న్యూఢిల్లీ: వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన నూతన గోప్యతా విధానం వల్ల ఏర్పడిన వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. నూతన గోప్యతా విషయంలో కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్ పోటాపోటీగా ఒకరిపై మరొకరు దిల్లీ హైకోర్టులో అభియోగాలు మోపుకుంటున్నారు. వినియోగదారులతో నూతన విధానాన్ని ఆమోదింపజేసేందుకు వాట్సాప్ ఉపాయాలు పన్నుతోందని తాజా ఆఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఇంకా చట్టరూపం దాల్చకముందే నూతన గోప్యతా విధానాలను ఆమోదింపజేసేందుకు ప్రతిరోజూ నోటిఫికేషన్లను పంపించి "బలవంతం" చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
కొత్త గోప్యతకు సంబంధించి ప్రస్తుత వినియోగదారులకు నోటిఫికేషన్లను పంపకుండా ఉండటానికి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం కోర్టును కోరింది. వివాదాస్పదంగా మారిన గోప్యతా విధానానికి వ్యతిరేకంగా గతంలో వాట్సాప్‌పై పలు కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఆ సంస్థ మాత్రం తాము చెప్పిన గడువు(మే 15) ప్రకారమే ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చినట్లు చెప్పింది. అయితే ఆ నిబంధనలను ఆమోదించని వినియోగదారుల ఖాతాలను తొలగించడం లేదని మాత్రం తెలిపింది. మరోవైపు, ఈ విధానం ఐటీ నిబంధనలు-2011కు అనుగుణంగా లేవని గతంలో కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment