
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం సీబీఎస్‌ఈ జారీ చేసిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్‌లోని అర్హత నిబంధనలపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటిఫికేషన్‌లోని నిబంధనలతో పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయిన అనేక మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమ స్పందన తెలపాల్సిందిగా కోర్టు సీబీఎస్‌ఈతోపాటు భారత వైద్య మండలి (ఎంసీఐ)ని కూడా ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత లేకపోయినా అభ్యర్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే దాని అర్థం వారిని కచ్చితంగా పరీక్షకు అనుమతిస్తారని కాదనీ, అది తుది తీర్పుకు లోబడి ఉంటుందంది. నీట్ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 9 చివరితేదీ కాగా పరీక్ష మే 6న జరగనుంది. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది
n eligibility norms for NEET
Comments
Please login to add a commentAdd a comment