జెఎన్యూ అణువణువు శోధించండి: ఢిల్లీ హైకోర్టు | To Find Missing Student USE Sniffer Dogs, Delhi High Court | Sakshi
Sakshi News home page

జెఎన్యూ అణువణువు శోధించండి: ఢిల్లీ హైకోర్టు

Published Thu, Dec 15 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

జెఎన్యూ అణువణువు శోధించండి: ఢిల్లీ హైకోర్టు

జెఎన్యూ అణువణువు శోధించండి: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పందించింది. అతడు కనిపించకుండాపోయి రెండు నెలలు గడిచిపోతుంది. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తాన్ని స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేయించాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ వినోద్ గోయల్ లతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. వర్సిటీలో అనువణువు గాలించి ఏదో ఒక ఆధారాన్నయినా సంపాదించాలని సూచించింది.

అదే విధంగా జెఎన్యూ తో పాటు విద్యార్థి సంఘాలు (జెన్యూఎస్యూ)లో సెర్చ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది. నజీబ్ అహ్మద్ కిడ్నాప్ (అదృశ్యం)అయ్యాడని మొదటి నుంచి ఆరోపలున్నా, సాక్ష్యాలు లభ్యం కాకపోవడంతో కేసు యూ టర్న్ తీసుకుంటుంది. ఇష్టం లేక అతడే జెఎన్యూ నుంచి పారిపోయాడని వదంతులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు నజీబ్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు ప్రకటించిన రివార్డును రూ.50 వేల నుంచి 5 లక్షలకు పెంచేసినా ప్రయోజనం లేకపోయింది.

గత అక్టోబర్ 15న అదృశ్యమవ్వక ముందురోజు నజీబ్ తో గొడవపడ్డ నలుగురు విద్యార్థులకు లై డిటెక్టర్ తో టెస్ట్ చేస్తామని పోలీసు అధికారి రాహుల్ మెహ్రా తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని మరో 10 రోజుల్లో విషయం తెలుస్తుందన్నారు. నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీజ్ నవంబర్ 26న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అప్పటినుంచీ ఈ కేసుపై ధర్మాసనం విచారిస్తుంది. కేసులో పురోగతి మాత్రం కనిపించడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement