
న్యూఢిల్లీ: తన అరెస్టు అక్రమమని ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీహైకోర్టు మంగళవారం(జులై2) విచారించింది. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఏడు రోజుల్లో కౌంటర్ వేయాలని కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను జులై 17కు వాయిదా వేసింది.
అరెస్టు అక్రమమని పేర్కొంటూ వేసిన పిటిషన్‌లో పలు కీలక అంశాలను కేజ్రీవాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.గత ఏడాది తనను సీబీఐ కేవలం సాక్షిగా పిలిచిందని, ఇప్పుడు మాత్రం కొత్తగా ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని తెలిపారు. ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలనే సీబీఐ మళ్లీ రిపీట్ చేసిందని కోర్టు దృష్టికీ తీసుకువచ్చారు.
ఇప్పటికే లిక్కస్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులోఉన్న కేజ్రీవాల్‌ను జూన్26న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ కూడా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment