పనిచేసేవారు 5.72 లక్షలుకాగా.. వాణిజ్యసంస్థల్లో 5.76 లక్షలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో 1.22లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ∙ 2020–21లో మొత్తం 66,555 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. 57,007 మిలియన్ యూనిట్లు వినియోగించారు. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో విద్యుత్ వినియోగం 39,519 మిలియన్ యూనిట్లు మాత్రమే. ∙రాష్ట్రంలో రోడ్డెక్కిన కొత్త వాహనాలు 8,22,416. ఇందులో టూవీలర్లు 5.58 లక్షలకుపైగా ఉండగా.. కార్లు/మినీ వ్యాన్లు వంటివి 1.17 లక్షలు, ట్రాక్టర్లు 23,160, రోడ్డు రోలర్లు 61, వ్యవసాయ ట్రాలర్లు 10,891 ఉన్నాయి. ∙ రవాణా వాహనాల విషయానికి వస్తే.. గూడ్స్ క్యారేజీలు 97,633, 5,836 ఆటోలు, 1,458 క్యాబ్‌లు, 43 విద్యాసంస్థల వాహనాలు ఉన్నాయి. ∙ 2020–21లో కొత్తగా రిజిస్టరైన ఆర్టీసీ బస్సుల సంఖ్య 4 మాత్రమే. -
మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు కీలక పదవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. నియామక ఉత్తర్వులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్ లో ఆయనకు అందజేశారు. కేబినెట్ మంత్రి హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మూడేళ్ల పాటు వినోద్ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా సీఎం వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్‌ను ఉపాధ్యక్ష పదవికి సీఎం ఎంపిక చేశారు. సెపె్టంబర్ చివరివారంలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అన్ని శాఖల వ్యవహారాలను సమీక్షించడంతోపాటు ప్రతిపాదనలు తయారు చేసే కీలక బాధ్యతనూ వినోద్‌కుమార్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈయన కేబినెట్ భేటీలకు శాశ్వత ఆహా్వనితుడిగా ఉంటారు. రాజకీయ, పాలనా అంశాల్లో ఉన్న అనుభవంతోపాటు రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సీఎం ఈ పదవిలో నియమించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి... కరీంనగర్ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్ బాల్యం, విద్యాభ్యాసం అంతా వరంగల్‌లో కొనసాగింది. వామపక్ష విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా చేరారు. అనంతరం పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరించిన ఆయన 2004లో హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. తిరిగి 2014లో కరీంనగర్ లోక్‌సభ నుంచి ఎన్నికైన ఆయన లోక్‌సభలో టీఆర్ఎస్ ఉపనేతగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నేరుగా సేవ చేసే అవకాశం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్రానికి, ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం లభించిందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం నూతన ఉపాధ్యక్షుడి హోదాలో రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించే అవకాశం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ సమస్యలు, రాష్ట్ర వనరుల పట్ల ఉన్న అవగాహన నూతన బాధ్యతలు నిర్వర్తించడంలో తోడ్పడుతుందన్నారు. తనను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా నియమించిన సీఎం కేసీఆర్‌కు వినోద్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఇదే సంపూర్ణ తెలంగాణ సాధించుకున్న రోజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నుంచి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకావడంతో ఇదే సంపూర్ణ తెలంగాణ సాధించుకున్న రోజుగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుతో సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సంబరపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన స్ఫూర్తితో పార్లమెంట్ లోపల, బయట తాము చేసిన పోరాటానికి ఫలితంగా తెలంగాణ హైకోర్టు కల సాకారమైందన్నారు. ప్రజలకు సత్వరం న్యాయం జరిగేలా జిల్లా అనుబంధ కోర్టులు కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. -
గ్రామీణ నేపథ్యంలో...
‘‘దర్పణం’ సినిమా ఫేమ్ తనిష్క్‌రెడ్డి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్, సింహా ఫిలిమ్స్ పతాకాలపై అనిల్‌కుమార్ గుంట్రెడ్డి నిర్మిస్తున్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. జనవరి 3నుంచి పార్వతీపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నాం. ఆస్ట్రేలియాలో కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. తనిష్క్ కెరీర్‌ని మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమవుతుందనడంలో సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. సుమన్, వినోద్‌కుమార్, చిన్నా, పృధ్వీ, జీవా, ఉత్తేజ్, అనంత్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: సాయి చరణ్, కో–ప్రొడ్యూసర్స్: శ్రీకాంత్, త్రినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: చిన్నా, నాగేంద్రమ్మ. -
కాగితాల్లోనే రైల్వే ప్రాజెక్టులు
♦ దక్షిణమధ్య రైల్వే సమావేశంలో ఎంపీల అసంతృప్తి ♦ ప్రతిపాదనలకు ప్రాధాన్యమివ్వడంలేదు ♦ ఎంపీల సమావేశం ఓ తంతులా మారిందంటూ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులు ఏళ్లకు ఏళ్లు కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఎంపీలతో సమావేశం ఒక తంతులా మారుతోందని పలువురు పార్లమెంటు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యతనివ్వడం లేదని ధ్వజమెత్తారు. గురువారం రైల్ నిలయంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ఎంపీల సమావేశం జరిగింది. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో... ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు, జి.నగేశ్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాంనాయక్, నంది ఎల్లయ్య, పసునూరి దయాకర్, భగవంత్ ఖుబా, సునీల్ బలిరామ్ గైక్వాడ్, బీవీ నాయక్ పాల్గొన్నారు. కాగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమా వేశానికి హాజరుకాక పోవడం గమనార్హం. దాహంతో అల్లాడుతున్నారు... తమ నియోజకవర్గాల్లో పెండింగ్ ప్రాజెక్టులు, రైళ్ల హాల్టింగ్, రైల్వే స్టేషన్లలో సమస్యలపై ఎంపీలు జీఎం దృష్టికి తెచ్చారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు, రాష్ట్రంలోని అనేక స్టేషన్లలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉందని, సుప్రీంకోర్టు ఆదేశించినా రైల్వే ఉచితంగా నీటిని అందజేయకపోవడంతో ప్రయాణికులు దాహంతో అల్లాడుతున్నారని ఆనందభాస్కర్, నంది ఎల్లయ్య చెప్పారు. మరోవైపు ఇటీవల కాలంలో తరచుగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ట్రైన్ బయలుదేరడానికి ముందే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్– సూర్యాపేట్ కొత్త రైలు మార్గానికి సర్వే పూర్తయిందని, వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. జనగామ స్టేషన్లో శాతవాహన, చార్మినార్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలన్నారు. గత 20 ఏళ్లుగా నల్లగొండ– మాచర్ల రైల్వేలైన్ నిర్మాణం కాగితాలకే పరిమితమైందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్–అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. 60 శాతం ఆదాయం దక్షిణాది నుంచి వస్తున్నా... రైల్వేలకు 60 శాతం ఆదాయం దక్షిణాది నుంచే లభిస్తున్నప్పటికీ ఉద్యోగాలు, ఉన్నత పదవులు మాత్రం ఉత్తరాదికే పరిమితమవుతున్నాయని, తెలంగాణ, ఏపీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీతారాంనాయక్ చెప్పారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను గద్వాల్ మీదుగా నడపాలని పాల్వాయి కోరారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రక్షణ శాఖ భూములపై నెలకొన్న అడ్డంకులు తొలగిపోయిన దృష్ట్యా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని మల్లారెడ్డి కోరారు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు తలపెట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్ రైల్వేలైన్ పనులను వెంటనే ప్రారంభించాలని భువనగిరి ఎంపీ నర్సయ్యగౌడ్ కోరారు. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపర్చాలని, అదనపు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని బాల్క సుమన్ కోరారు. అన్ని చోట్లా హాల్టింగ్‌లు సాధ్యంకాదు సమావేశం అనంతరం జీఎం వినోద్‌కుమార్ మా ట్లాడుతూ... ఎంపీల ప్రతిపాదనలు, విజ్ఞప్తుల్లో సాధ్యమైనన్నింటిపైనా త్వరలోనే కార్యాచరణ చేపడతామన్నా రు. ఎంపీలు కోరినట్లు అన్ని చోట్ల రైళ్లను ఆపడం సాధ్యం కాదని, దానివల్ల రైళ్ల వేగం తగ్గుతుందన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో ఒక లైన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందన్నారు. తెల్లాపూర్–పటాన్చెరు మార్గంలో ఎంఎటీఎస్ రైళ్లు అందుబాటులోకి వస్తా యన్నారు. 2018 నాటికి అన్ని లైన్లూ పూర్తి చేస్తామన్నారు. -
మా నాయకుడే బాహుబలి
హన్మకొండ: మా నాయకుడు సీఎం కేసీఆరే బాహుబలి అని, మా బాహుబలికి ఎదురెవరని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమావేశంలో నియోజకవర్గ నివాసిగా ఆయన క్రీయాశీల సభ్యత్వం తీసుకుని పార్టీ సభ్వత్వ నమోదును ప్రారంభించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎజెండా అంటూ లేదని దుయ్యబట్టారు. నాయకత్వం లేని ఆ పార్టీకి బాహుబలి ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. కమ్యూనిస్టులను ప్రజలు విశ్వసించరన్నారు. టీడీపీ తెలంగాణలో కనుమరుగైన పార్టీ అని తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పట్టించుకోలేదని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ముందుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి అడ్డంకులు సృష్టించిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడి చౌకబారు విమర్శలు చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ది, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చిందని తెలిపారు. ఈ ఫండ్‌కు అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టానికి రైతులకు మేలు చేకూర్చేలా సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆమోదించొద్దని కాంగ్రెస్ పార్టీ వేయి దరఖాస్తులు ఇప్పించి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అభివృద్ది పనులకు ఆటంకాలు కల్గిస్తోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు. -
నటుడు వినోద్‌కుమార్‌కు బెయిల్ మంజూరు
బెంగళూరు : హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుభాషా నటుడు వినోద్‌కమార్ అళ్వాస్కు మంగళవారం కోర్టులో బెయిల్ లభించింది. తనను బెదిరించడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ వినోద్‌పై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణ చేపట్టిన పుత్తూరు జిల్లా ఐదవ అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం విచారణ చేసి బెయిల్ మంజూరు చేసింది. గత నెల 16న వినోద్‌కుమార్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. -
బీటెక్ దొంగ అరెస్ట్
బన్సీలాల్‌పేట్: ఇంజనీరింగ్ చదివిన విద్యార్ధి జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ కటకటాల పాలయ్యాడు. చెడు అలవాట్లకు బానిసగా మారి.. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బీటెక్ విద్యార్ధిని గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్‌కు చెందిన నునామత్ వినోద్ కుమార్ (21) బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతను అపార్టుమెంట్లు, రోడ్లపై పార్కు చేసిన ఖరీదైన ద్విచక్ర వాహనాలను దొంగలించడం పనిగా పెట్టుకున్నాడు. గాంధీనగర్, చిక్కడపల్లి, రాంగోపాల్‌పేట్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ల పరిధిలో పలు బైక్‌లను ఎత్తుకెళ్లాడు. పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ నుంచి సెల్‌ఫోన్ లాక్కెళ్లినట్లు తెలిపారు. నిందితుడి నుంచి మూడు బైక్‌లు, రెండు సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. నిందితునిపై 7 కేసులు నమోదు చేశామని, అతనికి సహకరించిన మరో వ్యక్తి సలీమ్‌ను కూడా రిమాండ్‌కు తరలించినట్లు క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. -
ద్రోణాచార్య అవార్డులపై ఢిల్లీ హైకోర్టు స్టే
న్యూఢిల్లీ : ద్రోణాచార్య అవార్డులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కాగా శనివారం రాష్ట్ర ప్రతి భవన్ లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డుల పంపిణీ కార్యక్రమం జరగనున్న తరుణంలో ఈ తీర్పును వెలువరించింది. ఎక్కువ అర్హత ఉన్న జాతీయ రెజ్లింగ్ మాజీ చీఫ్, కోచ్ వినోద్ కుమార్‌ను విస్మరించిన ద్రోణాచార్య అవార్డు ఎంపిక కమిటీ రెజ్లింగ్ మరో కోచ్ అనూప్ సింగ్ దహియా పేరును ప్రకటించడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వినోద్ కుమార్ ఈనెల 18న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందించడానికి కేంద్రం అనుకూలంగానే ఉంది. కర్ణాటక హైకోర్టుకు జవాబిస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
2026 తరువాతే సాధ్యం
నియోజకవర్గాల పునర్విభజనపై టీఆర్ఎస్ ఎంపీకి కేంద్రం స్పష్టం న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో మార్చి 2, 2015న టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఈ అంశాన్ని ప్రస్తావించగా.. దా నికి హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ చౌధురి ఎంపీ వినోద్‌కు జవాబు పంపారు. ‘ఏపీలో ఎమ్మెల్యే సంఖ్యను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నియోజకవర్గాల పునర్విభజన చే పట్టాల్సి ఉంది. అయితే ఆర్టికల్ 170కి లోబడి ఉంటుందని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం చె బుతోంది. అందువల్ల ఆ ఆర్టికల్ ప్రకారం ఈ విభజన ప్రక్రియ 2026 తరువాత కానీ సాధ్యం కాదు..’ అని మంత్రి పేర్కొన్నారు. ఏపీఆర్ఏ సవరించండి: వినోద్ కేంద్రమంత్రి రాసిన ఈ లేఖకు బదులుగా ఎంపీ వినోద్‌కుమార్ తిరిగి ఒక లేఖ రాశా రు. ‘మీ లేఖ ఈరోజు అందింది. మీరిచ్చిన జవాబు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఈ విషయంలో మీ వైపు కొంత గందరగోళం నెలకొంది. ఉమ్మడిరాష్ట్రంలో 9 కోట్ల జనాభా ఉంది. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26(1) ఉద్దేశం ఏంటంటే జనాభాకు అనుగుణంగా ప్రాతినిథ్యం పెంచాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వచ్చిన దోషాల వల్ల ఈ డైల మా. సెక్షన్ 26 (1)లో ఆర్టికల్ 170కి లోబడి అని ఉంది. దానిని ఆర్టికల్ 170కి సంబం ధం లేకుండా అని సవరిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆర్టికల్ 170 ద్వారా నియోజకవర్గాల పునర్విభజన జరిపితే.. సెక్షన్ 26(1) పెట్టాల్సిన అవసరం ఏముంది? అందువల్ల దీనిని తక్షణం పరిశీలించండి.’ అని కోరారు. -
స్మార్ట సిటీ సాధనే లక్ష్యం
టవర్‌సర్కిల్ : కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో శాస్త్రీయ విజ్ఞానంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులు చేపట్టేందుకు ఆదివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛభారత్‌లో ప్రతీ పౌరుడు పాల్గొనాలని సూచించారు. కేంద్రబడ్జెట్లో కూడా స్వచ్ఛభారత్‌కు పెద్దపీట వేసినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌కు శాస్త్రీయ విజ్ఞానం జోడించి టాయిలెట్స్ నిర్మాణం, శుభ్రత చేపట్టాలని పిలుపునిచ్చారు. శుభ్రతంగా ఉంటే 60 శాతం రోగాలు దూరమవుతాయని తెలిపారు. నగరంలో శానిటేషన్‌పై లోతుగా పరిశీలించి ఐటీని ఉపయోగించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు. చెత్తను ఏలా నియంత్రించవచ్చు, చెత్త తొలగింపు ఎలా జరుగుతుందనే విషయాలపై అధికార యంత్రాంగానిదే బాధ్యత కాదని, ట్రాకింగ్సిస్టంతో ప్రజలకు తెలియజేసి అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీల ఎంపికకు గట్టి పోటీ ఉందని, స్మార్ట్ హోదా దక్కాలంటే మనం స్వచ్ఛతలో ముందుండాలని సూచించారు. కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడును నగరానికి తీసుకువస్తామని, అప్పటిలోగా కరీంనగర్ స్మార్ట్ అనిపించేలా తీర్చిదిద్దాలని కోరారు. మేయర్, డెప్యూటీ మేయర్‌తోపాటు కార్పొరేటర్లు వారి ఆలోచనలకు పదును పెట్టి క్లీన్‌సిటీగా మార్చాలన్నారు. ఆధునికీకరణతో ముందుకు : మేయర్ పారిశుధ్య వాహనాలు, డీజిల్ వాడకం, కార్మికుల పనితీరు అంతా అత్యాధునిక ట్రాకింగ్ సిస్టం ద్వారా ముందుకు వెళతామని మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. రాష్ట్రంలోనే ఈ సిస్టం అములు చేస్తున్న మొట్టమొదటి కార్పొరేషన్‌గా కరీంనగర్ పేరు నిలుస్తుందన్నారు. చెత్తను తొలగించాలంటే చిత్తశుద్ధి అవసరమన్నారు. ట్రాకింగ్సిస్టంతో మరింత మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తామని తెలిపారు. అనంతరం ట్రాకింగ్ సిస్టంపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ ఆరిఫ్, కార్పొరేటర్ రూప్సింగ్, కమిషనర్ రమణాచారి, ఈఈ భద్రయ్య, డీఈ శంకర్, ఆర్వో మక్సూద్మీర్జా, శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్, అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగం ఇదీ... శానిటేషన్ విభాగంలో చెత్తను ఎత్తుకుపోయే ట్రాక్టర్లకు ఎలక్ట్రానిక్సెన్సార్లు అమర్చుతారు. వాటిని ఒక కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. కార్యాలయంలో ఉండే ఈ కంప్యూటర్లో సెన్సార్ఉన్న వాహనం ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉందో గుర్తించవచ్చు. వాహనం తిరుగుతున్నంత సేపు వాటికి సంబంధించిన సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీనివలన వాహనాలు, వాటిపై పనిచేస్తున్న కార్మికులు అనుకున్న విధంగా చెత్తను లిప్టు చేస్తున్నారా లేదా అనేది తెలుసుకునే వీలుంటుంది. -
ఏకంగా దూరదర్శన్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు
ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా నాలుగోసారి పోలీసులకు చిక్కిన ఘనుడు సిటీబ్యూరో: మోసం చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేయడం అతనికి అలవాటు. మూడుసార్లు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా అతని బుద్ధి మారలేదు. ఈసారి ఏకంగా దూరదర్శన్ డెరైక్టర్‌గా అవతారం ఎత్తి.. ఉద్యోగాలిప్పిస్తానని రూ.14 లక్షలు కాజేశాడు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు వలపన్ని గురువారం ఇతడిని అరెస్టు చేశారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి కథనం... ప్రకాశం జిల్లా సూర్యోదయకాలనీకి చెందిన బైల్లా వినోద్‌కుమార్ (34) ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో మోసాల బాట పట్టాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించడం తో 2010లో సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశా రు. ఆ తర్వాత జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వినోద్‌కుమార్ గిద్దలూరు మున్సిపాలిటీ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించడంతో 2012లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. తిరిగి 2014లో ఇదే తీరులో పట్టుబడి జైలుకెళ్లాడు. బెయిల్‌పై తిరిగి వచ్చిన వినోద్‌కుమార్ తనకు తాను దూరదర్శన్ డెరైక్టర్‌గా నకిలీ ఐడీ కార్డు తయారు చేయించుకున్నాడు. doordarshan.newdelhi99@gmail.com నకిలీ మెయిల్ తయారు చేశాడు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఉన్న తన ఫొటోలను పలువురికి చూపించి తన పలుకుబడి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దూరదర్శన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొండల్‌రెడ్డి నుంచి రూ.8 లక్షలు, వెంకటేశ్వర్‌రెడ్డి నుంచి రూ.3 లక్షలు, బి.నిరోష నుంచి రూ.3 లక్షలు, వి.శశిరేఖ నుంచి రూ.60 వేలు... ఇలా రూ.14.60 లక్షలు వసూలు చేశా డు. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాడు. ఆ పత్రాలను తీసుకుని వారు రా మంతాపూర్లోని దూరదర్శన్ కేంద్రానికి వెళ్లగా అవి నకిలీవని, వినోద్‌కుమార్ అనే వ్యక్తి అ క్కడ లేడని తేలిసింది. దీంతో బాధితులు ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విషయాన్ని వివరించారు. కమిషన ర్ ఆదేశాల మేరకు ఓఎస్ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్లు వి.ఉమేందర్, బి.పుష్పన్‌కుమార్, ఎస్ఐలు పి.ఆంజనేయులు , ఎ.రాములు రంగంలోకి దిగి వినోద్‌కుమార్ ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ ఉ ద్యోగ నియామక పత్రాలు, విమాన టికెట్లు, దూరదర్శన్ డెరైక్టర్ నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిం దితుడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. -
సమన్వయంతో సాగుదాం
కొట్లాడి తెలంగాణ సాధించుకున్నం... పాత ప్రభుత్వ పాలన వేరు. తెలంగాణ ప్రభుత్వ పాలన వేరు. కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలి. ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయంతో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన లేదు. అధికారులే అవగాహన కలిగించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను ఖర్చు పెట్టడంలో మన జిల్లా దేశానికే దిక్సూచి కావాలి. సమస్యలుంటే నా సెల్‌కు ఫోన్ చేయండి. ఎత్తకుంటే ఎస్ఎంఎస్ కొట్టండి. - వినోద్‌కుమార్, కరీంనగర్ ఎంపీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ప్రభుత్వం ఎడ్లబండి అయితే మనం(అధికారులు, ప్రజాప్రతినిధులు) జోడెడ్లం.. సమన్వయంతోనే అభివృద్ధి చేసుకుందాం. కేంద్ర ప్రభు త్వ పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలి. ఆరునెలలవుతున్నా ఇక్కడున్న అధికారులెవరూ నాకు తెలియదు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అ వసరముంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. సమస్యలపై ఎ ప్పటికప్పుడు స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లాలి. - బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ, కమిటీ కో చైర్మన్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. నిధుల విని యోగంలో దేశానికే జిల్లా దిక్చూచిలా ఉండేలా చూడాలని సూచించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ సమావేశంలో 14 పథకాలపై నాలుగు గంటల పాటు సమీక్షించారు. పథకాల ప్రగతిపై పలువురు ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. - ముకరంపుర ముకరంపుర : కమిటీ చైర్మన్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఉద యం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా గంట ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై సమీక్షించారు. వాస్తవంగా ఏటా మూడుసార్లు విజిలెన్స్ మానిట రింగ్ కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. సమావేశం నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోయే అవకాశమున్నందున అత్యవసరంగా ఏర్పాటు చేసినట్లు ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. జనవరిలో పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఆయా ప్రాంతాల్లో పథకాల ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి పనుల్లో కూలీలకు తక్కువ పనిదినాలపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జారీ చేసిన జాబ్‌కార్డులకు పనిదినాలకు వ్యత్యాసాన్ని డ్వామా ఇన్చార్జి పీడీ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, మొక్కలపెంపకంలో ప్రగతి గతి తప్పిందని అసహనం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించడంలో జాప్యంతోనే పథకం వెనుకంజలో ఉందని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ లేవనెత్తారు. జమ్మికుంట, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీపీలు సైతం ఇదే విషయాన్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మార్చి 31లోగా పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించినట్లు డ్వామా ఇన్చార్జి పీడీ శ్రీనివాస్ తెలిపారు. సాంక్షన్ లేకుండా నిర్మాణాలు చేసిన వాటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెద్దపల్లి, మంథని ప్రాంతంలో చేపట్టిన 105 కిలోమీటర్ల రింగురోడ్డు పూర్తి చేయడానికి ఓ పెద్దాయన అడ్డుకుంటున్నారని, స్టేజ్ టూ వర్క్ మొదలుపెట్టనివ్వడం లేదని, ఇంకా 55 కిలోమీటర్ల రోడ్డు పెండింగ్‌లో ఉందని ఆర్అం డ్బీ ఎస్ఈ చందూలాల్ పేర్కొన్నారు. ఈ విషయం డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ వద్ద పెండింగ్‌లో ఉందని తెలి పారు. నాణ్యమైన పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని, త క్కువ కోట్ చేసే టెండర్‌దారుల నుంచి డిపాజిట్లు పెట్టేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఎస్ఎస్ఏ ద్వారా ఖర్చు చేసే నిధులు కాంట్రాక్టర్ల ఉపాధికే పరిమితమవుతున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్న నిధులు సద్వినియోగం కావటం లేదన్నారు. పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షించలేకపోతున్నాయని అన్నారు. ఉపాధ్యాయులకు నామమాత్రమైన శిక్షణలతో సరిపుచ్చుతున్నారని పేర్కొన్నారు. రేషనలైజేషన్ లేదని, 2013లో బదిలీ అయిన టీచర్లు రిలీవ్ కాలేదని, సర్దుబాటుపై డీఈవో స్పందించడం లేదని అన్నారు. విద్యా, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వ పాలసీ వెల్లడైన అనంతరం అసలు కథ ఉంటుందని ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. కేజీటూ పీజీ విద్యావిధానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి పాఠశాలలు మండలానికొకటి తెస్తామన్నారు. ఆ మిషన్లు ఏమయ్యాయి? మహిళల్లో క్యాన్సర్ కారకాలను తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, శానిటరీ నాఫ్కిన్స్ తయారీలో పూర్తిగా వైపల్యం చెందిందని ఎంపీ వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు మండలాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి రూ.3 కోట్లతో తెచ్చిన మిషన్లను నిరుపయోగంగా గదుల్లో వేసి తాళం వేశారని అన్నారు. ఈ విషయమై సంబంధిత డీఎంహెచ్‌వో అలీం మాట్లాడుతూ ఆ మిషన్ విలువ రూ.2.44 లక్షలని మాత్రమే నివేదికలో ఉందన్నారు. వెంటనే ఆరా తీసి నివేదికలు సమర్పించాలని ఎంపీ ఆదేశించారు. జిల్లాలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని, అవసరమైతే మరిన్ని ఎంపీ నిధులను కూడా మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేసేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని తెలిపారు. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, సీపీవో సుబ్బారావు, టీఎస్‌ఎంఐపీ పీడీ సంగీతలక్ష్మి, జడ్పీ సీఈవో అంబయ్య, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవగాహనలు.. అసంతృప్తులు కేంద్రప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమవేశంలోనే పలువురు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగింది. అసలు తనకేమీ తెలియడం లేదని స్వయంగా పెద్దపెల్లి ఎంపీ బాల్కసుమన్ చెప్పడం విశేషం. కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు కూడా అధికారులు చెప్పే విషయాలను క్షుణ్ణంగా విన్నారు. వివిధ పథకాలపై జరిగిన సమీక్షలో ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఏఏవై పథకం కింద గ్రామాలలో మైనార్టీలకు చెందిన గృహాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ పథకం కింద ఇంకా రూ.4 కోట్ల నిధులు మిగిలాయని, సంబంధిత ప్రజాప్రతినిధుల సహాకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. నాలుగు మండలాల్లోని గ్రామాలకు రూ.24.97 కోట్లు వాటర్‌షెడ్ పథకానికి రెండు నెలల క్రితం మంజూరు చేసినట్లు తెలిపారు. హుస్నాబాద్‌లోని అక్కన్నపేట, భీమదేవరపల్లిలోని గట్లనర్సింగాపూర్, సిరిసిల్లలోని తాడూర్, బెజ్జంకిలోని దాచారం గ్రామాలకు దాదాపు రూ.7 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వాటర్ షెడ్ పనుల కోసం వచ్చే నిధులు 90 శాతం దుర్వినియోగమవుతున్నాయని, అధికారులు జల సంరక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధితోపాటు వారు ఎదర్కుంటున్న సాంఘిక సమస్యలపై దృష్టిసారించాలన్నారు. గ్రామీణ విద్యుదీకరణ పథకం పూర్తిప్రణాళిక నివేదిక ప్రతిని తనకు అందజేయాలని ఎస్ఈకి సూచించారు. మోడ ల్ స్కూళ్లలో నిబంధనలను అనుసరించి విద్యార్థుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం మెరుగుదలకు తగిన సూచనలు అందించాలని డీఈవోను కోరారు. వచ్చే సమావేశంలో చర్చలుండవని, చర్యలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేశారని, ఈ సారి గంపగుత్తగా కేంద్రమిచ్చే నిధులను ఖర్చు చేయాల్సిందేనని పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగమైతే సహించేది లేదన్నారు. -
'ఆ షెడ్యూళ్ల'పై ఏపీ అధికారులు కొత్త అర్థం ...
న్యూఢిల్లీ: 9, 10 షెడ్యూల్‌పై ఆంధ్రప్రదేశ్ అధికారులు కొత్త అర్థాలు చెబుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బి. వినోద్ కుమార్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ... చట్టం ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ ప్రాంతానికే చెందెలా స్పష్టత ఇవ్వాలని రాజ్‌నాథ్‌కు కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న సంస్థలపై ఏపీ ప్రభుత్వం అధికారం చెలాయించాలని చూస్తుందని ఆరోపించారు. ఈ అంశంపై కూడా ఓ నిర్ధిష్టమైన స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అయితే హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారులు అనే అంశంపై చర్చ మాత్రం జరగలేదని వినోద్ స్పష్టం చేశారు. -
పండ్లతో అద్భుత శిల్పాలు
-
కొంప ముంచిన పుట్టినరోజు!!
ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్నీ క్షుణ్ణంగా చూసుకోవాలి. పార్లమెంటుకు గానీ పోటీ చేయాలంటే కనీసం 25 ఏళ్ల వయసు ఉండాలని భారత రాజ్యాంగంలోని 84 (బి) అధికరణం స్పష్టంగా చెబుతోంది. అలాగే, అసెంబ్లీకి పోటీ చేయాలన్నా కూడా ఇంతే వయసు ఉండాలని రాజ్యాంగంలోని 173(బి) అధికరణం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 36(2) సెక్షన్ చెబుతున్నాయి. తనకు ఎటూ పాతికేళ్ల వయసు వచ్చేసింది కదా అని ఓ యువకుడు ఉత్సాహం చూపించాడు. అభ్యర్థులు దొరకడం లేదు కదా.. దొరికిన వాళ్లు ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం అని ఓ పార్టీ కూడా ఉత్సహం చూపించింది. అయితే అటు పార్టీ నాయకులు గానీ, ఇటు పోటీ చేసిన అభ్యర్థి గానీ.. ఇద్దరూ ఆయన వయసు విషయాన్ని పట్టించుకోలేదు. పదోతరగతి సర్టిఫికెట్ ప్రకారం ఉన్న వయసును పరిగణనలోకి తీసుకుంటారు. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున వినోద్‌కుమార్ అనే యువకుడు నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, అతడి వయసు 25 సంవత్సరాలకు రెండు రోజులు తక్కువగా ఉన్నట్లు నామినేషన్ల పరిశీలనలో తేలింది. దాంతో.. వినోద్‌కుమార్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి సుబ్బరాజు ప్రకటించారు. అంతే.. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దూకుదామనుకున్న వినోద్‌కుమార్ ఆశలు కాస్తా అడియాసలయ్యాయి. -
బాబాయ్.. అబ్బాయ్.. ఓ మేనల్లుడు
రాజకీయాల్లో బంధాలు...అనుబంధాలు మిథ్య. కరీంనగర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత సిహెచ్.విద్యాసాగర్‌రావు కుటుంబంలో ఇలాంటి పోరే కొనసాగుతోంది. 2009 ఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విద్యాసాగర్‌రావు పోటీ చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు కుమారుడైన చెన్నమనేని రమేష్‌బాబు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. బాబాయ్, అబ్బాయ్‌ల పోటీలో అబ్బాయినే విజయం వరించింది. ఆ సమయంలోనే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి విద్యాసాగర్‌రావు మేనల్లుడు, బోయిన్పల్లి వినోద్‌కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ మరోసారి ఈ ముగ్గురు ఎన్నికల బరిలో దిగారు. కరీంనగర్ లోకసభ అభ్యర్థులుగా బీజేపీ నుంచి విద్యాసాగర్‌రావు, టీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీపడుతుండగా, వేములవాడ అసెంబ్లీ స్థానంలో చెన్నమనేని రమేశ్‌బాబు ఈసారి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అసెంబ్లీ బరిలో అబ్బాయి చేతిలో ఓడిపోయిన విద్యాసాగర్‌రావు, ఇపుడు మేనల్లుడి సవాలు నెగ్గుకొస్తారా.. అనేది ఆసక్తిగా మారింది. -న్యూస్‌లైన్,కరీంనగర్ సిటీ