'ఆ షెడ్యూళ్ల'పై ఏపీ అధికారులు కొత్త అర్థం ... | AndhraPradesh officers new version on schedule 9 and 10, say TRS MP Vinodkumar | Sakshi
Sakshi News home page

'ఆ షెడ్యూళ్ల'పై ఏపీ అధికారులు కొత్త అర్థం ...

Published Sun, Sep 7 2014 1:12 PM | Last Updated on Sat, Jun 2 2018 5:56 PM

AndhraPradesh officers new version on schedule 9 and 10, say TRS MP Vinodkumar

న్యూఢిల్లీ: 9, 10 షెడ్యూల్పై ఆంధ్రప్రదేశ్ అధికారులు కొత్త అర్థాలు చెబుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బి. వినోద్ కుమార్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ... చట్టం ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ ప్రాంతానికే చెందెలా స్పష్టత ఇవ్వాలని రాజ్నాథ్కు కోరినట్లు చెప్పారు.

హైదరాబాద్లో ఉన్న సంస్థలపై ఏపీ ప్రభుత్వం అధికారం చెలాయించాలని చూస్తుందని ఆరోపించారు. ఈ అంశంపై కూడా ఓ నిర్ధిష్టమైన స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అయితే హైదరాబాద్లో గవర్నర్కు అధికారులు అనే అంశంపై చర్చ మాత్రం జరగలేదని వినోద్ స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement