న్యూఢిల్లీ: మరో న్యాయమూర్తికి తమ కేసును బదిలీ చేయాలంటూ అత్యాచార బాధితురాలైన నిర్భయ తల్లిదండ్రులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అలాగే, అత్యాచారానికి పాల్పడిన దోషుల ఉరిశిక్షను త్వరగా అమలు చేసేలా తీహార్ జైలు అధికారులను ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై 25న విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. నిర్భయ కేసును విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ కావడంతో, ఈ కేసు పదేపదే వాయిదా పడుతోందని నిర్భయ తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లైంగిక వేధింపుల కేసులను త్వరితగతిన విచారించేందుకు పటియాలా హౌజ్‌కోర్టులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కోర్టు న్యాయమూర్తి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment