ద్రోణాచార్య అవార్డులపై ఢిల్లీ హైకోర్టు స్టే
న్యూఢిల్లీ : ద్రోణాచార్య అవార్డులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కాగా శనివారం రాష్ట్ర ప్రతి భవన్ లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డుల పంపిణీ కార్యక్రమం జరగనున్న తరుణంలో ఈ తీర్పును వెలువరించింది. ఎక్కువ అర్హత ఉన్న జాతీయ రెజ్లింగ్ మాజీ చీఫ్, కోచ్ వినోద్ కుమార్ను విస్మరించిన ద్రోణాచార్య అవార్డు ఎంపిక కమిటీ రెజ్లింగ్ మరో కోచ్ అనూప్ సింగ్ దహియా పేరును ప్రకటించడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది.
ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వినోద్ కుమార్ ఈనెల 18న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందించడానికి కేంద్రం అనుకూలంగానే ఉంది. కర్ణాటక హైకోర్టుకు జవాబిస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.