delhi highcourt
-
రావూస్ కోచింగ్ సెంటర్ కేసు.. సీబీఐకి అప్పగించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్లో వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన కేసు దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు యాక్టింగ్ సీజే మన్మోహన్, జస్టిస్ తుషార్రావులతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇంత పెద్ద ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని సమాజానికి భరోసా ఇచ్చేందుకే కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు విద్యార్థులు భవనం కింద వరద నీటిలో మునిగి మృతి చెందడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.ఇంకా నయం.. వరద నీటిని అరెస్టు చేయలేదు..విధులు సరిగా నిర్వహించకపోవడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు మందలించింది. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను విచారించకుండా ఘటన జరిగిన సమయంలో కోచింగ్‌సెంటర్ పక్కనుంచి వెళ్లిన కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టింది. దయతలచి భవనం కిందకు వచ్చిన వరద నీటిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని పోలీసులపై కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం. -
కేజ్రీవాల్ అరెస్టు: సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: తన అరెస్టు అక్రమమని ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీహైకోర్టు మంగళవారం(జులై2) విచారించింది. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఏడు రోజుల్లో కౌంటర్ వేయాలని కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను జులై 17కు వాయిదా వేసింది. అరెస్టు అక్రమమని పేర్కొంటూ వేసిన పిటిషన్లో పలు కీలక అంశాలను కేజ్రీవాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.గత ఏడాది తనను సీబీఐ కేవలం సాక్షిగా పిలిచిందని, ఇప్పుడు మాత్రం కొత్తగా ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని తెలిపారు. ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలనే సీబీఐ మళ్లీ రిపీట్ చేసిందని కోర్టు దృష్టికీ తీసుకువచ్చారు.ఇప్పటికే లిక్కస్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులోఉన్న కేజ్రీవాల్‌ను జూన్26న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ కూడా విధించింది. -
లిక్కర్ కేసు: కవితకు మళ్లీ నిరాశే
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురయింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ రిజెక్ట్ చేసింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలో రిజర్వు చేసిన తీర్పును సోమవారం(జులై1) సాయంత్రం వెలువరించింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పిచ్చింది. -
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను మోదీని ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు ముందు సోమవారం(ఏప్రిల్29) విచారణకు వచ్చింది.ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్‌లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పిటిషనర్ కోరారు. అయితే పిటిషన్లో విచారించదగ్గ మెరిట్స్ ఏవీ లేవని కోర్టు అభిప్రాయపడింది. -
పెప్సికో కంపెనీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. కారణం ఏంటంటే?
న్యూయార్క్‌కు చెందిన 'పెప్సికో ఇంక్' (PepsiCo Inc) లేస్ పొటాటో చిప్స్ కోసం ప్రేత్యేకంగా పండించిన పొటాటో రకానికి సంబంధించిన పేటెంట్ మీద కంపెనీ చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (PPVFR) అథారిటీ 2021లో పెప్సికో FC5 బంగాళాదుంప రకానికి మంజూరు చేసిన మేధో రక్షణను ఉపసంహరించుకుంది. సీడ్ వెరైటీ మీద కంపెనీ పేటెంట్‌ను క్లెయిమ్ చేయలేమని రైతుల హక్కుల కార్యకర్త 'కవిత కురుగంటి' వాదించడంతో పెప్సికో పేటెంట్ కవర్‌ను అథారిటీ తొలగించింది. పేటెంట్ కవర్ రద్దుపై పెప్సికో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అధికార నిర్ణయంపై పెప్సికో చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా జులై 5 నాటి ఉత్తర్వులో తోసిపుచ్చారు. (ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..) మాకు ఆర్డర్ గురించి తెలుసు, అంతే కాకుండా దానిని సమీక్షించే ప్రక్రియలో ఉన్నామని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 1989లో భారతదేశంలో తన మొట్టమొదటి పొటాటో చిప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన US స్నాక్స్ అండ్ డ్రింక్స్ తయారీదారు, FC5 సీడ్ రకాన్ని రైతుల సమూహానికి సరఫరా చేసింది. వారు ఆ ఉత్పత్తులను కంపెనీకి ఒక స్థిరమైన ధరకు విక్రయించారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. దీనిని కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందని 2016లోనే వెల్లడించింది. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) నిజానికి లేస్ కోసం వినియోగించే FC5 రకం బంగాళాదుంప చిప్స్ వంటి స్నాక్స్ చేయడానికి అవసరమైన తేమను కలిగి ఉంటాయి. కావున కంపెనీ వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి వినియోగించుకుంటోంది. అయితే 2019లో పెప్సికో కొంతమంది భారతీయ రైతుల మీద దావా వేసింది. కానీ సాగుదారులు ఈ పేటెంట్ ఉల్లంఘించారని ఆరోపించి ఉల్లంఘన కోసం 121050 డాలర్లను కోరినట్లు సమాచారం. చివరకు నెలరోజుల్లోనే పెప్సికో రైతులపై దావాలను ఉపసంహరించుకుంది. -
‘ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’.. బాబా రామ్‌దేవ్‌కు హైకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మొట్టికాయలు వేసింది ఢిల్లీ హైకోర్టు. అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని స్పష్టం చేసింది. కోవిడ్-19 బూస్టర్ డోస్ సామర్థ్యం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్ కోవిడ్‌పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రామ్‌దేవ్ బాబాకు చురకలు అంటించింది ధర్మాసనం. ‘ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయి. బాబా రామ్‌దేవ్ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు ఏది చెప్పినా నమ్మే అనుచరులను కలిగి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.’ అని పేర్కొన్నారు జస్టిస్ అనుప్ జైరాం భంభాని. మరోవైపు.. పతాంజలి కరోనిల్‌ను సవాల్ చేశారు డాక్టర్స్ అసోసియేషన్ తరఫు సీనియర్ న్యాయవాది అఖిల్ సిబాల్. ఎలాంటి ట్రయల్స్, సరైన ధ్రువీకరణ లేకుండానే కరోనిల్ కోవిడ్-19ను నయం చేస్తుందని పతాంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రామ్‌దేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం(ఐఎంఏ) ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్రరూపం దాల్చిన క్రమంలో కరోనిల్‌పై ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. ఇదీ చదవండి: బాబా రామ్‌దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..! -
స్మృతి ఇరానీ కూతురికి భారీ ఊరట.. కాంగ్రెస్ నేతలకు షాక్!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు కొద్ది రోజుల క్రితం ఆరోపణలు చేశారు. గోవాలో బార్ వ్యవహారం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆ కేసులో స్మృతి ఇరానీ కూతురికి భారీ ఊరట లభించింది. అసలు గోవాలోని రెస్టారెంట్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్ ఓనర్లు కాదని సోమవారం స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. వారికి అసలు లైసెన్సులే జారీ కాలేదని పేర్కొంది. వారు ఎన్నడూ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేసింది. రెస్టారెంట్, ఆ భూమి కూడా స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెకు చెందినది కాదని తెలిపింది. కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డీసౌజాలు ఆరోపణలు చేసిన క్రమంలో వారిపై రూ.2 కోట్లకు పరువు నష్టం దావా వేశారు కేంద్ర మంత్రి. ఆ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. ‘డాక్యుమెంట్లను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె పేరున లైసెన్స్ జారీ కాలేదు. రెస్టారెంట్‌కు వారు ఓనర్లు కాదు. ఎప్పుడూ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం లేదు.’ అని పేర్కొంది. కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనలు అపవాదు వేయాలనే దురుద్దేశంతో బోగస్‌గా అనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. అలాగే.. ప్రజల దృష్టిలో పడేందుకు కొందరిని టార్గెట్ చేసుకున్నట్లు ఉందని పేర్కొంది. కాంగ్రెస్ నేతలు తమ ట్వీట్లను తొలగించకపోతే.. ట్విట్టర్ ఆ పని చేస్తుందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Smriti Irani: ఆ ద్వేషంతోనే 18 ఏళ్ల నా కూతురిపై ఆరోపణలా.. స్మృతి ఇరానీ ఎమోషనల్ -
అగ్నిపథ్ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకు
న్యూఢిల్లీ: సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ తన ముందు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్, హర్యానా, పట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టులు కూడా తమ వద్ద దాఖలైన పిల్స్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిన నేపథ్యంలో అగ్నిపథ్‌పై వివాదం సుప్రీంకోర్టును తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల గురించి విచారించడానికి, రైల్వేతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టం గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఓ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు.. ఈ పథకంలో జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదీ చదవండి: Agnipath Recruitment: అగ్నిపథ్‌లో ‘కుల’కలం? -
భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్
న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఆగిపోయిన తమ వైద్య విద్యను భారత్‌లో పూర్తి చేసేందుకు అనుమతించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు శనివారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరిగే అవకాశముంది. ‘‘ఉక్రెయిన్ నుంచి 20,000 మంది భారత వైద్య విద్యార్థులు తిరిగి వచ్చారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేనందున వారి చదువుపై అనిశ్చితి నెలకొంది’’ అని వారి తరఫున కేసు వేసిన ప్రవాసీ లీగల్ సెల్ పేర్కొంది. (చదవండి: పార్శిల్లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు) -
మనిక బత్రాకు క్లీన్చిట్ ఇవ్వండి
న్యూఢిల్లీ: క్రీడా సమాఖ్యలు క్రీడాకారులను అనవసరంగా వేధించడం ఆపాలని ఢిల్లీ హైకోర్డు ఆదేశించింది. స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బత్రాకు క్లీన్చిట్ ఇవ్వాలని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)ను ఆదేశించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆడకుండా ఉద్దేశపూర్వకంగానే తనను జట్టు నుంచి తప్పించారని, కోచ్ సౌమ్యదీప్ రాయ్ తన శిష్యురాలికి ఒలింపిక్ బెర్త్ కోసం తనను మ్యాచ్‌లో ఓడిపోవాలని ఒత్తిడి చేశారని మనిక గత నెలలో హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు జస్టిస్ రేఖ పల్లి ప్లేయర్ ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా క్రీడా శాఖను ఆదేశించగా... సీల్డు కవర్లో నివేదికను కోర్టుకు సమరి్పంచింది. ఇందులో ఆమె వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని తేలడంతో ఢిల్లీ హైకోర్టు సోమ వారం విచారణ సందర్భంగా టీటీఎఫ్ఐపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సమాఖ్య తీరుపట్ల నిరాశ చెందాను. కారణం లేకుండానే ఒక క్రీడాకారిణిని వివాదాల్లోకి లాగు తున్నారు. ఇది సమంజసం కాదు. క్రీడాశాఖ నివేదిక చదివాను. ఆమెకు జారీచేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోండి. క్లీన్చిట్ ఇచ్చి భారత జట్టుకు ఎంపిక చేయండి’ అని ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది. -
Sushil Kumar: జైల్లో ఇచ్చే ప్రోటీన్ సరిపోదు!
న్యూఢిల్లీ: జైలులో ఇచ్చే ఆహారంలోని పోట్రీన్ తనకు సరిపోవని.. కాబట్టి ప్రోటీన్ షేక్, వ్యాయామ సామాగ్రి కావాలని రెజ్లర్ సుశీల్ కుమార్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నందున ప్రోటీన్ సప్లిమెంట్స్, వ్యాయామ సామాగ్రి, ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. ప్రత్యేక ఆహారం కింద ఒమేగా 3 క్యాప్సూల్స్, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ మాత్రలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా సుశీల్ కుమార్ పిటిషణ్‌పై బుధవారం కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇక సాధారణంగా జైల్లో ఐదు రోటీలు, ఏదైనా కూరగాయలతో చేసిన రెండు కర్రీలు, పప్పు, అన్నం ఇస్తారు. అంతేకాకుండా క్యాంటీన్లో నెలకు రూ. 6,000 వరకు కొనుక్కుని తినవచ్చు. అయితే సుశీల్ కుమార్ రెజ్లర్ కావడంతో మరింత ప్రోటీన్స్ అవసరమని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇక ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్యకు సంబంధించి మే 23న ఢిల్లీ పోలీసులు సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుశీల్‌ను ఢిల్లీలోని మాండోలి జైలులో ప్రత్యేక సెల్లో ఉంచారు. అంతేకాకుండా భద్రతా కారణాల దృష్ట్యా అతన్ని కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. -
వాట్సాప్ పై కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన నూతన గోప్యతా విధానం వల్ల ఏర్పడిన వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. నూతన గోప్యతా విషయంలో కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్ పోటాపోటీగా ఒకరిపై మరొకరు దిల్లీ హైకోర్టులో అభియోగాలు మోపుకుంటున్నారు. వినియోగదారులతో నూతన విధానాన్ని ఆమోదింపజేసేందుకు వాట్సాప్ ఉపాయాలు పన్నుతోందని తాజా ఆఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఇంకా చట్టరూపం దాల్చకముందే నూతన గోప్యతా విధానాలను ఆమోదింపజేసేందుకు ప్రతిరోజూ నోటిఫికేషన్లను పంపించి "బలవంతం" చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త గోప్యతకు సంబంధించి ప్రస్తుత వినియోగదారులకు నోటిఫికేషన్లను పంపకుండా ఉండటానికి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం కోర్టును కోరింది. వివాదాస్పదంగా మారిన గోప్యతా విధానానికి వ్యతిరేకంగా గతంలో వాట్సాప్‌పై పలు కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఆ సంస్థ మాత్రం తాము చెప్పిన గడువు(మే 15) ప్రకారమే ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చినట్లు చెప్పింది. అయితే ఆ నిబంధనలను ఆమోదించని వినియోగదారుల ఖాతాలను తొలగించడం లేదని మాత్రం తెలిపింది. మరోవైపు, ఈ విధానం ఐటీ నిబంధనలు-2011కు అనుగుణంగా లేవని గతంలో కేంద్రం వెల్లడించింది. చదవండి: ఐటీ రిటర్నుల చివరి గడువు తేదీ తెలుసా? -
సెంట్రల్ విస్టా: కేంద్రానికి ఊరట, పిటిషనర్‌కు ఫైన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమేనని ఢిల్లీ హైకోర్టు సోమవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషనర్ కు లక్ష రూపాయల జరిమానాను విధించింది. దీంతో కేంద్రానికి మరో ఊరట లభించింది. కరోనా ఉద్ధృతి సమయంలో సెంట్రల్ విస్టా నిర్మాణం అంతగా అవసరం లేదని, ఆ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ సోహైల్ హష్మీ, ట్రాన్స్‌లేటర్ అన్యా మల్హోత్రా ఢిల్లీ హైకోర్టులో సంయుక్తంగా పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ల ద్విసభ్య ధర్మాసనం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. కరోనా బూచిని చూపించి సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కూలీలు అక్కడ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి సమయంలో పనులు ఆపేయాల్సిన పని లేదని పేర్కొంది. ప్రాజెక్టు న్యాయబద్ధతపై ఇప్పటికే సుప్రీం కోర్టు విచారించిందని గుర్తు చేసింది. నిర్మాణ పనులకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతించిందని న్యాయస్థానం గుర్తుచేసింది. అత్యవసరం కూడా.. పార్లమెంట్ నూతన భవన సముదాయం సెంట్రల్ విస్టా నిర్మాణ పనుల్ని కొవిడ్ ఉధృతి వేళ కొనసాగిస్తుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది అని న్యాయస్థానం పేర్కొంది. నిర్మాణ పనులను ఆపేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేగాక, ఇది నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ఎవరి ప్రోద్బలంతోనే వేసిన పిటిషన్లా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్‌దారులకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా సుమారు వెయ్యి కోట్లకు పైగా ఖర్చుతో పార్లమెంట్ నూతన భవన సముదాయం సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ కు అనుగుణంగా నవంబర్ లోపు షాపూర్ జీ పల్లోంజీ సంస్థ.. సెంట్రల్ విస్టాను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్
న్యూఢిల్లీ: ఈరోజు(మే 26) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త డిజిటల్ నిబంధనల వల్ల తమ వినియోగదారుల ప్రైవసీ ప్రొటెక్షన్ విచ్ఛిన్నం అవుతుందని వాట్సాప్ చెబుతుంది. అందువల్ల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ఆపేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ ఢిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. తాజా నిబంధనలలో ఒకటి భారత రాజ్యాంగంలోని గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టుకు తెలిపింది. దీనివల్ల 40 కోట్ల భారతీయ వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతుందని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం తాము అడిగినప్పుడు సమాచారాన్ని వెంటనే అందివ్వాలని సోషల్ మీడియా కంపెనీలకు అధికారులు డిమాండ్ చేస్తారని, ఇది గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని వాట్సాప్ ఫిర్యాదులో పేర్కొంది. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లోని సందేశాలకు ఎండ్-టు-ఎండ్ భద్రత ఉంటుందని ప్రస్తుత నిబంధనలను పాటించాలంటే ఎండ్-టు-ఎండ్ భద్రతను విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలలో మొదట ఎవరు ఫేక్ న్యూస్/తప్పుడు వార్తలను ప్రచారం చేశారో గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలి. అందుకే వాట్సాప్ నిబంధనలను వ్యతిరేకిస్తుంది. సోషల్ మీడియా కంపెనీలు అమలు చేయాల్సిన కొత్త నిబంధనల గురుంచి కేంద్రం మూడు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. చదవండి: స్వదేశీ ట్విటర్ "కూ" యాప్ లో భారీగా పెట్టుబడులు -
‘ఎన్ని పిటిషన్లు వేసినా.. వాటిని చేస్తూనే ఉంటా’
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇటీవల వేలాది మందికి ఫాబీఫ్లూ అనే మందులను కరోనా బాధితులకు ఉచితంగా అందజేశారు. అయితే దీంతో గంభీర్‌పై కోర్టులో వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలైంది. తాజాగా ఈ అంశంపై గంభీర్ స్పందించారు. ఎన్ని పిటిషన్లు వేసినా...ప్రజా సేవను ఆపను గంభీర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని భావించాను, కనుక ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేను పంపిణీ చేసిన మందులు అత్యవసరమైనవని, నాపై వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు చేసినప్పటికీ తాను మాత్రం ప్రాణాలు రక్షించేందుకు ప్రజాసేవను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంపీ గౌతం గంభీర్ పెద్ద మొత్తంలో ఔషధాలను నిల్వ ఉంచారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒకే వ్యక్తి ఇలా ఔషధాలు నిల్వ చేయడం వల్ల ఇతర నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. వ్యాజ్యంలో పేర్కొన్న విధంగా ఫావిపిరవిర్ ఔషధ పంపిణీ విషయంలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారణకు ఆదేశించింది. గంభీర్‌కు ఇంతపెద్ద మొత్తంలో మందులు ఎలా లభించిందన్న విషయంపై దర్యాప్తు చేపట్టమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: Rajasthan Cm: కోటి వ్యాక్సిన్లు ఓ రోజుకి సరిపోవు -
డాక్టర్ మృతి, 80 మంది సిబ్బందికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇక మాకేం కాదనుకుంటే పొరపాటే. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి. సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఎకె రావత్(58) కోవిడ్ వ్యాక్పిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకడంతో శనివారం మరణించారు. ‘ఏప్రిల్,మే ఈ రెండు నెలల వ్యవధిలోనే సరోజ్ ఆస్పత్రిలోని సుమారు 80 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని, రావత్ తన జూనియర్ డాక్టర్ అని, చాలా ధైర్యవంతుడు’ అని డాక్టర్ భరద్వాజ్ అన్నారు. ‘నేను వ్యాక్పిన్ తీసుకున్నాను. నాకేం కాదు’ అని రావత్ తనతో అన్న చివరి మాటలను డాక్టర్ భరద్వాజ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పెరుగుతున్న కేసులు... ఆందోళనలో ఆస్పత్రులు ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరగడంతో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో ఆక్సిజన్ నిల్వలు లేవని, కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి వెంటనే ఆక్సిజన్ సరఫరా చేయాలని గత నెల ప్రైవేట్ ఆస్పత్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని, కానీ మళ్లీ ఆక్సిజన్ ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళం నెలకొందని ఢిల్లీకి చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఆక్సిజన్ లభ్యత, దాని పంపిణీని అంచనా వేయడానికి 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శనివారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కేసులు రోజుకి పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మే17 వరకు పొడగించిన ఢిల్లీ ప్రభుత్వం.. నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు మెట్రో సేవలను నిలిపివేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. (చదవండి: ‘ఎంజాయ్ ఎంజామీ’ అంటోన్న చెన్నై మహిళా పోలీసులు) -
ఆక్సిజన్ కొరత సంక్షోభం: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఉధృతి దేశంలో నెలకొన్న ఆక్సిజన్ కొరత సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతకు సంబంధించి మాక్స్ దాఖలు చేసిన పిటీషన్ హైకోర్టు అత్యవసరంగా విచారణంగా స్వీకరించింది. ఈ సందర్బంగా కేంద్రంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం వాస్తవికతకు ఎందుకు మేల్కొనడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ నిల్వలు అయిపోతూ ఆసుపత్రులో ఆందోళన పరిస్థితి ఉంటే.. స్టీలు ప్లాంట్లు నడుస్తున్న వైనం తమకు షాకింగ్ ఉందని వ్యాఖ్యానించింది. తక్షణమే ఆక్సిజన్ కొరత సమస్య పరిష్కారం కోసం స్పెషల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. న్యాయమూర్తులు విపిన్ సంఘి , రేఖ పల్లిల ధర్మాసనం చేపట్టిన అత్యవసర విచారణలో తాజా ఆదేశాలు జారీ చేసింది. తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న, వైద్య ఆక్సిజన్ అవసరమయ్యే పౌరుల జీవన హక్కును పరిరక్షించే బాధ్యత కేంద్రంపై ఉందని వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ సరఫరా కోసం పరిశ్రమలు కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగుల వెయిట్ చేయలేరంటూ మండిపడింది. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) 1400 మంది కరోనా రోగులున్న దేశ రాజధానిలోని ఆరు మాక్స్ ఆసుపత్రులకు అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూడాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవసరమైతే, పరిశ్రమల మొత్తం సరఫరాను మళ్లించాలని కోర్టు తెలిపింది. ఆరు ఆస్పత్రుల యాజమాన్యంలోని బాలాజీ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆక్సిజన్ సరఫరా తక్షణ ప్రాతిపదికన భర్తీ చేయకపోతే, రోగుల జీవితాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. వైద్య వినియోగం కోసం ఉక్కు, పెట్రోలియంతో సహా పరిశ్రమల మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిని మళ్లించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితి చాలా సెన్నిటివ్గా ఉంది కోవిడ్ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ ఏ విధంగానైనా సరఫరా చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 400 మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తున్నామన్నా కేంద్ర తరుపు న్యాయవది అనిల్సోనీ సమాధానం ధర్మాసనాన్ని సంతృప్తి పరచలేదు. టాటా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నపుడు కేంద్రం ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది అలాగే ఈ రోజు నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేక 24 మంది కరోనా రోగులు చనిపోయిన వైనంపై కూడా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. (ఆక్సిజన్ ట్యాంక్ లీక్ : 22 మంది మృతి) -
వాట్సాప్ కొత్త పాలసీపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: నూతన వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఇండియన్ యూజర్లు విచారం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పాలసీ తీసుకొచ్చాక చాలా మంది వాట్సాప్ వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్ యాప్ లకు తరలివెళ్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో వాట్సాప్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్బంగా కేంద్రం వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?) యూరోపియన్ వినియోగదారులు, భారతీయ వినియోగదారులను వాట్సాప్ వేర్వేరుగా చూస్తుందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త పాలసీ నిబంధనలకు సంబందించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వాట్సాప్ కు లేఖ పంపినట్లు విచారణ సందర్భంగా అడిషిషనల్ సోలిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ భారతీయ వినియోగదారుల గోప్యతా విషయంలో "ఏకపక్షంగా" వ్యవహరిస్తుందని ఇది ఆందోళన కలిగించే విషయమని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.(చదవండి: ఇండియన్ పబ్జీ(ఫౌజీ) విడుదల రేపే!) మళ్లీ మార్చి 1కి వాయిదా యూరోపియన్ లో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవడం నేరం కావడంతో అక్కడ తప్పనిసరిగా వాట్సాప్ నిబంధనలను అంగీకరించాలనే నిబంధన లేదు.. కానీ ఇండియాలో అందుకు విరుద్దంగా వాట్సాప్ యూజర్లు తప్పనిసరిగా నిబంధనలు తీసుకురావడం ఆందోళన కలిగిస్తోందని చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. ఈ అంశం వినియోగదారుల సమాచారం భద్రత, గోప్యతకు భంగకరమని కోర్టుకు నివేదించారు. అయితే ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. -
ఎస్బీఐ లోన్ : అనిల్ అంబానీకి ఊరట
సాక్షి,న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీ ఊరట లభించింది.1200 కోట్ల రూపాయల రుణం విషయంలో ఎస్బీఐ చేపట్టనున్న దివాలా చర్యలను ఢిల్లీ హైకోర్టు అడ్డుకుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సోదరుడు, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై దాఖలైన దివాలా పిటిషన్‌ను కోర్టు గురువారం నిలిపివేసింది. అలాగే ఆస్తులను విక్రయించకుండా అనిల్ అంబానీని నిలువరిస్తూ ఆదేశాలు జారీచేసింది. (చదవండి : అనిల్ అంబానీకి ఎస్బీఐ షాక్) అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ తీసుకున్న కార్పొరేట్ రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇవి మొండి బకాయిలుగా మారటంతో దివాలా చట్టం ప్రకారం అంబానీ నుంచి రూ.1200 కోట్లను రాబట్టేందుకు ఎస్బీఐ రంగంలోకి దిగింది. కార్పొరేట్ రుణాల చెల్లింపుల ప్రక్రియకు ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఎస్బీఐ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మొబైల్ సేవల్ సంస్థ ఆర్‌కామ్ 2002లో అనిల్ అంబానీ ప్రారంభించారు. కానీ పోటీకి నిలబడలేక, భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ఆ తరువాత 2016లో ముకేశ్ అంబానీ సృష్టించిన జియో సునామీతో మరింత కుదేలై దివాలా తీసింది. అటు 2017 జనవరిలో రుణ చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో ఆర్‌ఐటిఎల్ రుణాన్ని 26 ఆగస్టు 2016 నుండి నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది బ్యాంకు. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు మూతపడ్డాయి. మరోవైపుఈ విషయం కార్పొరేట్ రుణానికి సంబంధించినదని, వ్యక్తిగత రుణానికి చెందినది కాదని అడాగ్ గ్రూపు గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే రుణ పరిష్కార ప్రణాళికలకు రుణదాతలు అంగీకరించారని, ట్రైబ్యునల్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది. -
నకిలీ యాడ్స్‌పై ఓఎల్ఎస్, క్వికర్‌లకు హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఒఎల్ఎక్స్, క్వికర్‌లు తమ వెబ్సైట్లలో రిలయన్స్ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పొందుపరచడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఒఎల్ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్‌లను ఆదేశించింది. జియో జాబ్స్, రిలయన్స్ ట్రెండ్స్ జాబ్స్ అనే వర్డ్స్‌ను ఉపయోగిస్తూ నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రతిష్ట, గుడ్‌విల్ దెబ్బతింటాయని ఆర్ఐఎల్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో ఆర్ఐఎల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు అనుకూలంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మధ్యంతర ఊరట కల్పిచని పక్షంలో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జస్టిస్ ముక్తా గుప్తా రెండు వేర్వేరు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జియో, రిలయన్స్ ట్రేడ్‌మార్క్‌లకు తాము సొంతదారులమని ఓఎల్ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు తమ గుడ్‌విల్‌కు, ప్రతిష్టకు తీరని హాని కలిగించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్ఐఎల్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : మరో మెగాడీల్‌కు జియో రెడీ -
‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు!
న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికారులు తమకు సహకరించడం లేదంటూ నిర్భయ దోషులు ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను అధికారులు ఇవ్వడం లేదని ఉరిశిక్ష పడిన నలుగురిలో ముగ్గురు శుక్రవారం కోర్టులో పిటిషన్లు వేశారు. వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌కు అవసరమైన 70 పేజీల డైరీ ప్రతితోపాటు అక్షయ్‌కుమార్ సింగ్, పవన్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్లకు జైలు అధికారులు కొన్ని పత్రాలను ఇవ్వాల్సి ఉందని అందులో తెలిపారు. అవి లేనందున వెంటనే దరఖాస్తు చేయలేకపోయామని, వాటిని వెంటనే ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకోసం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భావించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పటియాలా హౌస్ కోర్టులో వేసిన ఈ పిటిషన్లు శనివారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. కాగా, వినయ్, ముకేశ్ సింగ్‌లు ఆఖరిప్రయత్నంగా వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతోపాటు ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరిశిక్ష అమలును పలు విధాలుగా సవాలు చేస్తూ కాలం గడిపేయొచ్చనే అభిప్రాయం దోషుల్లో ఏర్పడరాదంటూ గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ఉన్నావ్ కేసు : ఢిల్లీ హైకోర్టుకు సెంగార్
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ సామూహిక లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనకు విధించిన యావజ్జీవ ఖైదును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఉన్నావ్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో గత ఏడాది డిసెంబర్ 20న సెంగార్‌కు తీస్‌హజారి కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. జీవిత ఖైదుతో పాటు రూ 25 లక్షల జరిమానా విధించింది. ఆయనకు జైలు శిక్ష రెండేళ్లకు పైగా విధించడంతో యూపీ అసెంబ్లీకి సెంగార్ ఎన్నిక రద్దయింది. ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద సెంగార్‌పై లైంగిక దాడి అభియోగాలను ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు ధ్రువీకరించింది. సెంగార్‌పై ఆరోపణలను సీబీఐ నిరూపించగలిగిందని తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి ధర్మేష్ శర్మ పేర్కొన్నారు. సెంగార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. -
‘నిర్భయ’ దోషుల కేసును మరో జడ్జికి అప్పగించండి
న్యూఢిల్లీ: మరో న్యాయమూర్తికి తమ కేసును బదిలీ చేయాలంటూ అత్యాచార బాధితురాలైన నిర్భయ తల్లిదండ్రులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అలాగే, అత్యాచారానికి పాల్పడిన దోషుల ఉరిశిక్షను త్వరగా అమలు చేసేలా తీహార్ జైలు అధికారులను ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై 25న విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. నిర్భయ కేసును విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ కావడంతో, ఈ కేసు పదేపదే వాయిదా పడుతోందని నిర్భయ తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లైంగిక వేధింపుల కేసులను త్వరితగతిన విచారించేందుకు పటియాలా హౌజ్‌కోర్టులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కోర్టు న్యాయమూర్తి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. -
న్యాయం.. 23 ఏళ్లు వాయిదా!
శ్రీనగర్: వారి జీవితంలోని విలువైన కాలమంతా జైలు నాలుగు గోడలమధ్యే గడిచిపోయింది. దాదాపు 23 ఏళ్ల పాటు జైళ్లో నిర్బంధించి, ఇప్పుడు తీరిగ్గా నిర్దోషులేనంటూ వారిని విడుదల చేశారు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ అలీ భట్, లతీఫ్ అహ్మద్ వాజా, మీర్జా నాసర్ హుస్సేన్‌ల విషాదమిది. లజపతినగర్ మార్కెట్ పేలుళ్లలో హస్తం ఉందంటూ వీరిని మొదట 1996లో ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఓ బస్సును పేల్చారనే ఆరోపణలపై రాజస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లజపత్ నగర్ కేసుకు సంబంధించి వీరిని 2012లో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రాజస్తాన్ బస్సు కేసు నుంచి బయటపడకపోవడంతో ఆ తరువాతా వారు జైల్లోనే మగ్గాల్సి వచ్చింది. తాజాగా రాజస్తాన్ హైకోర్టు సైతం వారిని నిర్దోషులంటూ తీర్పు ఇవ్వడంతో.. ఎట్టకేలకు 23 ఏళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయిన అనంతరం స్వేచ్ఛాప్రపంచంలోకి రాగలిగారు. కశ్మీరీ ఉపకరణాలను అమ్మి జీవనం గడిపేందుకు నేపాల్ వెళ్లిన వారిని 1996లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ’నేపాల్‌లో ఉన్న సామాన్యులమైన మేం ఢిల్లీలో, రాజస్తాన్‌లో బాంబు పేలుళ్లకెలా బాధ్యులమవుతాం? మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకుని మమ్మల్ని బలిపశువులను చేశారు’ అని శ్రీనగర్‌కు చెందిన వాజా ఆవేదన వ్యక్తం చేశారు. భట్ జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఇంటికి వెళ్లగానే మొదట భట్ స్మశానవాటికకు వెళ్లి తన తల్లిదండ్రుల సమాధుల వద్ద చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ‘నా సగం జీవితాన్ని కోల్పోయాను. నాకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు?’ అనే భట్ ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. మాలాంటి అమాయకులు ఇంకా జైళ్లలో చాలామంది ఉన్నారని ఈ ముగ్గురు చెబుతున్నారు. -
విదేశాలకు వెళ్లాలనుకుంటే 18,000 కోట్లు కట్టండి
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఆయన కంపెనీ (జెట్‌ఎయిర్‌వేస్) రుణదాతలకు బకాయి పడిన రూ.18,000 కోట్లను గ్యారంటీ కింద డిపాజిట్ చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. దేశం విడిచి వెళ్లేందుకు గోయల్ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకవుట్ సర్క్యులర్ (విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత వ్యక్తి పోలీసుల విచారణకు అసరమా అని గుర్తించి నిలిపివేయడం)ను సవాల్ చేయగా, దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోర్టు కోరింది. ‘‘ఈ సమయంలో గోయల్‌కు ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించేది లేదు. మీరు 18,000 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధపడితే, విదేశానికి వెళ్లొచ్చు’’ అని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్ అన్నారు. ఈ ఏడాది మే 25న దుబాయికి వెళ్లే విమానం నుంచి, గోయల్, అతని భార్య అనిత్ను విమానాశ్రయంలో దించేసిన విషయం గమనార్హం. అయితే, తనపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా, లుకవుట్ సర్క్యులర్ పేరిట ఈ విధమైన చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ గోయల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. తమ స్పందన తెలియజేయాలని హోం, కార్పొరేట్, న్యాయ శాఖలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్ట్ 23కు వాయిదా వేసింది. నిధుల కోసమే... గోయల్ దంపతుల తరఫున న్యాయవాది మణిందర్‌సింగ్ వాదనలు వినిపించారు. మే 25న వారిని విమానం నుంచి దించేసినప్పుడు, వారు విచారణను తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పేందుకు ఏ ఆధారం చూపలేదన్నారు. హైకోర్టులో గోయల్ పిటిషన్ దాఖలు చేసే వరకు ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, జూలై 6న మాత్రం, పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఎస్ఎఫ్ఐవో నుంచి విచారణకు రావాలని గోయల్‌కు సమన్లు అందినట్టు వివరించారు. తమ క్లయింట్లు ఎన్ఆర్ఐ హోదా కలిగిన వారని, జెట్ గ్రూపు కోసం నిధులు సమకూర్చుకునేందుకు దుబాయి, లండన్ వెళ్లాలనుకున్నట్టు తెలిపారు. గోయల్‌కు బ్రిటన్ నివాస వీసా, యూఏఈ నివాస పర్మిట్ ఉన్నాయని, ఇవి ఈ నెల 10, 23వ తేదీల్లో గడువు రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నందున వెంటనే బ్రిటన్, యూఏఈ వెళ్లాల్సి ఉందన్నారు. అయితే, నరేష్ గోయల్ అభ్యర్థనకు వ్యతిరేకంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ ఆచార్య వాదనలు వినిపిస్తూ... ఇది తీవ్రమైన రూ.18,000 కోట్ల మోసమని, ఎస్ఎఫ్ఐవో ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ విచారణలో గోయల్ పాల్గొని తన స్పందనను తెలియజేయాల్సి ఉందన్నారు. -
జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌కు చుక్కెదురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వాటాను 74 శాతానికి పెంచుకోవాలనుకున్న జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు తీర్పుతో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్వెస్ట్ గ్రూప్‌నకు ఊరట లభించింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్) ఈ గ్రూప్ కంపెనీ అయిన బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) ఉన్న 13.5 శాతం వాటాను థర్డ్ పార్టీకి విక్రయించుకోవచ్చని జస్టిస్ సంజీవ్ నరూలా తీర్పు వెలువరించారు. అంతేగాక వాటా విక్రయాన్ని నిలిపివేయాలంటూ గతంలో ఇదే కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. బిడ్ సర్వీసెస్ డివిజన్ నుంచి వాటా కొనుగోలు విషయంలో డీల్‌ను సకాలంలో పూర్తి చేసే ఉద్దేశం జీవీకే కంపెనీ కనబరచలేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే బిడ్ సర్వీసెస్ వాటాను దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఇదీ కేసు నేపథ్యం.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తనకున్న వాటాను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్ ఒకరు ఆసక్తి కనబరుస్తున్నారంటూ జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు కొన్ని నెలల క్రితం బిడ్ సర్వీసెస్ డివిజన్ నోటీసు ఇచ్చింది. దీంతో రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ అస్త్రాన్ని జీవీకే ప్రయోగించింది. బిడ్వెస్ట్ వాటాతోపాటు ఏసీఎస్ఏ గ్లోబల్ నుంచి 10 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు జీవీకే కసరత్తు చేసింది. ఈ ప్రక్రియ పూర్తి అయితే జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ వాటా 50.5 శాతం నుంచి 74 శాతానికి చేరుతుంది. ఈ డీల్ కోసం జీవీకే రూ. 2,171.14 కోట్లు చెల్లించాలి. అయితే నిధులు లేకపోవడంతో డీల్ పూర్తి చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వాలని బిడ్వెస్ట్ను జీవీకే కోరింది. అంత వరకు వేచి చూసేది లేదని, ఇన్వెస్టర్ పెట్టుబడితో సిద్ధంగా ఉన్నారంటూ బిడ్వెస్ట్ తేల్చి చెప్పింది. దీంతో జీవీకే కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. తాజాగా కోర్టు తీర్పుతో బిడ్వెస్ట్ వాటా విక్రయానికి అడ్డంకులు తొలగిపోయాయి. -
ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టు షాక్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ఓ అవినీతి కేసులో ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ వ్యాపారి సతీశ్ సానా ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆస్థానా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆస్థానాపై క్రిమినల్ విచారణ జరపకుండా, అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి వజీరీ మాట్లాడుతూ.. ఆస్థానా, కుమార్‌లను విచారించేందుకు, అరెస్ట్ చేసేందుకు ఇకపై కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కేసు విచారణను 10 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీబీఐ అప్పటి డైరెక్టర్ ఆలోక్ వర్మపై చేసిన అభియోగాలకు తగిన ఆధారాల్లే్లవని అభిప్రాయపడ్డారు. ఓ కేసులో తనకు ఊరట కల్పించేందుకు ఆస్థానా లంచం తీసుకున్నారని సతీశ్ సానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ హోదాను దుర్వినియోగం చేస్తూ తనను వేధించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని అందులో ఆరోపించారు. దీంతో ఆస్థానాపై అవినీతి నిరోధక చట్టంలోని నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన తదితర సెక్షన్ల కింద సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ తీర్పును ఆస్థానా సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశముంది. -
కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్ రాజీనామా చేశారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగాతేలి శిక్ష పడటంతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సోమవారం ఢిల్లీ హైకోర్టు సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. 2,733 మంది మృతిచెందిన ఆ ఘటనలో శిక్ష పడిన తొలి రాజకీయ నేత సజ్జన్. 1984 నవంబర్ 1,2 తేదీల్లో జరిగిన అల్లర్లలో ఐదుగురు సిక్కులను హత్యచేసిన ఘటనలో సజ్జన్ పాత్ర నిరూపితమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన అల్లర్లలో 2,733 మంది సిక్కులు చనిపోయారు. ఇందిరకి రక్షణగా ఉన్న సిక్కులే ఆమెను హత్య చేయడంతో సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. -
బొగ్గు స్కాంలో మాజీ కార్యదర్శి దోషి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాను ఢిల్లీలోని ఓ కోర్టు దోషిగా నిర్ధారించింది. యూపీఏ హయాంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గుప్తాతోపాటు మరో ఐదుగురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరు రిటైరయ్యారు. 2005–08 సంవత్సరాల మధ్య బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తాకు బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన రెండు కేసుల్లో కలిపి ఇప్పటికే ఐదేళ్ల వరకు జైలుశిక్షలు పడ్డాయి. ఆయన ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. కోర్టు దోషులుగా ప్రకటించిన వారిలో కేఎస్ క్రోఫా అప్పట్లో బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉండి, తర్వాత మేఘాలయ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు. మరో అధికారి కేసీ సమ్రియా యూపీఏ హయాంలో బొగ్గు శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. శుక్రవారం విచారణ అనంతరం సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు దోషులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. డిసెంబర్ 3వ తేదీన కోర్టు వీరికి శిక్షలు ప్రకటించేదాకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. బొగ్గు బ్లాకుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ట్రయల్ కోర్టు 2015లో జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆయన పిటిషన్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమాచారాన్ని సీబీఐ లీక్ చేస్తోంది బొగ్గు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ గోప్యత పాటించడం లేదని స్పెషల్ జడ్జి ఓపీ సైనీ అన్నారు. సుప్రీంకోర్టు సూచనలను సీబీఐ పట్టించుకోకుండా బయటి వ్యక్తులకు దర్యాప్తు సమాచారాన్ని చేరవేస్తోందని వ్యాఖ్యానించారు. కుంభకోణానికి సంబంధించిన పలు కీలక విషయాలను సీబీఐ కోర్టు దృష్టికి తేకుండా దాచి ఉంచిందంటూ దాఖలైన పిటిషన్‌పై ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
సిక్కు వ్యతిరేక అల్లర్లు : హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు బుధవారం సమర్ధించింది. 1984లో తూర్పుఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి 88 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక న్యాయస్ధానం వెలువరించిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ ఘర్షణల్లో 2800 మంది సిక్కులు మరణించగా, వీరిలో 2100 మంది బాధితులు ఢిల్లీకి చెందినవారే కావడం గమనార్హం. కాగా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుకు సంబంధించి ఓ కేసులో దోషులుగా నిర్ధారించిన యశ్పాల్ సింగ్‌కు మరణశిక్ష, నరేష్ షెరావత్కు జీవిత ఖైదు విధిస్తూ ఈనెల 20న ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెలువరించింది. సిక్కు వర్గానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన కేసులో వీరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిద్దరికీ మరణ శిక్ష విధించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోరింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్ ప్రాంతంలో హర్దేవ్ సింగ్, అవతార్ సింగ్‌లను హత్య చేసిన కేసులో వీరు దోషులుగా తేలారు. మరోవైపు తగిన ఆధారాలు లేవంటూ 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును మూసివేయగా, సిట్ పునర్విచారణలో న్యాయస్ధానం వీరిని దోషులుగా నిర్ధారించడం గమనార్హం. -
చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వండి
న్యూడిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో నిజాలు రాబట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారించడం తప్పనిసరని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని ఓ కోర్టుకు తెలిపింది. కాంగ్రెస్ నేత అయిన చిదంబరం విచారణలో తమకు సహకరించడం లేదనీ, అన్నీ దాటవేత సమాధానాలిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ముందస్తు బెయిలు కోసం చిదంబరం చేసుకున్న అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. అనేక మంది ప్రముఖులతో సంబంధాలు కలిగిన ఆయన అత్యంత శక్తిమంతుడనీ, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను నాశనం చేయతగ్గ వ్యక్తి కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వకూడదని ఈడీ వాదించింది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించకపోతే దర్యాప్తును నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంది. కాగా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అభ్యర్థనను ఈ ఏడాది మే 30న కోర్టు తొలిసారి మన్నించడం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు ఈ వెసులుబాటును కోర్టు పొడిగించింది. గత నెల 8న కూడా ఆయనకు నవంబర్ 1 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
రాకేష్ ఆస్ధానాకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాకు ఊరట లభించింది. ఆస్ధానాపై అవినీతి ఆరోపణల కేసులో నవంబర్ 1 వరకూ యథాతథ స్థితి కొనసాగించాలని, అప్పటివరకూ ఆయనను అరెస్ట్ చేయరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం దర్యాప్తు ఏజెన్సీని ఆదేశించింది. మరోవైపు కేసుకు సంబంధించి సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని సీబీఐ చేసిన వినతిని కోర్టు అంగీకరించింది. కేసును పర్యవేక్షిస్తున్న బృందంమారిపోయిందని, ఆరోపణలపై దృష్టిసారించిన విజిలెన్స్ కమిషన్ వద్ద ఫైళ్లు ఉన్నాయని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు నివేదించింది. కాగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లోగా విచారణ ముగించాలని గత వారం సుప్రీం కోర్టు సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుగుణంగా అలోక్ వర్మపై దర్యాప్తుకు సంబంధించి అవసరమైన పత్రాలు, ఫైళ్లను సీవీఈసీకి దర్యాప్తు ఏజెన్సీ అందిస్తోంది. తనపై ముడుపుల కేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ రాకేష్ ఆస్ధానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో అప్రమత్తమైన ఆస్ధానా హైకోర్టును ఆశ్రయించారు. -
రాహుల్ గాంధీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: 2011–12 ఆర్థిక సంత్సరంలో తాము చెల్లించిన పన్నుల వివరాలను మరో సారి తనిఖీ చేయకుండా అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో ఆ ఏడాదిలో గాంధీలతోపాటు కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్‌లు చెల్లించిన పన్నుల వివరాలను ఆదాయపు పన్ను విభాగం అధికారులు మరోసారి తనిఖీ చేసి పన్ను ఎగవేతల విషయాన్ని తేల్చనున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కంపెనీని యంగ్ ఇండియా (వైఐ) అనే సంస్థ కొనుగోలు చేసింది. 2011–12 ఏడాదికి రాహుల్ రూ. 68 లక్షల ఆదాయానికే పన్ను చెల్లించగా ఆయనకు వైఐలో ఉన్న వాటాల ద్వారా రూ. 154 కోట్ల ఆదాయం వచ్చిందని గతంలో అంచనా వేసింది. ఏజేఎల్ నుంచి తమ వాటాలను వైఐకి బదిలీ చేసే సమయంలో గాంధీలతోపాటు ఫెర్నాండెజ్ అవకతవకలకు పాల్పడి పన్ను తక్కువగా కట్టారనేది ఆరోపణ. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ ప్రధాని మోదీకి ధైర్యముంటే రాహుల్‌ను, కాంగ్రెస్‌ను రాజకీయ యుద్ధంలో ఎదుర్కోవాలనీ, ఆదాయపు పన్ను విభాగం వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి కాదని విరుచుకుపడ్డారు. -
అడుక్కోవడం నేరమెలా అవుతుంది: హైకోర్టు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యాచించడం నేరం కాదంటూ తీర్పునిచ్చింది ఢిల్లీ హైకోర్టు. ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం అడుక్కోవడాన్ని నేరం అని ఎలా అంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక యాచకులపై జరిమానాలు విధించడం రాజ్యంగ విరుద్ధమని ప్రకటించింది. ‘ఢిల్లీలో అడుక్కోవడాన్ని నేరంగా పరిగణించడానికి బదులుగా యాచకులకు కనీస ప్రాథమిక హక్కులు కల్పించాలం’టూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కర్ణిక సావ్నీ, హర్ష మందర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ‘అడుక్కోవాలని ఎవరూ అనుకోరు. మనిషి ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా మరొకరిని యాచించాల్సి వస్తోంది. ప్రజలకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు యాచించడాన్ని నేరంగా ఎలా పరిగణిస్తాయ’ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ సి.హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాక పిల్లల చేత బలవంతంగా అడుక్కునేలా చేస్తున్న ముఠాలను అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యామ్నయ చట్టాన్ని తీసుకురావాలని ఆదేశించింది. ‘బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్’ ప్రకారం అడుక్కోవడం నేరం. దీన్ని సవాలు చేస్తూ పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారు. అయితే పేదరికం కారణంగా యాచించడం నేరం కాదని గతంలోనే ప్రభుత్వం కూడా వెల్లడించింది. ప్రస్తుతానికి అడుక్కోవడాన్ని నిషేధించే కేంద్ర చట్టాలు ఏమి లేవు. అయితే చాలా రాష్ట్రాలు బాంబే చట్టాన్నే పరిగణలోకి తీసుకొని, యాచించడాన్ని నేరంగా పరిగణిస్తూ తమ రాష్ట్ర చట్టాల్లో మార్పులు చేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం మొదటిసారి యాచిస్తూ పట్టుబడితే మూడేళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉంటుంది. మళ్లీ అలాగే చేస్తే పదేళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది. -
వీవీఐపీల వాహనాలకూ ఇవి తప్పనిసరి..
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్లకూ రిజిస్ర్టేషన్ నెంబర్లు విధిగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. వారితో పాటు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల వాహనాలకూ రిజిస్ర్టేషన్ నెంబర్లను డిస్ప్లే చేయాలని, సంబంధిత అథారిటీ వద్ద రిజిస్టర్ చేయించాలని పేర్కొంది. అత్యున్నత రాజ్యాంగ పదవులు నిర్వర్తించే వారి వాహనాలపై కేవలం ఇండియా ఎంబ్లమ్కు బదులు రిజిస్ట్రేషన్ నెంబర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు వెల్లడించింది. రిజిస్ర్టేషన్ నెంబర్‌కు బదులు నాలుగు సింహాలతో కూడిన దేశ ఎంబ్లమ్‌ను ప్రదర్శిస్తుండటంతో ఆయా పదవులు చేపడుతున్న వారు ఉగ్రవాదులకు సులభంగా టార్గెట్ అవుతున్నారని ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఎంబ్లమ్ ఉన్న వాహనాలను వీవీఐపీల వాహనాలుగా భావించి పోలీసు అధికారులు పరిశీలించని కారణంగా నేరపూరిత కార్యకలాపాల కోసం ఉగ్రవాదులు, నేరస్తులు ఈ వాహనాలను దుర్వినియోగపరిచే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. ఇక రిజిస్ర్టేషన్ నెంబర్ చూపని వాహనాలు చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టేనని కోర్టుకు నివేదించారు. -
నాలుగు రోజులు...3 వేల మంది
న్యూఢిల్లీ : అమ్మ తిట్టిందనో, మాష్టారు దండిచాడనో, స్నేహితులు గేలి చేశారనే కోపంలో క్షణికావేశంతో ఇల్లు విడిచి పారిపోతున్న చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలనే ఉద్ధేశంతో ఢిల్లీ పోలీసులు ఒక నూతన విధానాన్ని రూపొందించారు. ఈ నూతన విధానంతో కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 3000 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకుగాను ఈ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’కు కృతజ్ఞతలు తెలియజేసారు ఢిల్లీ పోలీసులు. ‘ఎఫ్ఆర్ఎస్’ కు సంబంధించిన పూర్తి వివరాలు... తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడానికి ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ (ఎఫ్ఆర్ఎస్) అనే ఒక నూతన విధానాన్ని రూపొందించారు. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను పరీక్షించాల్సిందిగా ఢిల్లీ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను టెస్ట్ చేసేందుకు తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పోలీసులు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను కోరారు. కానీ వారు అందుకు నిరాకరించడంతో పోలీసులు ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ ను పరీక్షించలేదు. ఈ నెల 5న కోర్టు ‘ఎఫ్ఆర్ఎస్’ పనితీరు గురించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక కమిషనర్ని (క్రైమ్) ప్రశించింది. కమిషనర్ కోర్టు ప్రశ్నకు బదులిస్తు ‘ఎఫ్ఆర్ఎస్’ను ఇంకా పరీక్షించలేదని తెలిపాడు. ఈ సమాధానంతో కోర్టు ఢిల్లీ పోలీసుల పనితీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అందుకు అధికారులు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి తమకు అవసరమయిన సమాచారం లభించలేదని తెలియజేసారు. అందువల్లనే ‘ఎఫ్ఆర్ఎస్’ను పరిక్షించలేదని తెలిపారు. దాంతో కోర్టు కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చింది. పిల్లలు తప్పిపోవడమనే సమస్య గత 20 సంవత్సరాల నుంచి చాలా తీవ్ర రూపం దాల్చిందని, ఇటువంటి విషయాన్ని మీరు తేలికగా తీసుకోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను పాటించకపోతే మీ మీద కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే పోలీసు అధికారుల, మంత్రిత్వ శాఖ అధికారుల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికారులు తమ వద్ద ఉన్న దాదాపు ఏడు లక్షల మంది తప్పిపోయిన చిన్నారుల వివరాలతో పాటు వారి ఫోటోలను కూడా పోలీసు అధికారులకు అందజేశారు. వివరాలను అందుకున్న అనంతరం పోలీసుల ‘ఎఫ్ఆర్ఎస్’ను పరీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ రాకేష్ శ్రీవాత్సవ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పొందుపర్చాడు. ఈ అఫిడవిట్లో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు వివిధ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న దాదాపు 45 వేల మంది చిన్నారులను ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ సాయంతో సరిపోల్చి వారిలో 2,930 మందిని తిరిగి వారి కుటుంబాలతో కలిపారని తెలిపారు. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’లో ముందుగా పిల్లల ముఖ కవళికలను స్టోర్ చేసి అనంతరం వాటిని పిల్లల ఫోటోగ్రాఫ్‌లతో పోల్చి చూస్తారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమీషన్ సభ్యుడు యశ్వంత్ జైన్ తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి వారి కుటుంబాలతో కలపడానికి ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ చాలా బాగా ఉపయోగపడుతుందంటూ దీని పనితీరును మెచ్చుకున్నాడు. ‘బచ్పన్ బచావో ఆందోళన్’ స్థాపకుడు భువన్ రిభూ ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను ఢిల్లీ పోలీసులకు ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించాడు. దాంతో పాటు ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ మాదిరిగానే ‘నేషనల్ చిల్డ్రన్స్ ట్రిబ్యునల్’ను ఏర్పాటుచేయాల్సిందిగా కోరాడు. -
2జీ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ : 2జీ కేసు నుంచి మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను నిర్ధోషులుగా వెల్లడించిన ప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రాజా, కనిమొళితో పాటు 17 మంది నిందితులకు ఈ కేసు నుంచి ప్రత్యేక న్యాయస్ధానం గత ఏడాది డిసెంబర్ 21న విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసు తీర్పును సోమవారం హైకోర్టులో ఈడీ సవాల్ చేయగా..తాజాగా సీబీఐ అప్పీల్ చేసింది. డీఎంకే నిర్వహిస్తున్న కళైంగర్ టీవీకి స్వాన్ టెలికాం ప్రమోటర్లు రూ 200 కోట్లు చెల్లించారని ఈడీ తన చార్జిషీట్లో ఆరోపించగా, 2జీ కేటాయింపుల్లో సర్కార్ ఖజానాకు రూ 30,984 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని ప్రత్యేక న్యాయస్ధాన న్యాయమూర్తి ఓపీ సైనీ పేర్కొంటూ నిందితులపై అభియోగాలను కొట్టివేశారు. -
ఈడీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కామ్‌కు సంబంధించి పరారీలో ఉన్న బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పేర్కొన్న మొత్తంపై స్పష్టత లేదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఈడీ ఏ అధికారాలతో ఆస్తుల సోదాకు వెళ్లిందో స్పష్టత కొరవడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని..దీనిపై ఈడీ ఏం చెబుతుందో వేచిచూస్తామని పేర్కొంది. కేసు వివరాలపై నీరవ్ మోదీ న్యాయవాది విజయ్ అగర్వాల్ సైతం గందరగోళంలో ఉన్నారంటూ కేసు విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని, కేసు వివరాలు అసమగ్రంగా ఉన్నాయని కోర్టు ఈడీకి తెలిపిందని అనంతరం నీరవ్ న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. పీఎన్బీ స్కామ్‌లో నీరవ్ మోదీని, ఆయన సంస్ధలను ప్రాసిక్యూట్ చేసేందుకు ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నీరవ్ మోదీని ఆయనకు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్, రాధాశిర్ జ్యూవెలర్ కంపెనీలను ప్రాసిక్యూట్ చేయనున్నారు. పీఎన్బీ స్కామ్‌లో కీలక నిందితుడు నీరవ్ మోదీని తమ ఎదుట హాజరు కావాలని కోరుతూ ఇప్పటికే ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు నీరవ్ నిరాకరించడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ ఈడీ మనీల్యాండరింగ్ నిరోధక కోర్టు (పీఎంఎల్ఏ)ను ఆశ్రయించింది. -
నీట్ అర్హత నిబంధనలపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం సీబీఎస్ఈ జారీ చేసిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్‌లోని అర్హత నిబంధనలపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటిఫికేషన్‌లోని నిబంధనలతో పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయిన అనేక మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమ స్పందన తెలపాల్సిందిగా కోర్టు సీబీఎస్ఈతోపాటు భారత వైద్య మండలి (ఎంసీఐ)ని కూడా ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత లేకపోయినా అభ్యర్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే దాని అర్థం వారిని కచ్చితంగా పరీక్షకు అనుమతిస్తారని కాదనీ, అది తుది తీర్పుకు లోబడి ఉంటుందంది. నీట్ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 9 చివరితేదీ కాగా పరీక్ష మే 6న జరగనుంది. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది n eligibility norms for NEET -
దైచీ ఆర్బిట్రేషన్‌లో కొత్త మలుపు!
న్యూఢిల్లీ: జపాన్ ఫార్మా దిగ్గజం– దైచీ శాంక్యో గెలిచిన రూ.3,500 కోట్ల ఆర్బ్రిట్రేషన్ కేసు అమలు దిశలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్ ఒకప్పటి ప్రమోటర్లు– మల్వీందర్ సింగ్, శివేందర్ సింగ్‌లకు చెందిన రెండు హోల్డింగ్ కంపెనీలు– ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్, ఆస్కార్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన ఆస్తుల్ని జప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జయంత్ నాథ్ వారెంట్లు జారీ చేశారు. తనఖాలో లేని ఆస్తుల జాబితాను 10 రోజుల్లో అందజేయాలని– సోదరులు మల్విందర్ సింగ్, శివేందర్ సింగ్‌లతో పాటు మరో 10 మందికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కేసు తదపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకూ వేతనాలు, చెల్లించాల్సిన బకాయిలకు మినహా మిగిలిన కార్యకలాపాలు దేనికీ ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ తన బ్యాంక్ ఖాతాలోని సొమ్మును వినియోగించరాదని సైతం ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. సింగ్ సోదరులు, ఈ కేసుకు సంబంధం ఉన్నవారు తమ స్థిర, చర ఆస్తులను అమ్మడం కానీ, బదలాయించడం కానీ చేయరాదని ఇంతక్రితమే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. -
సుప్రీం ముందుకు ‘బోఫోర్స్’
న్యూఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణంపై 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ శుక్రవారం సుప్రీంలో పిటిషన్ వేసింది. కేసుకు సంబంధించి మరిన్ని స్పష్టమైన ఆధారాలు, కీలక సాక్ష్యాలతో ఈ పిటిషన్ వేసినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేత అజయ్ అగర్వాల్ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. అగర్వాల్ వేసిన పిటిషన్లో ప్రతివాదిగా మరో పిటిషన్ వేయాలంటూ అటార్నీ జనరల్ వేణుగోపాల్ ఇటీవలే సీబీఐకి మౌఖికంగా సూచించారు. పిటిషన్ వేసిన 90 రోజుల్లోనే సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో అది జరగలేదు. ఈ నేపథ్యంలో బోఫోర్స్ కేసుకు సంబంధించిన కీలకమైన దస్తావేజులు, సాక్షాలతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రూ.64కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్న ఈ కేసులో యూరప్ పారిశ్రామిక వేత్తలైన హిందూజా సోదరులతోసహా పలువురిపై సీబీఐ వద్ద పూర్తి ఆధారాలున్నట్లు సమాచారం. మే 31, 2005న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ సోధి ఈ కుంభకోణంలో సీబీఐ కేసును కొట్టేశారు. అంతకుముందు, 2004 ఫిబ్రవరి4న మరో జడ్జి జస్టిస్ జేడీ కపూర్. ఈ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ ప్రమేయం లేదంటూ నిర్దోషిగా ప్రకటించారు. ‘బోఫోర్స్’ కథాకమామిషు.. భారత ప్రభుత్వం స్వీడన్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య నాలుగు వందల 155ఎంఎం హోవిట్జర్లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులకు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏబీ బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ అర్డ్బో, మధ్యవర్తులుగా ఉన్న విన్ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. దీంతోపాటుగా 1982 నుంచి 1987 మధ్య పలువురు భారతీయ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అవినీతి, మోసానికి పాల్పడటం ద్వారా నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. 1999 అక్టోబర్ 22న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో చద్దా, ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణ కార్యదర్శి ఎస్కే భట్నాగర్, బోఫోర్స్ కంపెనీ, అర్డ్‌బోల పేర్లను పేర్కొంది. 2000, అక్టోబర్ 9 దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో హిందూజా సోదరుల పేర్లనూ పేర్కొంది. మార్చి4, 2011న సీబీఐ ప్రత్యేక కోర్టు ఖత్రోచీకి కేసునుంచి విముక్తి కల్పించింది. 2013 జూలై 13న ఖత్రోచీ మరణించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న భట్నాగర్, చద్దా, అర్డ్‌బోలు కూడా చనిపోయారు. -
శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదు!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన భూముల్ని శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని శ్మశానంగా వాడుకోవడంపై సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ ఖబరస్తాన్ ఇంత్జామియా అసోసియేషన్ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో పాటు ఈ స్థలంపై మరెవరికీ చట్టపరమైన హక్కు లేనందున శ్మశానంగా వాడుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా వాడుకునే హక్కు ఎవరికీ లేదనీ, కోర్టు ఆదేశాలను అన్ని పక్షాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. -
బంధించి ఆధ్యాత్మిక బోధనా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో అమ్మాయిలను బంధించి ఉంచిన ‘ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్’ ఆశ్రమం స్థాపకుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. ఆశ్రమంలా ఉండే ఈ ఆధ్యాత్మిక వర్సిటీ తరఫు న్యాయవాది వాదిస్తూ అమ్మాయిలంతా ఇష్టపూర్వకంగానే అక్కడ ఉంటున్నారని చెప్పడంతో కోర్టు ‘వందలమందిని గదుల్లో ఉంచారు. కుటుంబీకులను, స్నేహితులను ఎవ్వరినీ కలవనివ్వడం లేదు. బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు. అలాంటప్పుడు వారు ఇష్ట ప్రకారమే ఉంటున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు? జంతువుల్లా బంధించి ఏం ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారో అర్థం కావట్లేదు’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ హరిశంకర్ల బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో దీక్షిత్ నడుపుతున్న ఇలాంటి మరో 8 కేంద్రాలనూ తనిఖీ చేయాలని సంబంధిత కమిటీని కోరింది. ఎన్జీవో కేసుతో వెలుగులోకి ఈ ఆశ్రమం బాగోతం ‘ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్’ అనే ఎన్జీవో, ఆశ్రమంలో ఉంటున్న ముగ్గురు బాలికల తల్లిదండ్రులు వేసిన పిటిషన్లతో నాలుగు రోజుల క్రితం వెలుగులోకొచ్చింది. రోహిణిలో ‘ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ్’ పేరుతో ఉన్న ఆశ్రమంలో వందలాది అమ్మాయిలను, మహిళలను గదుల్లో బంధించారు. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వారిని వాడుకుంటున్నారనీ, కొందరు గతంలో సూసైడ్ చేసుకున్నారనీ, పోలీసుల దృష్టికి ఈ విషయం వెళ్లినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎన్జీవో పేర్కొంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు వెంటనే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్, ఇద్దరు న్యాయవాదులతో ఓ కమిటీని రంగంలోకి దింపింది. గురువారం ఆశ్రమాన్ని కమిటీ తనిఖీ చేసింది. మొత్తం నాలుగు అంతస్తులున్న ఆశ్రమ భవంతిలో దాదాపు 200 మందికి పైగా అమ్మాయిలు, మహిళలు బందీలుగా ఉన్నారనీ, అదొక కోటలా, రహస్య గదులు ఉన్నాయని కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ వివరించారు. -
విచారణ ఖైదీల పరిస్థితి బాధాకరం
న్యూఢిల్లీ: విచారణ ఖైదీలకు (అండర్ ట్రయల్) బెయిల్ వచ్చినా పేదరికం కారణంగా బాండ్/పూచీకత్తు సమర్పించలేక తీహార్ జైలులోనే కొట్టుమిట్టాడుతున్నారని, ఇదీ చాలా బాధాకరమైన అంశమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వారికి ఊరట కలిగించేలా ట్రయల్ కోర్టులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మార్గదర్శకాలు ఇచ్చింది. ఎంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. లా కమిషన్ కూడా విచారణ ఖైదీల విషయంలో రిస్క్ అస్సెస్మెంట్ చేసి.. బెయిల్ షరతులను పూర్తి చేయలేక జైలులోనే మగ్గుతున్న వారిని విడుదల చేయాలని సూచించిందని పేర్కొంది. ఇలాంటి కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని, బెయిల్ వచ్చినా విచారణ ఖైదీ ఎందుకు విడుదల కాలేదనే విషయంపై సమీక్షించి బెయిల్ షరతులను మార్చాలంది. వారి కోసం చట్టం! న్యూఢిల్లీ: చేయని తప్పునకు శిక్ష అనుభవించిన బాధితులకు పరిహారం ఇచ్చేలా మన దేశంలో చట్టం ఉందా?.. ఢిల్లీ హైకోర్టు సూచన మేరకు ఈ విషయమై లా కమిషన్ పరిశీలన మొదలుపెట్టింది. చేయని తప్పునకు శిక్ష అనుభవించిన, తీవ్రంగా విచారించబడిన బాధితులకు పరిహారం ఇచ్చేందుకు చట్టపరమైన పరిష్కారాలు లేకపోవడంపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి బాధితులకు ధనం, ఇతర పరిహారం ఇచ్చేందుకు అమెరికాలో 32 రాష్ట్రాల్లో చట్టాలున్నా యని నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎస్ బాజ్‌పాయ్ నివేదికను ప్రస్తావించింది. -
విక్స్ యాక్షన్, డీకోల్డ్‌లపై పునఃపరిశీలన
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు నిషేధం ఎత్తేసిన విక్స్ యాక్షన్ 500, డీకోల్డ్ లాంటి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) మందులను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బాధ్యతను డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(డీటీఏబీ)కు అప్పగించాలని కోర్టు కేంద్రానికి సూచించింది. కోరెక్స్ దగ్గు మందు, క్రోసిన్ కోల్డ్, విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా, డీకోల్డ్, సారిడాన్, అస్కోరిల్, అలెక్స్ దగ్గు మందు, ఫెన్సెడిల్ దగ్గు మందు, గ్లెకోడిన్ దగ్గు మందు లాంటి ఔషధాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ కేంద్రం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ఎఫ్‌డీసీల వాడకంతో మనుషులు, జంతువులకు ముప్పు ఉందంటూ కేంద్రం వాటిని 2016లో నిషేధించగా,డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. -
అసలు ఏమైనా తెలుసా మీకు.. సుప్రీం చీవాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టులో కేసులు పెండింగ్ ఉండటంపై ఆ కోర్టు రిజిస్ట్రార్ సుప్రీంకోర్టులో నీళ్లు నమిలారు. ఉన్నత న్యాయస్థానం వరుసగా ఆయనకు ప్రశ్నలు సందించడంతో 'ఐయామ్ వెరీ నెర్వస్ మై లార్డ్' అంటూ మరో ప్రశ్న వేయకుండా సమాధానం చెప్పారు. వీలయినంత త్వరగా కేసులు విచారణకు వచ్చేలా చూస్తానని అన్నారు. భారీ ఎత్తున కేసులు పేరుకుపోవడం, కేసులు విచారణ ఆలస్యం జరుగుతుండటంపై ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)ని జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. జస్టిస్ గొగోయ్ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి ఆర్జీ కంగారు పడిపోయారు. న్యాయమూర్తి అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు. గత పదేళ్లుగా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అడిగినా ఆయన నామమాత్రం కూడా సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అసలు మీరు కోర్టుకు ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడ ఏ కేసు విచారణ జరుగుతుందనే విషయం అయినా తెలుసా? . 1994 నుంచి కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో అనే విషయం కూడా మీకు తెలియదు. మీకు కనీసం ఆ విషయం అయినా తెలుసుండాలి ? అని గొగోయ్ ప్రశ్నించింది. దీంతో నీళ్లు నమిలిన రిజిస్ట్రార్ 'అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఐయామ్ వెరీ నెర్వస్ మై లార్డ్. దయచేసి నాకు కొంచెం గడువు ఇవ్వండి' అని ప్రార్థించాడు. దీనికి బదులిచ్చిన గొగోయ్ 'అయితే సరే.. మీకు కొంచెం గడువు ఇస్తున్నాను. ఆ సమయంలోగానైనా మీ నెర్వస్ పోతుందేమో చూస్తాము' అని అన్నారు. -
అది జాతిపితను అవమానించటమే!
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ స్మారకం (రాజ్‌ఘాట్) వద్ద విరాళాల హుండీని ఉంచటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య జాతిపితను అవమానించినట్లేనని పేర్కొంది. సేకరించిన నిధులను వేటికోసం వినియోగిస్తున్నారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. అయితే మహాత్ముడు స్థాపించిన ‘హరిజన్ సేవక్ సంఘ్’ ఈ హుండీని ఏర్పాటు చేసిందని.. ఈ సంస్థ అవసరాలకే నిధులు వినియోగిస్తున్నట్లు రాజ్‌ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కమిటీ వివరించింది. దీనిపై కోర్టు మండిపడింది. ‘ఇదేనా మనం జాతిపితకు ఇచ్చే గౌరవం. భారతీయులతోపాటు వేలసంఖ్యలో విదేశీయులూ రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ విరాళాల హుండీలు పెట్టడం గాంధీని అవమానించటమే’ అని స్పష్టం చేసింది. రాజ్‌ఘాట్‌లో కనీస ఏర్పాట్లపై వివరాలివ్వాలని సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించింది. -
శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ ఎందుకు?
న్యూఢిల్లీ: అలంకారానికి వాడే సిందూరం, కాటుక లాంటి వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తూ మహిళలకు అత్యంత అవసరమైన శానిటరీ న్యాప్కిన్లపై పన్ను వేయడంలోని హేతుబద్ధత ఏంటని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. శానిటరీ న్యాప్కిన్లు అత్యంత అవసరమని, వాటిపై పన్ను విధించడానికి సంబంధించి వివరణ ఇవ్వగలరా అని అడిగింది. జీఎస్టీ మండలిలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాప్కిన్లపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. -
‘పిల్‌ను రాజకీయ వ్యాజ్యంగా మార్చారు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశీ థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) స్వామి రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సునంద హత్య కేసులో ఆమె భర్త శశీ థరూర్ జోక్యాన్ని నివారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జరుపుతున్న విచారణను పర్యవేక్షించాలని స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్ మురళీధర్, ఐఎస్ మెహతాల ధర్మాసనం.. పిటిషనర్ కోర్టుకు సమర్పించిన ఆధారాలతో సిట్ విచారణను పర్యవేక్షించలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తాను శశీ థరూర్, ఢిల్లీ పోలీసులపై చేసిన ఆరోపణలకు సంబంధించి`న రహస్య సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పిస్తానని స్వామి చెప్పారు. -
రేప్ బాధితురాలి మౌనం.. కరెక్ట్ కాదు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం కేసులో బాధితురాలు మౌనంగా ఉన్నంత మాత్రాన.. నిందితుడితో శారీరక సంబంధం ఉందని అంగీకరించినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. బాధితురాలిపై తాను ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని.. విచారణ సమయంలో ఆమె ఏం మాట్లాడకుండా ఉండటమే అందుకు నిదర్శనమని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 19 ఏళ్ల యువతిని నిర్భందించి అత్యాచారం చేసిన కేసులో దిగువ న్యాయస్థానం రెండేళ్ల క్రితం అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాజా పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి సంగీత దింగర సెహగల్ స్పందిస్తూ.. బాధితురాలు మౌనంగా ఉంటే నిందితుడితో పరస్పర శారీరక సంబంధం ఉన్నట్లేనా? అలా అంగీకరించినట్లు ఎలా అవుతుందని పిటిషనర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడిని నిరపరాధిగా తేల్చటం కుదరదని తేల్చి చెప్పింది. పైగా ఈ కేసులో ఆమెను బెదిరించినట్లు కూడా స్పష్టంగా తేలిందని జడ్జి తెలిపారు. యువతి చెప్పిన కథనం ప్రకారం.. 2010లో యూపీకి చెందిన ఆమె పని కోసం ఢిల్లీకి చేరుకుంది. అక్కడ మున్నా అనే ఓ వ్యక్తి పని ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి.. హర్యానాలోని పానిపట్‌కు తీసుకెళ్లి ఓ అపార్ట్మెంట్లో ఉంచి రెండు నెలలు అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అటుపై నోయిడాలోని కుమార్ అనే మరో స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్లి ఆమెను అమ్మేందుకు యత్నించాడు. అయితే మున్నాకు తెలీకుండా కుమార్ కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మున్నా కుమార్‌తో గోడవకు దిగటంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా.. 2015లో ట్రయల్ కోర్టు మున్నాకు 10 ఏళ్ల శిక్ష విధించింది. -
కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. కన్హయ్యతో పాటు మరో 14 మంది విద్యార్థులపై విశ్వవిద్యాలయం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తప్పుపడుతూ ఇది సహజ న్యాయ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ వి.కామేశ్వర్రావు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై వర్సిటీ అప్పిలేట్ అథారిటీ పునఃపరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి వివరణ తీసుకుని ఆరువారాల్లోగా విద్యార్థులపై చర్యలకు తగు కారణాలను వెల్లడించాలని సూచించింది. -
పురుషులు రేప్‌కు గురయితే..?
సాక్షి, న్యూఢిల్లీ: పురుషులు అత్యాచారానికి గురైతే ఫిర్యాదు చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉందని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఐపీసీ 375, 376 సెక్షన్లు పురుషుల పట్ల వివక్ష చూపుతున్నాయని, మహిళలను ఇవి అపరాధులుగా చేర్చడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి హరిశంకర్ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత చట్ట నిబంధనలు మహిళను అత్యాచార బాధితురాలిగా, పురుషుడిని కేవలం నిందితుడిగా గుర్తిస్తున్నాయని.. లైంగిక హింస నేపథ్యంలో జెండర్ ఆధారంగా నేరాన్ని ఎలా అర్థం చేసుకుంటారని పిటిషనర్ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పితృస్వామ్య సమాజంలో పురుషులు తమపై జరిగే లైంగిక దాడులపై నోరు మెదపలేకపోతున్నారని, మగాళ్లపై అత్యాచార ఘటనలు చాలా తక్కువే అయినా వాటిని విస్మరించలేమని అన్నారు. పురుషులు ఎవరైనా తమపై అత్యాచారం జరిగిందనే ఫిర్యాదు చేస్తే అతడిని సమాజం నిజమైన మగాడుగా గుర్తించదని వాపోయారు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, లింగ ఆధారంగా వివక్షను వ్యతిరేకించే ఆర్టికల్ 15 ప్రకారం మహిళలకు ఉండే హక్కులే పురుషులకూ వర్తించాలన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై న్యాయస్థానం అక్టోబర్ 23న విచారణ జరపనుంది. -
హనీప్రీత్ ఏ తప్పు చేయలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక, మోస్ట్ వాంటెడ్ హనీప్రీత్ సింగ్ ఇండియాలోనే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించబోతుందని సమాచారం. ఈ మేరకు బెయిల్ దరఖాస్తు దాఖలు చేయనున్నట్లు ఆమె తరపు న్యాయవాది ప్రదీప్ ఆర్య మీడియాకు వెల్లడించారు. ‘‘గుర్మీత్ శిక్ష, తర్వాత పరిస్థితులు, బాబాకు ఆమెకు మధ్య ఉన్న సంబంధం గురించి చెడుగా వార్తలు రావటంపై హనీప్రీత్ బాధపడ్డారు. అల్లర్లకు ఆమె కారణమన్న పోలీసుల వాదన ముమ్మాటికీ తప్పు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాం’’ అని ప్రదీప్ ఆర్య తెలిపారు. అంతేకాదు బెయిల్ అప్లికేషన్‌పై సంతకం చేసేందుకు హనీప్రీత్ లజ్‌పత్ నగర్‌లోని తన కార్యాలయానికి వచ్చినట్లు ప్రదీప్ చెప్పారు. అయితే ఆమె ఎక్కడ ఉందన్న సమాచారం తనకు ఖచ్ఛితంగా తెలీదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఆలస్యం కావొచ్చని, కానీ, పిటిషన్‌ను త్వరగా పరిశీలించాలని తాను న్యాయమూర్తిని కోరతానని ప్రదీప్ తెలిపారు. ఆగష్టు 25న పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అత్యాచార కేసుల్లో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌కు 20 ఏళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. అనంతరం చెలరేగిన అల్లర్లలో 41 మంది చనిపోగా, 250 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు కారణమని పేర్కొంటూ 43 మంది మోస్ట్ వాంటెడ్ జాబితాను హర్యానా పోలీస్ శాఖ ప్రకటించగా, అందులో హనీప్రీత్ పేరు టాప్‌లో ఉంది. దీంతో లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో బిహార్‌సహా పలు రాష్ట్రాల్లో పోలీసులు ఆమె కోసం జల్లెడ పడుతున్నారు. -
'నాపై బీజేపీ కుట్ర, యుద్ధం మొదలైంది'
హమీపూర్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ...భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అరెస్ట్ చేయించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వీరభద్రసింగ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు నిన్న తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కేసు విచారణను తాము అడ్డుకోలేమని, కేసును రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వీరభద్రసింగ్ స్పందిస్తూ...సత్యం అనేది ఎప్పటికైనా గెలుపు సాధిస్తుందని వీరభద్రసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ధ్వజమత్తారు. తనపై బీజేపీ చేస్తున్న అవినీతి ఆరోపణలన్నీ అవాస్తవాలని, రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై రెండేళ్లుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, సీబీఐ దర్యాప్తు చేసి తనకు క్లీన్ చిట్ కూడా ఇచ్చిందన్నారు. తాను ఎలాంటి నేరపూరిత అంశం కనిపించలేదని తేల్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ తనపై రెండోసారి సీబీఐ దర్యాప్తు చేపట్టారన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని, యుద్ధం ఇప్పుడే మొదలైందని వీరభద్రసింగ్ అన్నారు. బీజేపీ నేతలు ప్రేమ్ కుమార్ దుమాల్, అనురాగ్ ఠాకూర్ కుట్రపన్ని తనని ఇరికించడానికి స్కెచ్ గీశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కాగా వీరభద్రసింగ్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రద్దు చేసిన ప్రాజెక్టును తిరిగి ఏర్పాటుచేసేందుకు వెంచర్ ఎనర్జీ అనే ప్రైవేటు జల విద్యుదుత్పత్తి సంస్థ నుంచి రూ. 6.61 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలతో ఆయనపై 2015 సెప్టెంబర్ 23న అక్రమాస్తుల కేసు నమోదైంది. వీరభద్రసింగ్తో పాటు ఆయన భార్యపై కూడా ఛార్జ్ షీట్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. డాక్యుమెంట్ల స్కూృటినీ పూర్తి కానందున ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. -
జెఎన్యూ అణువణువు శోధించండి: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పందించింది. అతడు కనిపించకుండాపోయి రెండు నెలలు గడిచిపోతుంది. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తాన్ని స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేయించాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ వినోద్ గోయల్ లతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. వర్సిటీలో అనువణువు గాలించి ఏదో ఒక ఆధారాన్నయినా సంపాదించాలని సూచించింది. అదే విధంగా జెఎన్యూ తో పాటు విద్యార్థి సంఘాలు (జెన్యూఎస్యూ)లో సెర్చ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది. నజీబ్ అహ్మద్ కిడ్నాప్ (అదృశ్యం)అయ్యాడని మొదటి నుంచి ఆరోపలున్నా, సాక్ష్యాలు లభ్యం కాకపోవడంతో కేసు యూ టర్న్ తీసుకుంటుంది. ఇష్టం లేక అతడే జెఎన్యూ నుంచి పారిపోయాడని వదంతులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు నజీబ్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు ప్రకటించిన రివార్డును రూ.50 వేల నుంచి 5 లక్షలకు పెంచేసినా ప్రయోజనం లేకపోయింది. గత అక్టోబర్ 15న అదృశ్యమవ్వక ముందురోజు నజీబ్ తో గొడవపడ్డ నలుగురు విద్యార్థులకు లై డిటెక్టర్ తో టెస్ట్ చేస్తామని పోలీసు అధికారి రాహుల్ మెహ్రా తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని మరో 10 రోజుల్లో విషయం తెలుస్తుందన్నారు. నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీజ్ నవంబర్ 26న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అప్పటినుంచీ ఈ కేసుపై ధర్మాసనం విచారిస్తుంది. కేసులో పురోగతి మాత్రం కనిపించడం లేదు. -
అతడిపై రివార్డ్ పదిరెట్లు పెంచేశారు!
న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయంపై ఢిల్లీ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. అతడు కనిపించకుండాపోయి 50 రోజులు గడిచిపోతున్నా పోలీసులు కనీసం ఒక ఆధారం కూడా తెలుసుకోలేకపోయారని, అంత సడన్‌గా విద్యార్థి ఎందుకు అదృశ్యమయ్యాడో చెప్పాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ వినోద్ గోయల్ లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ పోలీసుశాఖను వివరణ కోరింది. మరోవైపు నజీబ్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు ప్రకటించిన రివార్డును రూ.50 వేల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచేశారు. జెఎన్యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీజ్ నవంబర్ 26న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కుమారుడి అదృశ్యం విషయంలో అంతకుముందు కేంద్రహోం మంత్రిని ఆమె కలిశారు. నజీబ్‌ను వెతికేందుకు రాజ్‌నాథ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత కేసు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ ప్రాంతానికి చెందిన నజీబ్ బయో టెక్నాలజీ కోర్సు చేస్తున్నాడు. అయితే గత అక్టోబర్ 15న హాస్టల్ నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఈ ఘటనకు ముందురోజు ఏబీవీపీ వర్గానికి, నజీబ్‌కు మధ్య స్పల్ప ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. -
తీర్పుల్లో గ్రంథ చౌర్యం!
సాంకేతికంగా అభివృద్ధి చెందిన కాలంలో సమాచారానికి కొదువ లేదు. ఏ విషయం గురించి కావా లంటే ఆ విషయం మీద ఎంతో సమాచారం లభిస్తుంది. రకర కాలైన ఆధారాల నుంచి సమా చారం లభిస్తుంది. ఏ వ్యాసం చదివినా ఎంతో సమాచారం లభిస్తోంది. కొత్త ఆలోచనలు కన్పిస్తున్నాయి. ఆ ఆలోచ నలు వాళ్ల సొంతమా? లేక ఎక్కడినుంచైనా తస్కరించారో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇంగ్లీషు పుస్తకాలు, కవితలు చదివిన తెలుగు కవులు.. ఆ కవుల ఊహలను తస్కరించి తెలుగులో కవిత్వం రాస్తు న్నారన్న అపవాదు ఉండేది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. వ్యాసాలు రాస్తున్నప్పుడు చాలా విషయాలను ఉదహ రించాల్సి వస్తోంది. ఆ విధంగా ఉదహరించినప్పుడు అవి ఎక్కడి నుంచి సేకరించామో వాటిని ప్రస్తావించడం ధర్మం. ఆ విధంగా చేయకపోతే అది తప్పకుండా గ్రంథ చౌర్యం (ప్లాగియారిజం) అవుతుంది. ఈ కాలంలో గ్రంథ చౌర్యాన్ని దొరకబట్టడం అంత సులువైన విషయం కాదు. తెలివిగల వారు గ్రంథ చౌర్యం అని చెప్పే వీలులేకుండా గ్రంథ చౌర్యానికి పాల్పడుతున్నారు. మక్కీకి మక్కీగా పేర్కొన్న ప్పుడు మాత్రమే గ్రంథ చౌర్యం బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగా గ్రంథ చౌర్యం చేసే వ్యక్తులు కొంత మంది ఉంటే, మరికొంత మంది అనుకోకుండా ఈ గ్రంథ చౌర్యాలకు పాల్పడుతుంటారు. సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన న్యాయమూర్తి రూమాపాల్ 2011వ సంవత్సరం వీఎం తార్కుండే స్మారకోపన్యాసం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల గురించి ఓ తీవ్రమైన విమర్శ చేశారు. చాలా మంది న్యాయ మూర్తులు గతంలో జడ్జీలు చెప్పిన విషయాలనే తమ తీర్పుల్లో.. వాళ్లని కానీ, ఆ కేసులను కానీ ఉదహరిం చకుండా ప్రస్తావిస్తూ గ్రంథ చౌర్యానికి పాల్పడుతు న్నారని ఆమె ఆక్షేపించారు. ఆ విమర్శ అలా ఉండగానే అలాంటి తీర్పులు ఇంకా కన్పిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఈ మధ్య ఢిల్లీ హైకోర్టులో మరో సంఘటన జరిగింది. ఢిల్లీ హైకోర్టు తీర్పులో ఏకంగా కొన్ని పేరాలనే (4 నుంచి 37) ఓ వ్యాసం నుంచి ఉదహరించారు. అయితే ఆ వ్యాసకర్త పేరును తమ తీర్పులో ఎక్కడా ఢిల్లీ హైకోర్టు ఉదహరించలేదు. డిసెంబర్ 1, 2015 రోజున స్పైసీ ఐసీ బ్లాగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రోచా వర్సెస్ సిప్లా కేసుకు సంబంధించిన తీర్పులో 4వ పేరా నుంచి 37వ పేరా వరకు ఉన్న విషయాలన్నీ క్వీన్ మేరీ జర్నల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నుంచి తస్కరించినవని, ఆ వ్యాసాన్ని రాసిన రచయితలు శ్వేతశ్రీ మజుందార్, ఈషాన్ ఘోష్ అని ఆ బ్లాగ్ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆ రచయితలు తమ ఫేస్బుక్లో కూడా ప్రస్తావించారు. నవంబర్ 27, 2015 రోజున ఢిల్లీ హైకోర్టులోని న్యాయమూర్తులు ప్రదీప్ నంద్రాజోగ్, ముక్తాగుప్తాలతో కూడిన ధర్మాసనం రోచాకేసులో అప్పీలును పరిష్కరిస్తూ తమ తీర్పును ప్రకటించింది. అదే కోర్టులో ఏకసభ్య న్యాయమూర్తి సెప్టెంబర్ 7, 2012న ప్రకటించిన తీర్పుపై వచ్చిన తీర్పులోని అప్పీలు అది. ఫేస్బుక్లో, బ్లాగ్‌లో ఈ విషయం ప్రస్తావించిన తరువాత అదే న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని తమకు తాముగా స్వీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఆ పేరాలను తమ తీర్పు నుంచి తొలగించి మూల రచయితలకు క్షమాపణలు చెప్పారు. ఆ పేరాలు తమ తీర్పులో కన్పించడానికి కారణం తమ న్యాయ సహాయకుడు అని (లా ఇంటర్న్) తేల్చారు. న్యాయమూర్తి వెలువరించిన తీర్పు 275 పేజీలు ఉండటం వలన దాన్ని సంక్షిప్తం చేయాలని తమ న్యాయ సహాయకులకు చెప్పామని, దాని ముసాయిదా ప్రతిలో ఆ న్యాయ సహాయకులు ఆ పేరాలు పెట్టడం వల్ల ఆ విధంగా జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ విషయం తమ దృష్టికి రాగానే ఆ పేరాలను తొలగించడానికి విచారణను చేపట్టి అవి తొలగించామని కోర్టు పేర్కొంది. ఈ దిద్దుబాటు చర్యలను చాలా మంది స్వాగతిస్తున్నారు. మంచిదే. కానీ ఆ పేరాలు తీర్పులో కన్పించడానికి న్యాయమూర్తుల బాధ్యతను ఎవరూ ప్రశ్నించడం లేదు. ఈ న్యాయసహాయకుల పద్ధతి సబార్డినేట్ కోర్టుల్లో లేదు. హైకోర్టుల్లో మాత్రమే ఉంది. న్యాయమూర్తులకు సమయం ఉండదు కాబట్టి న్యాయసహాయకుల, న్యాయ క్లర్కుల అవసరం ఏర్పడింది. అలాంటి న్యాయ సహాయ కుల వల్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరూ అపఖ్యాతికి లోనయ్యారు. న్యాయసహాయకులు ఇచ్చిన ఫిర్యాదులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ న్యాయసహాయకులు అవసరమా? న్యాయసహాయకుల పాత్ర చాలా కేసుల్లో ఉంటు న్నట్లు అనిపిస్తోంది. అరుణా శాన్ బాగ్ కేసు 2011(4) ఎస్సీసీ 454 కేసులో న్యాయసహాయకుల పాత్రను న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ ప్రశంసించారు. ఆ తీర్పు ఆ విధంగా తుదిదశకు చేరటానికి కారణమైన న్యాయక్లర్కులకు, న్యాయసహాయకులకు కృతజ్ఞతలను తమ తీర్పులో ప్రకటించారు. ఈ తీర్పును న్యాయ మూర్తులు ఖట్జూ, జ్ఞానసుధా మిశ్రాలు వెలువరించారు. న్యాయసహాయకుల పాత్ర కేసుల పరిశోధన వరకు ఉంటే ఫర్వాలేదు. కానీ గ్రంథ చౌర్యం వరకు ఉండ కూడదు. తీర్పులను, న్యాయమూర్తులను ప్రభావితం చేయకుండా ఉండాలి. న్యాయసహాయకులు, న్యాయ మూర్తులు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఢిల్లీ ఉదం తం మనకు గుర్తు చేస్తుంది. సమాచారం ఎంత సులువుగా ఈ సాంకేతిక యుగంలో లభిస్తుంది అంటే గ్రంథ చౌర్యానికి పాల్పడ్డ వ్యక్తులు నేడు సులువుగా దొరికిపోతారు. ఉర్దూలోని ఓ నానుడి గుర్తుకొస్తుంది. న్రఖల్ కర్నే వాలోంకో అకీల్ రహానా కాపీ కొట్టేవాడికి కొంత జ్ఞానం ఉండాలి. న్యాయసహాయకుల తెలివితేటల్ని పూర్తిగా విశ్వసిం చకుండా చూడాల్సిన బాధ్యత ఆ సహాయం తీసుకున్న వ్యక్తులపై ఉంటుంది. గ్రంథ చౌర్యానికి సంబంధించి మన దేశంలో ప్రత్యేక చట్టం లేదు కానీ కాపీ రైట్ చట్టం పరిధిలోకి ఈ చర్యలు వస్తాయి. మంగారి రాజేందర్, వ్యాసకర్త డిస్ట్రిక్ట్/సెషన్స్ జడ్జి (రిటైర్డ్), మొబైల్ : 9440483001 -
ద్రోణాచార్య అవార్డులపై ఢిల్లీ హైకోర్టు స్టే
న్యూఢిల్లీ : ద్రోణాచార్య అవార్డులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కాగా శనివారం రాష్ట్ర ప్రతి భవన్ లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డుల పంపిణీ కార్యక్రమం జరగనున్న తరుణంలో ఈ తీర్పును వెలువరించింది. ఎక్కువ అర్హత ఉన్న జాతీయ రెజ్లింగ్ మాజీ చీఫ్, కోచ్ వినోద్ కుమార్‌ను విస్మరించిన ద్రోణాచార్య అవార్డు ఎంపిక కమిటీ రెజ్లింగ్ మరో కోచ్ అనూప్ సింగ్ దహియా పేరును ప్రకటించడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వినోద్ కుమార్ ఈనెల 18న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందించడానికి కేంద్రం అనుకూలంగానే ఉంది. కర్ణాటక హైకోర్టుకు జవాబిస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
దేవుణ్ని నమ్ము..నన్ను నమ్ము..కేసు వెనక్కి తీసుకో
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్ స్టీఫెన్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్‌కు కోర్టులో ఊరట లభించింది. అరెస్టు నుంచి అతనికి మినహాయింపునిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 17 వ తేదీ వరకు వాయిదా వేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తనకు గైడ్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ గత రెండేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని కాలేజీకి చెందిన ఓ పీహెచ్డీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తూ కాలేజీ ప్రిన్పిపల్ తంపూ తనకు ఫోన్లు చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన ఆడియో రికార్డులను, మెసేజ్ కాపీలను పోలీసులకు అందించింది. అయితే వీటిని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ తనకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు. ఆడియో టేపుల సారాంశం దేవుడ్ని నమ్ము, నన్ను నమ్ము....కంప్లయింట్‌ను వెనక్కి తీసుకో...లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ్.... పరిస్థితి నా చేయి దాటిపోయింది...నువ్వు వయసులో ఉన్నావ్.. మంచి అమ్మాయిలా ఉండాలి.. నువ్వు సంతోషంగా ఉండాలి..ఇది సెంట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ రెవరండ్ తంపూ మాటలు. ఇపుడివి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని ప్రిన్సిపల్ ఖండించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉన్నందున ప్రస్తుతం తానేమీ మాట్లాడన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను గతంలోనూ ఖండించిన ఆయన కాలేజీ అంతర్గత కమిటీ విచారణలో పీహెచ్డీ విద్యార్థిని తమకు సహకరించలేదని తెలిపారు. కాగా సతీష్ కుమార్ వేధిస్తున్నాడంటూ 2013 అక్టోబర్‌లో విద్యార్థిని కాలేజీ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో గత నెలలో పచ్చ చీర కట్టుకురా లేదంటే.. యాసిడ్ పోస్తానని సతీష్ కుమార్ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ..ఆమె గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పోరాటంలో ఢిల్లీలోని మహిళా సంఘాలు విద్యార్థినికి మద్దతుగా నిలిచాయి.