
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను మోదీని ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు ముందు సోమవారం(ఏప్రిల్29) విచారణకు వచ్చింది.
ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్‌లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పిటిషనర్ కోరారు. అయితే పిటిషన్‌లో విచారించదగ్గ మెరిట్స్ ఏవీ లేవని కోర్టు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment