ఏకంగా దూరదర్శన్ డైరెక్టర్‌ అవతారం ఎత్తాడు | Duplicate television director arrested | Sakshi
Sakshi News home page

ఏకంగా దూరదర్శన్ డైరెక్టర్‌ అవతారం ఎత్తాడు

Published Fri, Feb 6 2015 11:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

ఏకంగా దూరదర్శన్ డైరెక్టర్‌ అవతారం ఎత్తాడు

ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా
నాలుగోసారి పోలీసులకు చిక్కిన ఘనుడు

 
సిటీబ్యూరో: మోసం చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేయడం అతనికి అలవాటు. మూడుసార్లు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా అతని బుద్ధి మారలేదు. ఈసారి  ఏకంగా దూరదర్శన్ డెరైక్టర్‌గా అవతారం ఎత్తి.. ఉద్యోగాలిప్పిస్తానని రూ.14 లక్షలు కాజేశాడు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు వలపన్ని గురువారం ఇతడిని అరెస్టు చేశారు. ఎస్‌ఓటీ అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి కథనం... ప్రకాశం జిల్లా సూర్యోదయకాలనీకి చెందిన బైల్లా వినోద్‌కుమార్ (34) ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశాడు.

 ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో మోసాల బాట పట్టాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించడం తో 2010లో సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశా రు. ఆ తర్వాత జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వినోద్‌కుమార్ గిద్దలూరు మున్సిపాలిటీ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించడంతో 2012లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. తిరిగి 2014లో ఇదే తీరులో పట్టుబడి జైలుకెళ్లాడు. బెయిల్‌పై తిరిగి వచ్చిన వినోద్‌కుమార్ తనకు తాను దూరదర్శన్ డెరైక్టర్‌గా నకిలీ ఐడీ కార్డు తయారు చేయించుకున్నాడు.  doordarshan.newdelhi99@gmail.com  నకిలీ మెయిల్ తయారు చేశాడు.

 

అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఉన్న తన ఫొటోలను పలువురికి చూపించి తన పలుకుబడి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దూరదర్శన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొండల్‌రెడ్డి నుంచి రూ.8 లక్షలు, వెంకటేశ్వర్‌రెడ్డి నుంచి రూ.3 లక్షలు, బి.నిరోష నుంచి రూ.3 లక్షలు, వి.శశిరేఖ నుంచి రూ.60 వేలు... ఇలా రూ.14.60 లక్షలు వసూలు చేశా డు. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాడు.

ఆ పత్రాలను తీసుకుని వారు రా మంతాపూర్‌లోని దూరదర్శన్ కేంద్రానికి వెళ్లగా అవి నకిలీవని, వినోద్‌కుమార్ అనే వ్యక్తి అ క్కడ లేడని  తేలిసింది. దీంతో బాధితులు ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విషయాన్ని వివరించారు. కమిషన ర్ ఆదేశాల మేరకు ఓఎస్‌ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు వి.ఉమేందర్, బి.పుష్పన్‌కుమార్, ఎస్‌ఐలు పి.ఆంజనేయులు , ఎ.రాములు రంగంలోకి దిగి వినోద్‌కుమార్ ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి  నకిలీ ఉ ద్యోగ నియామక పత్రాలు, విమాన టికెట్లు, దూరదర్శన్ డెరైక్టర్ నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిం దితుడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement