
న్యూఢిల్లీ: అలంకారానికి వాడే సిందూరం, కాటుక లాంటి వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తూ మహిళలకు అత్యంత అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్లపై పన్ను వేయడంలోని హేతుబద్ధత ఏంటని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. శానిటరీ న్యాప్‌కిన్లు అత్యంత అవసరమని, వాటిపై పన్ను విధించడానికి సంబంధించి వివరణ ఇవ్వగలరా అని అడిగింది. జీఎస్టీ మండలిలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాప్‌కిన్లపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది.