సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఉధృతి దేశంలో నెలకొన్న ఆక్సిజన్ కొరత సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతకు సంబంధించి మాక్స్ దాఖలు చేసిన పిటీషన్ హైకోర్టు అత్యవసరంగా విచారణంగా స్వీకరించింది. ఈ సందర్బంగా కేంద్రంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం వాస్తవికతకు ఎందుకు మేల్కొనడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ నిల్వలు అయిపోతూ ఆసుపత్రులో ఆందోళన పరిస్థితి ఉంటే.. స్టీలు ప్లాంట్లు నడుస్తున్న వైనం తమకు షాకింగ్ ఉందని వ్యాఖ్యానించింది. తక్షణమే ఆక్సిజన్ కొరత సమస్య పరిష్కారం కోసం స్పెషల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. న్యాయమూర్తులు విపిన్ సంఘి , రేఖ పల్లిల ధర్మాసనం చేపట్టిన అత్యవసర విచారణలో తాజా ఆదేశాలు జారీ చేసింది. తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న, వైద్య ఆక్సిజన్ అవసరమయ్యే పౌరుల జీవన హక్కును పరిరక్షించే బాధ్యత కేంద్రంపై ఉందని వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ సరఫరా కోసం పరిశ్రమలు కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగుల వెయిట్ చేయలేరంటూ మండిపడింది. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు)
1400 మంది కరోనా రోగులున్న దేశ రాజధానిలోని ఆరు మాక్స్ ఆసుపత్రులకు అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూడాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవసరమైతే, పరిశ్రమల మొత్తం సరఫరాను మళ్లించాలని కోర్టు తెలిపింది. ఆరు ఆస్పత్రుల యాజమాన్యంలోని బాలాజీ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆక్సిజన్ సరఫరా తక్షణ ప్రాతిపదికన భర్తీ చేయకపోతే, రోగుల జీవితాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. వైద్య వినియోగం కోసం ఉక్కు, పెట్రోలియంతో సహా పరిశ్రమల మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిని మళ్లించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితి చాలా సెన్నిటివ్‌గా ఉంది కోవిడ్ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ ఏ విధంగానైనా సరఫరా చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 400 మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తున్నామన్నా కేంద్ర తరుపు న్యాయవది అనిల్‌సోనీ సమాధానం ధర్మాసనాన్ని సంతృప్తి పరచలేదు. టాటా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నపుడు కేంద్రం ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది అలాగే ఈ రోజు నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేక 24 మంది కరోనా రోగులు చనిపోయిన వైనంపై కూడా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. (ఆక్సిజన్ ట్యాంక్ లీక్ : 22 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment